Srinivasa Bharathi

Drama

3  

Srinivasa Bharathi

Drama

పుట్టిల్లు....శ్రీనివాస భారతి

పుట్టిల్లు....శ్రీనివాస భారతి

1 min
460


"ఐతే ఎంటట?"

"నేను పుట్టింటికి పోతున్నా"

"వెళ్ళు.. వెళ్ళు..ఇంకెందుకాలస్యం?"

"నన్నెప్పుడు గెంటేద్దామా అనేగా మీ ఆలోచన?"

"వద్దంటే వినే రకమా నువ్వు?"

"నా ముద్దు ముచ్చటెం తీర్చారని?"

"నీకిప్పుడేం లోటోచ్చిందని?"

"ఓ నెక్లెస్ కనీసం కొన్నారా?"

"ఉండాలికదా.ఉన్నవి చాలవా?"

"చీటి డబ్బుల్తో ఏవో రెండు వస్తువులు కొనుక్కొన్నా అంతేగా..."

"అవును రెండు నెలలకోసారి"

"ఐతే ఏం మీరు కొనరు నేను కొనుక్కోంటే చూడలేరు"

"పుట్టింటోళ్లు బంగారం ఏమైనా పెడ్తానన్నారా...వెళ్తానని ఎగుర్తున్నావ్?"

"మా అన్నయ్యఏం పిసినార్లు కారు మీలాగా"

"అందుకేనా మొన్న వారం రోజులుండి వెయ్యి రూపాయల చీరొకటి తెచ్చుకున్నావ్"

"అంతా మా వదిన పని"

"మా చెల్లెం చేసింది?"

"ఆవిడ రోజూ అన్నయ్య చెవులు కొరికెయ్మేడమే పని

దేనికో?"

"మీ చెల్లి వచ్చినప్పుడల్లా దోచుకు పోతోంది అని ఒకటే నస."

"కావచ్చేమో... పెళ్లై పదిహేనేళ్లు దాటినా ఇంకా వాళ్ళని"

"ఐదేళ్లు రానిచ్చారా ఎవరైనా?"

"నువ్వు వేరేవాడిని ప్రేమిస్తే వాళ్లేందుకు ఒప్పుకోవాలి?"

"ఐతే ప్రేమించడం నా తప్పా?"

"ఆశించడం తప్పంటున్నానంతే"

"అందుకే వడ్డీతో సహా వసూలు చేస్తున్నా"

"వాళ్ళకీ ఇద్దరాడ పిల్లలు..వాళ్ళ అవసరాలు కూడా చూసుకోకపోతే ఎలా మరి?"

"ఐతే...ఆడపడుచును గౌరవించారా?"

"నీకేం లోటు చేసారు వాళ్ళు?"

"ఎం ఇచ్చారని?"

"ఎంత పెట్టినా లేదనడం మీ ఆడవాళ్ళ అలవాటు

ఎవరన్నారు అలా?"

"చాలామంది అంటుంటార్లే"

"మొన్నీ మధ్య మీ అన్నయ్యకు గుండె పోటు వచ్చిందట గా"

"అదో నాటకం..అలాగైతే ఏమీ ఇవ్వక్కర్లేదు. అదీ ప్లాన్ వాళ్ళది.,

"అబ్బో చాలా విషయాలు తెలుసు నీకు"

"మరేం అనుకున్నారు నేనంటే"

"అడజాతి ఆణిముత్యం"😊

"అదీ నేనంటే?....."

"సర్లే. వెళ్లాలంటే వెళ్ళు... నా చిన్న పెళ్ళాం ఉందిగా.

కాస్త సర్దుకుపోతా..."

"ఈ పాడు తాగుడెంటి కొత్తగా?"

"నువ్వోదిలేస్తే ఎవరో ఒకరుండాలిగా?"

"వెళ్ళను లెండి. ఇప్పుడా బుడ్డీ ఓపెన్ చెయ్యొద్దు"

"ఫర్లేదు...వెళ్ళు."

"నే వెళ్లడం లేదు..".ముక్కు చీదు కొంటూ లోనికి వెళ్ళింది విశాలాక్షి.

నరేంద్ర కు నవ్వొచ్చింది.

గోపాలకృష్ణ కు భార్య వెళ్లిన సారల్లా యాభై వేల కి

తక్కువ కాకుండా సర్దుతూ బామ్మర్ది కుటుంబాన్ని ఇబ్బందులనుండి బైట పడేస్తున్న విషయం విశాలక్షికి తెలిదింకా. అలాగే తాగుడు అలవాటు లేదన్న నిజం.

మీరు కూడా చెప్పకండి.

&&&&&&&****************&&&&&&&&&



Rate this content
Log in

Similar telugu story from Drama