Varma Kumar

Drama Tragedy

5.0  

Varma Kumar

Drama Tragedy

రాజావారి సత్రం

రాజావారి సత్రం

4 mins
568


నాకు బాగా గుర్తు,  అమలాపురం మొదటి ఆట  చిరంజీవి  సినిమాకి వెళ్లి  నేను సోగ్గాడు సైకిల్ మీద ఇంటికి తిరిగి వస్తుంటే,,  మా ఊరి చివరి ఉన్న మర్రి చెట్టు పడిపోయేలా ఉగుతుంది...

వేసవి కాలం మా తాత పొలంలో ధాన్యం బస్తాలు దగ్గర కాపలాకి నన్ను తోడుగా తీసుకుని వెళ్ళేవాడు.... పండు వెన్నెలలో పొలం మధ్య కల్లంలో,  మడత మంచం వాల్చి, నన్ను పక్కన పొడుకోపెట్టుకుని, మన ఊరి చివర ఉన్న మర్రి చెట్టు మీద దెయ్యాలు ఉంటాయి, ఎప్పుడు వంటరిగా వెళ్ళకు అని రకరకాల కథలు చెప్పి నన్ను భయపెట్టె వాడు,,, మా తాత మాట గుర్తుకు వచ్చి సోగ్గాడిని వెనకనుండి నా రెండు చేతులతో వాడి నడుమునీ పాముల చుట్టేసి కళ్ళు మూసేశాను,,, శోభన్ బాబు సినిమా సోగ్గాడు రిలీజ్ అయినా రోజు వాడు పుట్టాడు అని మా ముంగండ వాళ్ళు అందరు (సోగ్గాడు)అని పిలుస్తారు వాడినీ......   

మర్రి చెట్టు పైనా ఉన్న ఆకాశాన్ని నల్ల మబ్బులు కమ్మేశాయి. ఎక్కడో దూరంగా కురుస్తున్నా వర్షానికి తడిచిన మట్టి వాసనను ఇటుగా విస్తున్న గాలి తీసుకొని వస్తుంది.   గాలి వేగం పెంచిన ఐదు నిముషాలకు చినుకులు మొదలయ్యాయి... మర్రి చెట్టు మీద వాలిన గబ్బిలాలు అరుస్తూ ఆకాశంలో కి ఎగిరిపోతున్నాయి... సోగ్గాడు సైకిల్ చాలా స్పీడ్ గా తొక్కడం మొదలుపెట్టాడు ....   మా ఇల్లు సగం దూరంలో  ఉండగానే గాలి వాన మొదలయింది.. కరెంట్ పోయింది.. చీకటిలో స్పీడ్ గా వెళ్తున్నా మా సైకిల్  నీళ్లు నిండిపోయిన గుంటలో పడిపోయింది... నేను ఎడమ పక్కకు సోగ్గాడు కుడి పక్కకు పడిపోయాం......  

********

రంగారావు మాస్టర్ గారు  ఇంటి అరుగు మీద పడక కుర్చీలో కూర్చుని, హరికేన్ లాంతరు వెలుగులో సిగరెట్ కలుస్తూ మధ్య మధ్యలో అల్లం" టీ " తాగుతున్నాడు.... ఇంటి దూలానికి దిగిన మేకుకు వేలాడదీసిన రేడియో లో పాత పాటలు వస్తున్నాయి..... సోగ్గాడు నేను సైకిల్ నీ నడిపించుకుంటూ ఆ వానలో తడుచుకుంటు వస్తుంటే,, సైకిల్ సౌండ్ విని

ఎవరు? అది.... అన్నారు రంగారావు గారు మాస్టర్.

నేను అండి సోగ్గాడిని ! సినిమా కి వెళ్లి వస్తుంటే వాన మొదలైంది. చీకటిలో కనపడక సైకిల్ గుంటలో పడిపోయింది... ముందర చక్రం విరిగిపోయింది అండి.... అన్నాడు

అయ్యో దెబ్బలు తగిలాయా రా ?

లేదు అండి. అన్నాను నేను.

