Esha అద్వైత

Comedy Drama Romance

4.3  

Esha అద్వైత

Comedy Drama Romance

💗 దిల్ సే 💗

💗 దిల్ సే 💗

8 mins
461



తిరుమల........




శ్రీ వారి దర్శనానికి క్యూ లైన్ లో నిలబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది నవిక......


బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా వుంది.....చాలా సేపటి నుంచి  నిలబడి వుండడం వల్ల కాళ్ళు పీక్కుపోతుంటే, ఆపసోపాలు పడుతూ, ఎవరిని ఎం అనలేక లోలోపలే గొణుక్కుంటూ వంకర్లు పోతోంది.....


ఏయ్ సరిగ్గా నిలబడలేకపోతున్నావా.....నీకన్నా మీ నాన్నమ్మ నయం.... ఈ వయసులో కూడా హుషారుగా వున్నారు..... నీకు వళ్ళంతా బద్దకం తప్ప ఇంకేం లేదు అంటూ వెనుక నుంచి ఆమె తల్లి లహరి మొట్టికాయ వేస్తుంది......


ఏడుపు మొహంతో వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మను చూసి ఎదో అనబోతూ , తల్లి వెనుక నిలబడ్డ తన తండ్రి రఘునాధ్ కోపంగా తన వైపే చూడడంతో భయంగా తల దించేసుకుని, ముందుకు తిరిగుపోతుంది......


పక్క లైన్ లో నిలబడి చాలా సేపటినుంచి ఆమె అవస్థ చూస్తున్న నివేద్ కి, నవ్వాగదు..... అతికష్టం మీద నవ్వుని కంట్రోల్ చేసుకుంటాడు......


నివేద్ నవ్వుని కంట్రోల్ చేసుకోవడం చూసి, అతడి వైపు చురుగ్గా చూస్తుంది నవిక.....


ఆమె తనవైపే చూడడంతో , బాగా అయ్యిందా అన్నట్లు సైగ చేస్తాడు, వాళ్ళ అమ్మ మొట్టడం గుర్తు చేస్తూ.....



పోరా అయిల్ డబ్బా అంటూ లిప్ మూమెంట్ ఇస్తుంది....


ఇక్కడ కాదు కాలేజ్ లో చెప్తానే నీ సంగతి అంటూ పెదవులు కదిలించి,తన లైన్ ముందుకు కదలడంతో దర్శనానికి వెళ్ళిపోతాడు......


నవిక నివేద్ ని కోపంగా  చూసి మొహం తిప్పేసుకుంటుంది...


కాసేపటికి దివ్యమంగళ స్వరూపుడైన శ్రీవారిని దర్శించుకుంటారు నవిక ఫ్యామిలీ.....


నవిక: ముద్దుగా కాస్త బొద్దుగా , చూడగానే ఆకట్టుకునే రూపంతో బబ్లీ గా వుంటుంది.... తన ఫ్రెండ్స్ రాశిఖన్నా లా వుంటావని మోస్తుంటే లోలోపలే మురిసిపోతూ , పైకి మాత్రం పొగడ్తలు అంటే గిట్టనట్లు బిల్డప్ ఇస్తుంది.....తండ్రి అంటే చచ్చేంత భయం.....తల్లి అంటే ఇష్టం వున్నా, తన అభిప్రాయాలను విలువ ఇవ్వరని ,అంత సఖ్యతగా మెలగదు....... నవికకు లోలోపల తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం వుంటుంది....వాళ్ళతో క్లోస్ గా వుండాలని అన్ని షేర్ చేసుకోవాలని ఆశ పడుతూ వుంటుంది...... అన్నింటికీ ఆంక్షలు పెట్టె తల్లి, తన ముందు నోరు మెదిపినా సహించని తండ్రి...... క్లోస్ ఫ్రెండ్ లాంటి వదిన కావ్య.......తను అడగకముందే అన్ని సమకూర్చే అన్నయ్య వంశీ....... తన తల్లిదండ్రులతో ఏ విధంగా అయితే వుండాలని కలలు కంటుందో అదే విధంగా అన్నవదినలతో వుంటుంది......ఇది నవిక ఫ్యామిలీ.....



ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.....



