పాత సినిమా పిచ్చి
పాత సినిమా పిచ్చి
అయినా ఎవ్వరికీ లేని ఈ పాత సినిమా పిచ్చి నీకెలా పట్టుకుంది అని అడుగుతారు చాలా మంది.
ఎందుకో తెలీదు నాకు చిన్నప్పటి నుంచీ పాత సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం.
మాయాబజార్ కావొచ్చు.గుండమ్మ కథ,మిస్సమ్మ,భాగ్య రేఖ ఇలా చెప్పుకుంటూ పోతే 1930ల నుంచీ తీసిన తెలుగు సినిమాలు.బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మళ్లీ మళ్లీ చూస్తాను.
చాలా వరకు ఆ సినిమాల నుండి ఏదో నేర్చుకున్నాను.
ఏదో.ఏమంటారు దాన్ని.చివరి వరకూ పోరాడాలనా.
ఆశావాదమా.కష్టాలు శాశ్వతం కాదనా.
వాడిన పూలు వికసిస్తాయనా.
టీవీలో ఏదో అడ్వర్టయిజ్మెంటు వస్తోంది.
రేపు సాయంత్రం రోజులు మారాయి సినిమా వేస్తారట.
అవునా.రేపు పనులన్నీ తొందరగా పూర్తి చేయాలి అనుకున్నాన్నేను.