Srinivasa Bharathi

Comedy

3  

Srinivasa Bharathi

Comedy

దురద......శ్రీనివాస భారతి

దురద......శ్రీనివాస భారతి

1 min
545


"నేనో పుస్తకం రాసాను"

"ఎన్ని పేజీలుంటుంది?"

"వెయ్యి నూట పదార్లు"

"అన్ని పేజిలా?..అట్ట చూసి పెదవి విరుస్తారు"

"ఏంచెయ్యమంటావ్?"

"సగానికి సగం నరికితే"

"పేజికోక అమృత గుళికలు గా రాశా"

"మృత గుళికలు కాకూడదంటే నే చెప్పిందే మార్గం"

"తప్పదంటావా?"

"తప్పదుమరి..ఈ రోజుల్లో అన్ని పేజీలు చదివేంత తీ రికెక్కడిది?"

"ఆలోచిద్దాం"

"ఇంతకూ రేటెంత?"

"ఓ ఐదొందలు...లేదా ఐదొందల పద్దెనిమిది"

"ఎవడు కొంటాడని?"

"కొనరంటావా?"

"పబ్లిసిటీ ఇస్తే కొంత వరకు"

"ఎంతవుతుందంటావ్?"

"ఓ లక్ష కనీసం"

"అంత అవసరమా?"

"అసలది చాలదేమో?"

"పోనీ పుస్తకం 250 పేజీలు చేసి రేటు కూడా అంతే పెడ్తే"

"సైజ్ ఎంత పెట్టాలనుకుంటున్నావ్?"

"పావుఠావు సైజ్ అయినా"

"రేటు మాత్రం 150 వరకు ..దాటకుండా చూసుకో"

"సైజ్ తగ్గిస్తే?"

"రేటు తగ్గించాలి""

"పబ్లిసిటీ ఖర్చు వద్దు"

"ఐతే 100 పేజీల పుస్తకం ..50 రూపాయల రేటుతో"

"తప్పదంటావా?"

"నీ మేలుకోరి చెబుతున్నా..."

"500 పేజీలకు తగ్గకుండా రాసి 500 రూపాయలకు అమ్మాలి."

"ఐతే శృగారంలో సెక్స్ కలిపి రాయి..అప్పుడే మార్కెట్ అవుతుంది".

"నాకు రాదు...ఎలా రాయమంటావ్?"

"అందులో పది లైన్లు, ఇందులో ఇరవై, ఇంకొదాంట్లో..."

"వెయ్యో, రెండు వేలో ఖర్చు పెట్టి కూర్చుంటే..."

"ఇంతకీ నీకీ పుస్తకం ప్రింటింగ్ పిచ్చి ఎందుకని?"

"చిరస్థాయిగా పేరు మిగుల్తుందిగా"

"దురద"

"ఏమిటి?"

"దురదగోండు ఆకు సరదాలే?"

"పుస్తకం అమ్మాలంటే సభ జరపాలి. సన్మానమూ తప్పనిసరి. ఆ ఖర్చులు...బిరుదులు, పొగడ్తలు అన్నీ లకారం వేసుకో...ఈ రోజుల్లో"

"అంత అవసరమా?"

"నా ప్రశ్న నువ్వేస్తున్నావ్"

"ఐ మీన్..లక్ష ఎందుకని?"

"చప్పట్లుకొట్టేవాళ్ళు,దండలు,శాలువలు,వేసేవాళ్లు ......హాలు నిండొద్దంటావా"

"అవునవును.. తప్పదుగా"

"సిద్ధమేనా"

"దేనికి"

"ఖర్చు పెట్టడానికి"

"సరే"

"ఏ రకం పుస్తకం రాద్దామనుకొంటున్నావ్?"

"నువ్వన్నదే"

"సరే ఓ నలభై పంపు"

"అప్పుడే ఆర్దరా..ఎంత మంచి వాడివిరా"

"నేనన్నది..డబ్బు నలభై వేలు పంపమని"

"ఎందుకు?"

"అజ్ఞాత రచయిత పుస్తకం రాయాలిగా"

"నేను రాయనా ?రాయలేనా?"

"నువ్వు రాస్తే ఎవడు చదువుతాడని?

"వాడెవడో రాస్తాడు...పేరు మాత్రం మనది .అంతే"

"సరే....రేపు చెబుతా లే."

రాత్రంతా ఆలోచించాడు కాబోయే రచయిత..

ఉదయం పేపర్లో వచ్చింది...

మానసిక వికలాంగులకు లక్ష, అనాధాశ్రమానికి యాభై, వృద్దాశ్రమానికి యాభై ఇచ్చిన దాతకు కలెక్టర్ వారి సన్మానం....అని.

ఇంతకీ పై సంభాషణ ఎవరెవరి మధ్య అనుకున్నారు..

కొత్త రచయిత.....పాత పుస్తకాలు కొనే వాడికి..(అంతకుముందు అతడూ రచయితే సుమండీ)

------------@@@@@@@@@@@@@@-------------


Rate this content
Log in

Similar telugu story from Comedy