నివేద్: సన్నగా ,పొడుగ్గా, ఫెయిర్ లుక్ తో, సన్నని మీసం ,లైట్ గా ట్రిమ్ చేసిన బీయర్డ్ తో చాక్లెట్ బాయ్ లా వుంటాడు...... తండ్రి భాస్కర్ మిలిటరీ ఆఫీసర్, దేశసేవ చేస్తూ వీరమరణం పొందిన తండ్రి అంటే అతడికి అమితమైన గౌరవం, తల్లి సురేఖ స్కూల్ టీచర్....తల్లే తన మొదటి ఫ్రెండ్...... అన్ని ఆమెతో షేర్ చేసుకుంటాడు..... ఈ తల్లి కొడుకులకు ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు.....ఈ ప్రపంచంలో వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు హ్యాపీ గా బ్రతుకుతున్నారు....



నరేన్: సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ, నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నాడు...... తన రిలేటివ్స్ లో తనదే కాస్త హైఎస్ట్ శాలరీ కావడంతో అందరిలో కాస్త ఇగో ఎక్కువ చూపిస్తాడు..... తండ్రి ఉమామహేశ్వరరావు తల్లి మీనాక్షి.....చెల్లి శ్వేత




దర్శనం  చేసుకుని బయటికి వస్తారు నవిక ఫ్యామిలీ....


కావ్య నవిక బ్యాంగిల్ స్టోర్స్ కి వెళ్తే, లహరి గారు మరో స్టోర్ లో ఆమెకు కావాల్సినవి తీసుకుంటుంటే, రఘునాద్ గారు వంశీ ప్రసాదాలు తేవడానికి వెళ్తారు.....



వదిన ఈ బ్యాంగిల్స్ నీకు చాలా బాగుంటాయి అంటూ పింక్ కలర్ బ్యాంగిల్స్ తీసి కావ్యకు వేస్తుంది.....


ఇవి నాకన్నా నీకే బాగుంటాయి అంటూ మరో సెట్ తీసి  నవిక కు వేస్తుంది కావ్య.......


పక్క షాప్ లో నివేద్ తన తల్లి కోసం, పూజా సామగ్రి చూస్తూ వుంటాడు....


వదిన ఈ బ్యాంగిల్స్ నాకన్నా వాడికి ఇంకా బాగుంటాయి కదా అంటూ నివేద్ ని చూపిస్తుంది.....


నివేద్ కి అవి వినబడి, వాళ్ళ దగ్గరకు వస్తాడు....


వీడేంటి ఇక్కడకు వస్తున్నాడు, అమ్మ చూసిందంటే చంపేస్తుంది అంటూ భయంగా కావ్య చెవిలో నస పెడుతుంది నవి.....


మరెందుకు అతన్ని కదిలించావు..... అసలే నువ్వు ఒకటి అంటే నాలుగు తిరిగి అంటాడు ....ఇప్పుడు మాత్రం సైలెంట్ గా వుంటాడ అంటూ టెన్షన్ గా అంటుంది కావ్య......


వాడ్ని చూస్తే నా నోరు సైలెంట్ గా వుండదు వదిన..... ఇప్పుడు కూడా అంతే☹️ అంటూ పెదవి విరుస్తుంది...


నివేద్ , నవిక దగ్గరకు వచ్చి, నవిక వైపు చూడకుండా ఆ షాప్ అతనితో మాట్లాడుతూ వుంటాడు....


బ్రదర్ ఈ బెల్ట్ కాస్ట్ ఎంత అంటూ వేలాడుతున్న బెల్ట్స్ ని చూస్తూ అడుగుతాడు....


600 r.s...


ఓహ్ చాలా స్ట్రాంగ్ అనుకుంటా....


అవును సర్ అంటూ నవ్వుతూ చెప్తాడు షాప్ అతను....


ఈ బెల్ట్ తో ఎవరి తోలు అయినా వలిచేయొచ్చా అంటూ ఒక బెల్ట్ ని సెలెక్ట్ చేసుకుని, ఆ బెల్ట్ ని తన చేతికి చుట్టుకుంటూ ఓరగా నవికని చూస్తూ అడుగుతాడు....


తోలు వలవడం ఏంటి సర్ అంటూ అయోమయంగా అడుగుతాడు అతడు....


