Lahari Mahendhar Goud

Children Stories Comedy Classics

4  

Lahari Mahendhar Goud

Children Stories Comedy Classics

సిల్లీ భయాలు

సిల్లీ భయాలు

2 mins
297


నా చిన్నప్పుడు ఒకసారి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఒక ఫంక్షన్ కి వెళ్ళాము

అప్పట్లో ఉన్న రీల్ కెమెరాలో లాస్ట్ 4 ఫోటోలు బ్యాలెన్స్ ఉన్నాయి

అయినా నా గోల భరించలేక రెండు ఫోటోలు తీసాడు మా బాబాయ్ 

అయినా నన్ను ఇంకో ఫోటో తీయమని నేను ఏడుపు స్టార్ట్ చేయడంతో


నాకు ఎలా సర్ది చెప్పాలో అక్కడున్న ఎవరికీ అర్థంకాక

తలలు పట్టుకుంటున్నారు

అప్పుడే మా బాబాయ్ కి ఒక భీభత్సమైన ఐడియా వచ్చింది


చూడమ్మా ఫొటోస్ ఎక్కువగా తీసుకుంటే

కెమెరా నుండి వచ్చే ఫ్లాష్ లైట్ నీ బాడీలోని బ్లడ్ అంతా అబ్సెర్బ్ చేసేస్తుంది

కాబట్టి ఫోటోస్ ఎక్కువగా తీసుకోకూడదు అని కిస్మీ బార్ చాక్లెట్ చేతిలో పెట్టాడు


ఆ ఏజ్ లో బాబాయ్ చెప్పింది ఒక్క ముక్క అర్థం కాకపోయినా చాక్లెట్లు ఇచ్చాడు అని ఒకే ఒక్క కారణంతో ఇక మారం చేయకుండా నేను సైలెంట్ అయిపోయాను అనుకున్నారు అంతా


కానీ అప్పటి నుండి ఫొటోస్ కి పూర్తిగా దూరంగా ఉండటం స్టార్ట్ చేశాను నేను

కెమెరా చూస్తే చాలు చాలా భయపడి పోయేదాన్ని


మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి

సంవత్సరం పొడుగ్గా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అకేషన్ ఉంటూనే ఉండేది

కానీ నేను మాత్రం వీలైనంత మటుకు ఫొటోస్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉండేదాన్ని


కానీ ఈసారి దేవుడు చాలా గట్టిగా తలుచుకున్నాడు

స్కూల్లో ఫేర్వెల్ డే

ఇంకేముంది మళ్లీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కాబట్టి ఫోటో సెషన్ స్టార్ట్

కెమెరాని చూస్తే చాలు భయపడిపోయే నేను ఎవరికీ డౌట్ రాకుండా లాస్ట్ లైన్ లో వెళ్లి నిలబడ్డాను


ఈసారి దేవుడు పూర్తిగా నామీద పూర్తిగా పగ పట్టేసాడు

నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి మనమిద్దరం కలిసి ఓ ఫోటో తీసుకుందాం అని నన్ను గబగబా కెమెరా ముందుకి లాక్కెళ్ళింది


ఆల్మోస్ట్ అది నన్ను అరెస్టు చేసినట్టుగా చేతులు పట్టేసుకొని ఉంది ఆ ఫోటోలో

ఇంకా ఫైనల్లీ ఆ ఫోటోస్ వచ్చాక చూడాలి


వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి ఆ ఫొటోస్ పట్టుకొని వచ్చి ""నాతో ఫోటో దిగడం ఇష్టం లేకపోతే లేదు అని చెప్పాల్సింది ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏంటి"" అని ఒకటే గొడవ


అప్పుడు చెప్పాను దానికి ఫోటోలు అంటే నాకు ఎంత భయమో

దానికి అది నవ్వింది చూడండి 

ఇప్పటికీ ఆ స్మైల్ తలుచుకుంటే ఎంత కోపం వస్తుందో


ఫోటోల వలన బ్లడ్ పోతుంది అనేది అబద్ధం అని తెలిసినా కూడా 

అది మైండ్ లో అలా ఫిక్స్ అయి పోవడం వలన

ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది


హలో.... హలో... అలా అంటే ఇప్పుడు ఫోటో దిగటం లేదు అని కాదు

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నాక ప్రతి పిచ్చి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ అవ్వాల్సిందే కదండీ


కానీ ఎప్పుడో చిన్నప్పటి ఇన్సిడెంట్ మైండ్లో పెట్టుకుని ఎన్ని మెమరీస్ లో నా ఫేస్ లేకుండా చేసుకున్నానా అని ఇప్పుడు బాధేస్తుంది


ఫ్రెండ్స్ మీలో కూడా ఇలా సిల్లీగా మైండ్ లో నాటుకుపోయిన ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా




Rate this content
Log in