తుపాన్ పట్టింది అంటా ! అప్పుడు ఎప్పుడో 1890 లో వచ్చిన భయంకరమైన తుఫాన్ లాంటిది అంటా !  ఒక వారం రోజులు పాటు ఆగకుండా కురుస్తూనే ఉంటది అంటా వాన. ఇందాక రేడియో లో చాలా భయంకరంగా చెప్పాడు రా ! ఒక వేల ఆ వర్షం నీటికి గోదావరి పొంగింది అంటే. తిప్ప లంక దగ్గర  ఏటు గట్టు కొంచెం బలహీనంగా ఉంది కదా ! అది తెగిపోయి దిగువన ఉన్న మన ఊరు తో పాటు చుట్టూ పక్కల అన్ని ఊళ్ళు మునిగిపోతాయి... ఎందుకు అయినా మంచిది ముందే మన ఊరు వాళ్ళం ఏటు గట్టు మీద పడాలరాజావారు కట్టించిన సత్రంలోకి వెళ్ళిపోతే మంచిది.... అని అన్నాడు మాస్టర్ గారు

*******

నాలుగు రోజులు అయినా వర్షం తగ్గలేదు.. గాలి వీస్తూనే ఉంది.. ఊరి చివరి చాలా కాలం నుండి ఉన్న మర్రి చెట్టు వేర్ల తో సహా దారికి అడ్డుగా పడిపోయింది.. ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న రవిచెట్టు పెద్ద పెద్ద కొమ్మలు విరిగిపోయి పడిపోయాయి. మాణిక్యం గాడి పాత కాలంనాటి పెంకులాసావిడి అయితే ఏకంగా కుప్పకూలిపోయింది.. మా పేట లో ఉన్న పురిగుడుసులు మీద ఉన్న తాటాకు కప్పులు ఆ గాలికి ఎగిరిపోయి దూరంగా పడిపోయాయి.. పంట చేలు, అరటితోటలు, మొక్కజొన్నతోటలు, పుగాకు తోటలు, పసుపు తోటలు, వర్షం నీటితో ముగిపోయాయి.. నేను పుట్టిన తరువాత ఇంత భయంకరం అయినా తుఫాన్ నీ ఇదే చూడడం..... మా ఊరి పంచాయతీ  రామన్న గాడు డప్పు తీసుకుని వచ్చి దానిని ఒక నిమిషం

బాదాక నాలుగు రోజుల నుండి కురిసిన వర్షానికి  గోదావరి పోటు మీద నడుస్తుంది. తిప్పలంక దగ్గర ఏ క్షణం అయినా ఏటు గట్టు తెగిపోయేలా ఉంది... కావున అందరు ఏటు గట్టు మీద సత్రం దగ్గరకు వెళ్ళిపోవాలి..అహో...... అని సాటింపు వేసి వెళ్ళిపోయాడు...

*********

ముంగండ జనం అంతా ఇంట్లో సామాన్లు గొను సంచుల్లో మూటలు కట్టి ఎడ్ల బండ్లు మీద ఏస్తున్నారు...... కొందరు అయితే, మూటలు నెత్తిమీద పెట్టుకుని ఆ జోరువానలో నడుచుకుంటు వెళ్లిపోతున్నారు సత్రం దగ్గరకు ..............  పల్లయ్య సార కొట్టు దగ్గర మరి ఏం జరిగిందో తెలియదు కానీ  పీకలదాక తాగేసిన సోగ్గాడు  రత్తమ్మ కొడుకు సుబ్బులు గాడితో గొడవపడ్డాడు. సార కాయతో సుబ్బులుగాడి తల పగలకొట్టేసాడు సోగ్గాడు,,,,,,,, పల్లయ్య సోమరెడ్డి, బంగార్రాజు, సుబ్బులు గాడిని సోగ్గాడిని మందలించి విడదీశారు....అయినా  కోపం తగ్గలేదు సోగ్గాడికీ, సార కొట్టు పక్కన ఉన్న కొబ్బరిచెట్టుకి దెబ్బల తో అనుకుని కూర్చున్నా సుబ్బులు గాడి గుండెల మీద మోకాలితో తన్నబోతుంటే ఒక్కసారి పక్కకు తప్పుకున్నాడు. సుబ్బులు గాడు , దానితో కొబ్బరిచెట్టునీ తన్నేసాడు మోకాలు చిప్ప పక్కకు తప్పేసుకుంది. కాలు పట్టుకుని కింద పడిపోయి ఒకటే ఏడుపు సోగ్గాడు.