మా ఇంటి పక్కన ఒక ఎర్ర తోలు తేలు వుంటుంది బ్రదర్.....దానికి కాస్త బలుపు కొవ్వు ఎక్కువ..... నన్ను పిలిచి మరీ కుట్టకపోతే దానికి నిద్రపట్టదు..... నన్ను డైలీ డిస్టర్బ్ చేస్తున్న ఆ కంత్రి తేలుకి స్ట్రాంగ్ బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను అంటూ బెల్ట్ చుట్టున తన చేతిని నవిక మీదకు విదిలిస్తాడు.....


బెల్ట్ విసురుగా తన మీదకు రావడంతో, వెనక్కి ఒరిగి కోపంగా నివేద్ వైపు చూస్తుంది నవి....షాప్ అతను తల గోక్కుంటూ నివేద్ ని చూస్తాడు......


ఎక్కువ మిడిసిపడితే ,మీ బాబుతో చెప్పి నీ బాతు గుడ్లు పీకించేసి ఫ్రై చేసుకుని తింటాను అంటూ నవిక పక్కనున్న టెడ్డి బేర్ వైపు చూసి చెప్పి వెళ్ళిపోతాడు.....


దొంగసచ్చినోడు ...ఇండైరెక్ట్ గా నన్నే అన్నాడు అంటూ పళ్ళు నూరుతుంది నవిక....


నువ్వైతే డైరెక్ట్ గానే అంటున్నావు కదా అంటూ నవ్వుతుంది కావ్య....


నివేద్ చాలా మంచివాడు, నీకు ఎందుకు అతనంటే ఇష్టం వుండదు నవి.....


వదిన నీకు మా అన్నయ్యతో పెళ్లి అయినప్పటి నుంచి అంటే టు ఇయర్స్ గా మాత్రమే వాడు నీకు తెలుసు....

వాడి కటౌట్ చూసి మోసపోకు....వాడు చూడ్డానికి వరుణ్ తేజ్ లా వున్నా , వాడి కారెక్టర్ లోఫర్ లో వరుణ్ లాంటిది.....పెద్ద పోకిరి వదిన వాడు.....


మరి అత్తయ్య ఏంటి ,నివేద్ చాలా మంచి వాడు, వాళ్ళ అమ్మకు హెల్ప్ చేస్తాడు, కాలేజ్ టాపర్ అని చెప్తుంటారు......


మా అమ్మని వాడి భజన చేయమంటే రోజంతా చేస్తూ కూర్చుంటుంది.....వాడు నేను టెన్త్ లో వుండగా మా పక్కింట్లో అద్దేకి దిగాడు..... అప్పటి నుంచి నా ప్రోబ్లేమ్స్ స్టార్ట్ అయ్యాయి అని దీనంగా చెప్తుంది....


ఎం ప్రోబ్లేమ్స్ నవి....



చెప్తే ఈరోజంతా సరిపోదు, రాస్తే పెద్ద గ్రంథం,తీస్తే  మూవీ సిరీస్ అవుతుంది.....సింపుల్ గా చెప్పాలంటే, వాడు నా లైఫ్ ని మరింత ట్రాజడి చేయడానికే ఊడిబడ్డాడు.....


వాడు నాకన్నా తెల్లగా వుంటాడని, వాడు ఎం తింటాడో, మొహానికి ఎం పేడలు రాస్తాడో తెలుసుకుని,మా అమ్మ అవన్నీ నాతో చేయిస్తుంది తెలుసా....


నువ్వు కూడా ఫెయిర్ గానే వుంటావు కదా నివి.....


నేను అందరి కళ్ళకు అందంగానే కనిపిస్తాను...మా అమ్మకు తప్ప😏.....వాడు వాళ్ళ అమ్మకు హెల్ప్ చేస్తుంటాడని, నా నుంచి అటువంటి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మా అమ్మ.....వాడు బాగా చదివి టెన్త్ స్కూల్ ఫస్ట్ వస్తే నేను యావరేజ్ మార్క్స్ తో పాస్ అయ్యాను.... హ్మ్మ్ ఇంకేముంది, పిల్లలంటే పక్కింటి నివేద్ లా వుండాలి,అందం,అనుకువ, చదువు ,సంస్కారం ఇలా అన్ని లక్షణాలు కలబోసిన వరాల మూట వజ్రాల కొండ అంటూ వాడ్ని పొగుడుతూ నన్ను తిడుతూ నా బ్రెయిన్ తినేస్తూ వుంటుంది.......అందుకే వాడు అంటే నాకు చిరాకు...

