ప్రతి మనసులోని కోరిక
ప్రతి మనసులోని కోరిక
ఏదో బాగానే కోరుకుంటున్నట్టున్నావ్.
నేను పిచ్చుకలు తినడానికి సజ్జలు వేస్తుంటే నా ఫ్రెండ్ విశాల్ అన్నాడు.
ఏం లేదురా.కొంత మందికి బయట తిరిగితే సంతోషం.మరి కొంత మందికి ఏదైనా కొంటే సంతోషం.
ఇంకొంత మందికి మరొకరిని బాధ పెడితే సంతోషం.
నాకు ఈ పిచ్చుకలకి తిండి నీరు పెట్టడం సంతోషాన్నిస్తుంది.వాటికి సాయం చేయడం వల్ల మంచి జరుగితే అది
విన్-విన్ సిట్యువేషన్ కదా అని నేను ముందుకు కదిలాను.
మరుసటి రోజు నేను యథావిథిగా పిచ్చుకలు తాగడానికి మట్టి పాత్రలో నీళ్ళు పెడుతున్నాను.
విశాల్ వచ్చి నేను అక్కడే ఉంచిన సజ్జలు తీసి వాటిని పిచ్చుకల వైపు చల్లుతున్నాడు.
బహుశా అందరిలో ప్రతి ప్రాణికీ సాయం చేయాలని కోరిక ఉంటుందేమో.కాకపోతే అది అందరిలోంచీ తొందరగా బయటికి రాదు అని అనుకున్నాను.