ముంగండ పోస్ట్ ఆఫీస్ పక్కన RMP డాక్టర్ ఆచార్య గారి హాస్పిటల్ దగ్గరకు, మల్లన్న గాడి రిక్షా మీద తీసుకొని వెళ్ళాం సోగ్గాడిని,,,,  మొత్తం ఊరు అంతా కాళీ అయిపోయింది. కనుచూపు మేరలో ఎవరు కనబడటంలేదు. హాస్పిటల్ కు తాళాలు వేసేసారు. ఒకటే కేకలు ఏడుపు సోగ్గాడు.... దానికి తోడు జోరు వాన ఒకటి .....

అందరు సత్రం దగ్గరకు వెళ్లిపోయారు, సార మత్తులో ఈ రోజు సాయంత్రం వేయించిన సాటింపు గురించి మర్చిపోయాం పదండి సత్రం దగ్గరకు అని అరిచాడు పల్లయ్య......

                 ******************

మా ఊరి తో పాటు పక్క ఊళ్ళ జనం తో నిడిపోయింది  పడాలరాజావారి సత్రం.....

సత్రానికి ఒక మూల వట్టి గడ్డి పరుపుల పేర్చి సోగ్గాడిని దాని మీద పడుకో పెట్టాము,,,,

గోదావరి ఉరకలు పరుగులు మీద ప్రవహిస్తుంది,

పది పైసల నాణేలు, ఐదు పైసల నాణేలు, పొంగుతున్నా గోదావరిలో విసిరేసి కొంచెం శాంతించు తల్లి, కోపం చల్లార్చుకో అని పార్థనలు చేస్తున్నారు. మా ఊరి ప్రెసిడెంట్ గారు సత్రం లో ఉన్న వారికీ భోజనాలు వండిస్తున్నారు.......

సత్రం లో సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని ఉన్న పడాలరాజావారి పది అడుగుల చిత్ర పాటం చూసి ఒక్కసారిగా నోరు తెరిచేసాను అంతా అద్భుతంగా ఉన్నారు రాజావారు.

అటు పక్క సత్రం సిమెంట్ స్తంభానికి జారబడి సిగరెట్ కలుస్తున్నా రంగారావు మాస్టర్ దగ్గరకు వెళ్లి,

మాస్టార్ గారు పడాల రాజావారు ఎవరు?

ఆయన ఈ సత్రం ఇక్కడ ఎందుకు కట్టించారు?

ఆయనది ఏ ఊరు?

ఇలా రకరకాల ప్రశ్నలు వేసి మీకు తెలిస్తే చెప్పకూడదా అని అడిగాను .....

సగం కాల్చిన సిగరెట్ కింద పడేసి కాలుతో తొక్కి ఆర్పేశాక...............చెప్పడం మొదలుపెట్టారు

**********

ఒక అప్పుడు మన ముంగండ ఊరు కాదు ఐదు వందల ఎకరాల  పంట పండే భూమి, పడాల రాజావారిది ఈ భూమి అంతా ఇవే కాదు విజయనగరం లో రెండువేల ఎకరాలు ఉన్నాయి... కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నుండి కోతల అప్పుడు, ఊడ్పులప్పుడు, వలస వచ్చిన కూలీలు ఈ గోదావరి గట్టు మీద తర్బల్ బరకాలతో చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఇక్కడే నివాసం ఉండి పని చేసుకునేవారు. వాళ్ళ సొంత ఊరిలో వాళ్లకు అంటు సొంత ఇల్లు లేవు. కూరగాయలు బియ్యం తెచ్చుకోవాలి అంటే పదిమైళ్ళ దూరం నడచి వెళ్ళవలసి వచ్చేది... పడాల రాజావారు , ఎంతో పెద్ద మనసుతో ఆ ఐదు వందల ఎకరాలను పూడ్చేసి కూలీలకు ఇళ్ల స్తలాలుగా రాసిఇచ్చేసి ముంగండ అని దానికి పేరు పెట్టాడు , పిల్లల చదువుకోసం బడి కట్టించాడు.  నీళ్లు చెరువులు, బావులు తవ్వించాడు. ఆయన పుట్టిన రోజునాడు ఊరు వాళ్ళ అందరికి బట్టలు దానం చేసేవాడు. రాజావారు బండి మీద వెళ్తుంటే వంగి వంగి దండాలు పెట్టేవారు జనం.......