అయినా మీరు అందరూ అనుకున్నట్లు వాడు ఇంట్లో ఇన్నోసెంట్ గా కనిపించినా మా కాలేజ్ లో పెద్ద రౌడీ అంటుంది మూతి తిప్పుకుంటూ....


నవి చెప్పింది విని కావ్య నవ్వుతూ వుంటుంది.....


నా భాద చెప్తే నీకు నవ్వు వస్తోందా వదిన అని ఉడుక్కుని, అయినా మా అమ్మ ఎంతసేపు వాడ్ని మాత్రమే చూస్తుంది......రేఖ ఆంటీ ఎంత మంచివారో తెలుసా...వాడితో ప్రేమగా వుంటూ, వాడ్ని బెస్ట్ ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తారు.... అన్ని షేర్ చేసుకుంటారు.... మాఅమ్మకు మాత్రం ఆ సీన్ కనిపించదు......

ఆ నివేద్ గురుంచి గంటలు గంటలు చెప్పి లెచ్చేర్స్ ఇస్తుంది, నేను పొరపాటున వాడిపేరు పలికితే చాలు నా మీద వరల్డ్ వార్ స్టార్ట్ చేస్తుంది...... ఇంత డిఫరెంట్ అమ్మ నాకు మాత్రమే ఎందుకు వుందో....మా ఇంట్లో నాకు వుండే రెస్ట్రిక్షన్స్ ఏ ఆడపిల్లకు వుండవేమో అంటుంది దీనంగా మొహం పెట్టి.....


ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినా నీ అల్లరి నీదేగా అంటూ అవ్వుతూ చెప్తుంది కావ్య.....


హ్మ్మ్ మీ అత్తగారి ఆజ్ఞలను పాటిస్తే ,లైఫ్ మొత్తం సాల్ట్ పెప్పర్ లేని ఫుడ్ లా తయారవుతుంది ....అంత బోరింగ్ గా బ్రతకడం మనవల్ల కాదబ్బా



ఇంతలో


దిల్ సే దిల్ సే నీ ఊహల్లో

ఎగసే ఎగసే ఆనందంలో

పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో

మెరిసే మెరిసే నీ కన్నుల్లో

కురిసే కురిసే నీ నవ్వుల్లో

చెలి దూకేస్తున్నా తికమక లోయల్లో

తొలి తొలి చూపుల మాయా

తొలకరిలో తడిసిన హాయా

తనువున తకదిమి చూశా ప్రియా

గుండె జారి గల్లంతయ్యిందే

తీరా చూస్తే నీ దగ్గర ఉందే


అంటూ రింగ్ టోన్ వినిపించేసరికి, కాస్త దూరంలో వున్న నివేద్, నవిక ఒక్కసారే తమ ఫోన్స్ చూసుకుంటారు......


రింగ్ అయ్యింది నివేద్ సెల్ కావడంతో కాల్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు.....


చూసావా వదిన....ఇక్కడ కూడా నాకు పోటీగా వచ్చేసాడు.... నా ఫేవరేట్ సాంగ్ ని నేను రింగ్ టోన్ గా పెట్టుకుంటే, వాడు కూడా అదే పెట్టుకున్నాడు అంటూ ఏడుపు మొహంతో చెప్తుంది......


కావ్య నవి తలపై చిన్నగా తట్టి, ఆ సాంగ్ తనకి కూడా ఇష్టమేమో అంటుంది.....


నా ఇష్టాలు నాకు మాత్రమే వుండాలి, ఇంకెవరూ కాపీ చేయకూడదు, వాడైతే అస్సలు చేయకోడదు అంటుంది

మూతి ముడుచుకుని......


ఈ లవ్ సాంగ్ ని రింగ్ టోన్ గా పెట్టావు,అత్తయ్య వింటే అంటూ నవ్వుతూ అడుగుతుంది నవి....


ఇంట్లో భక్తి గీతాలు, కాలేజ్ లో మెడ్లీ సాంగ్స్.... చేంజ్ చేయడం మర్చిపోయాను వదిన......అమ్మ వింటే అన్నయ్య పవన్ కళ్యాణ్ మీద పిచ్చితో ఈ సాంగ్ సెట్ చేశాడని కవర్ చేస్తాను.


అమ్మ దొంగ...మీ అన్న కన్నా నీకే  కదే పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి......


ఆ విషయం అమ్మకు తెలియదు కదా..... నా నోట్లోంచి చిన్న పిల్లల పేర్లు తప్ప హీరోస్ పేర్లు, బాయ్స్ పేర్లు వస్తే మా అమ్మ చీపురు తిరగేస్తుంది.


లహరి గారు పిలవడంతో,కావ్య నవ్వుకుని నివి చేయు పట్టుకుని తీసుకువెళ్తుంది.....


కావ్య వెంట వెళ్తూ, చుట్టూ పరికిస్తున నవికి చిలుక జోతిష్యం కనిపిస్తే, మెరుస్తున్న కళ్ళతో, వదిన అక్కడ చిలుక జ్యోతిష్యం చెప్తున్నారు, మనము వెళ్దాం అంటుంది......


అత్తయ్య చూస్తే తిడతారని కావ్య ఎంత మొత్తుకున్నా వినకుండా కావ్యని తీసుకుని వెళ్తుంది నవి.....


చిలుక ముందు మోకరిల్లి కూర్చుని, మై స్వీట్ పేరెట్, నా బోరింగ్ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ చెప్పమ్మా అంటూ చిలకకు ముద్దుగా విన్నవించుకుంటుంది....


కావ్య నవ్వుతూ నవిని చూస్తుంటుంది.....


చిలుక ఒక కార్డ్ తీసి , ఆ జ్యోతిష్యునికి ఇస్తుంది....


అతను ఆ కార్డ్ చూసి మరొకసారి నవి వైపు చూస్తాడు....


నీమనసైన వాడు నిన్ను మనువాడతాడు.... పెద్దలను కాదని మనసైన వాడ్ని మనువాడి,కోరి కష్టాలు తెచ్చుకుంటావు......


అతడు చెప్పింది విని పెద్దగా నవ్వుతుంది నవిక.....


అతను అయోమయంగా నవ్వుతున్న నవి వైపు చూస్తాడు......


కావ్య నవ్వుతూ, మీరు చెప్పింది తన జీవితంలో జరిగే అవకాశమే లేదు.....తనకు రెండు రోజుల క్రితమే నరేన్ తో నిశ్చితార్థం జరిగింది..... మరో ఆరు నెలల్లో పెళ్లి అంటుంది ........


సిలకమ్మ పలుకు వమ్ము కాదు తల్లి..... ఈ బిడ్డ జీవితంలో తను ఊహించని ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి అని చెప్పి....... నవి వైపు చూసి చిన్నగా నవ్వుతారు....


మీరు చెప్పింది నిజంగా జరిగినప్పుడు చూద్దాం అని విసుగ్గా చెప్పి, పద వదిన పోదాం అంటుంది చిరాగ్గా ఫేస్ పెట్టుకుని.....


ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ చెప్తారేమో వైట్ చేద్దామా అంటుంది కావ్య టీస్ చేస్తూ......


వదిన అని చిరుకోపంగా చెప్పి, లవ్ అంటే గెయ్యిమనే ఇంట్లో పుట్టిన నాకు, మా డాడీ ని చూస్తే నా నోట్లో ముద్దే దిగదు అటువంటిది నేను ఆయన్ను ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకోవడం ....ఇట్స్ ఇంపోసిబుల్ అంటుంది విసుగ్గా.....ఈ చిలక కంఫ్యూస్ అయ్యి నా ఫేట్ ని మార్చి చెప్పింది...... ఈ ఇయర్ నా చదువు కంప్లీట్ చేసుకుని, మరో సిక్స్ మంత్స్ లో నరేన్ ని పెళ్లి చేసుకుని, ఒక పంజరం లోంచి మరో పంజరంలోకి వెళ్లబోతున్నాను....ఇది నా లైఫ్ లో జరగబోయే ఫేట్ అంటూ నిర్లక్ష్యంగా.....


అంత నమ్మకం లేని దానివి ఎందుకు తీసువచ్చావ్ అంటూ చిరుకోపంగా అడుగుతుంది కావ్య.....


జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ వదిన అని నవ్వుతుంది నవి.....


వెళ్తున్న కావ్య వెనక్కి తిగిరి చిలుక వైపు చూస్తూ, నిజంగా నువ్వు చెప్పినట్లు జరుగుతుందా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంది.......





చిలుక చెప్పినట్లు నవిక లైఫ్ టర్న్ అవ్వబోతుందా??.....






Rate this content
Log in

More telugu story from Esha అద్వైత

Similar telugu story from Comedy