జులై నెల 1890 వర్షాకాలం తొమ్మిది నెలల గర్భిణీ పడాల రాజావారి భార్య వరలక్ష్మి. సరిగ్గా పట్టింది తుఫాన్. పడాల రాజావారు విజయనగరలో ఆయన చిన్న నాన్న ధర్మరాజుగారు  చనిపోయాడు అని భార్యకు తోడుగా ముంగండ ఊరులో కొంతమంది ఆడవాళ్లను పెట్టి విజయనగరం వెళ్ళాడు... ఉదయం నుండి ఆకాశం మబ్బులు పట్టేసి వేగంగా విస్తుంది గాలి సాయంత్రం దీపాలు వేళ అయ్యేటప్పటికి మొదలైంది గాలివాన ఉరుములు మెరుపులు బయట చాలా భయంకరంగా ఉంది.. చెట్లు విరిగిపోతున్నాయి. వారం రోజులు అయినా వాన తగ్గలేదు ఏకధాటిగా కురుస్తూనే ఉంది పడాల రాజావారు తుఫాన్ కావడం వల్ల  ఇంకా రాలేదు...ఆ రోజు శనివారం అర్ధరాత్రి వరలక్ష్మి గారికి పురుటి నొప్పులు మొదలయ్యాయి. 

ముత్తమ్మ వానలో తుడుచుకుంటు వెళ్లి డాక్టర్ రాంపండు గారిని తీసుకుని వచ్చింది. డాక్టర్ గారు ఇంటికి వచ్చేటప్పటికే  వరలక్ష్మి మగ బిడ్డను కనేసింది..........

*************

వారం రోజులు గా కురుస్తున్నా వర్షానికి అర్ధరాత్రి రెండు గంటల సమయం లో గోదావరి ఏటు గట్టు తెగిపోయి  ముంగండ నీ చుట్టూ పక్కల ఊళ్ళను తూడుచుకుని పోయింది....

పడాల రాజావారు ముంగండ వచ్చేటప్పటికి ఊరు మొత్తం స్మశానంగా మారిపోయింది. ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు  ఊరు మొత్తం శెవలే పోలీస్ లు వచ్చి శెవలను తీస్తున్నారు.....అందులో ఆయన భార్య వరలక్ష్మి, పుట్టిన మగబిడ్డ శెవలుగా కనబడేసరికి  గుండె పగిలేలా ఏడ్చారు రాజావారు ...........

అది జరిగిన నెల రోజుల తరువాత   మళ్ళీ ఇటువంటి దారుణం జరగకూడదు అని ఏ ఒక్క కుటుంబం గోదావరి బలి కాకూడదు అని..... పంగిడి కొండా రాయి తెప్పించి. ఏటు గట్టు బలంగా వేయించి ఈ సత్రం కట్టించారు......  

మనం ముంగండ లో బ్రతుకుతున్నా ఇప్పుడు ఈ సత్రం లో ప్రాణలు కాపాడుకున్నా ఇది ఆయన పెట్టిన భిక్షే .... అని చెప్పాడు రంగారావు మాస్టర్ గారు......

**********

అది విన్నాక నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. కళ్ళు తుడుచుకుని ఆయన చిత్ర పటానికి దండం పెట్టుకున్నాను

అర్ధరాత్రి ఏటు గట్టు మీద ఉన్న తాడిచెట్టు మీద పిడుగు పడి  కాలిపోతుంది  పిడుగు శబ్దానికి సత్రంలో ఉన్న వాళ్ళం అంత నిద్రలేచిపోయాం,, పక్షులు ఆకాశం లోకి ఎగిరిపోతున్నాయి .

అప్పుడే పెళపెళ మని తెగిపోయింది ఏటు గట్టు దిగువన ఉన్న అన్ని ఊళ్ళు మునిగిపోయాయి...............



Rate this content
Log in

Similar telugu story from Drama