Lahari Mahendhar Goud

Drama Romance Fantasy

4  

Lahari Mahendhar Goud

Drama Romance Fantasy

కాబోయే వరుడు క్వాలిటీస్

కాబోయే వరుడు క్వాలిటీస్

2 mins
421


క్లాస్ లోకి లెక్చరర్ రావటం కాస్త లేట్ కావటంతో

అమ్మాయిలు అందరూ

వాళ్ళకి కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో డిస్కర్సన్ మొదలు పెట్టారు

ఈ టాపిక్ ఎదో ఇంట్రెస్ట్గా ఉండడంతో అబ్బాయిలు కూడా తమ రెండు 👂 వేసి వినటం స్టార్ట్ చేసారు


అమ్మాయిలు ఒక్కొక్కరు ఒక్కో క్వాలిఫికేషన్ చెప్తూ పోతుంటే..

ఆ క్వాలిఫికేషన్ ఉన్న అబ్బాయిలు ఇక్కడ తెగ పొంగిపోతున్నారు...


చివరగా అపురూప వంతు రానే వచ్చింది

ఆమె ఏం చెప్తుందో అని అతని గుండె సవ్వడి కంటే వేగంగా సాగుతున్నాయి అతని మెదడులో ఆలోచనలు


కళ్ళు.... వచ్చేసి.... ఏమోనే

ముక్కు.... అంటారా..... ఏమోనే


వెంటనే అపురూప ఫ్రెండ్స్

ఏహే ఆపవే

నువ్వేమైనా కొత్త బంగారులోకం హీరోయిన్ అనుకుంటున్నావా

మూస్కొని మేము చెప్పినట్లు

నీ ఎక్స్పెక్టేషన్స్ లిస్ట్ చెప్పు అనగానే


కొద్దిగా ఆలోచించి అపురూప చెప్పటం మొదలు పెట్టింది

కలర్ పెద్దగా లేకున్నా పరవాలేదు కానీ 

ఎప్పుడూ చెదరని చిరునవ్వు

అలాగే నేను తనని హగ్ చేసుకున్నప్పుడు 

నా తల అతని గుండె మీద ఉంటే 

అతని శ్వాసలో నుండి వచ్చే గాలి నా నుదుటికి తాకేంత హైట్ ఉంటే మాత్రం చాలు అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా

ఇంతలో

క్లాసులోకి లెక్చరర్ ఎంటైర్ అవడంతో ఆ టాపిక్ వదిలేసి క్లాస్ విని హాస్టల్ కి వెళ్ళిపోయారు అందరు


రాత్రి 11:30 అవుతుండగా తెల్లచీరలో తల నిండా మల్లెలు , చెంపలు నిండా సిగ్గుల వల్ల వచ్చిన కెంపులు తప్ప ఏ అలంకరణ అవసరం లేకున్నా నింగిలో చందమామ తన కళ్ళముందు ఉందా అన్నట్లుగా ఉంది అపురూప


ఆ వెన్నెల ప్రశాంతత అంతా తన చిరునవ్వులో చిందిస్తూ తన తొలి అదర సంతకం చేయడానికి అపురూప రెండు చెక్కిళ్ళను చేతులలోకి తీసుకొని ఆమె తలని పైకెత్తగానే

అతని శ్వాస నుండి వచ్చే గాలికి ఆమె సౌభాగ్యానికి చిహ్నంగా పాపిటలో దిద్దుకున్న కుంకుమ కొద్దికొద్దిగా ఎగిరి పడుతూ ఉంటే సిగ్గుతో ముడుచుకుపోయిన అపురూపను ఒక అంగుళం పైకి ఎత్తి వాళ్ళ జీవిత ప్రయాణంలో ప్రణయం పేజీని తెరిచారు ఇద్దరు


ఒక్కసారిగా మెలకువ వచ్చిన అపురూపకు 

ఆమె హాస్టల్ బెడ్ మీద ఉండటంతో 

ఇప్పటివరకు తాను కలగన్నానని అర్థం చేసుకొని 

అప్పటినుండి కలలో ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయింది



సరిగ్గా అదే సమయానికి అదే కల అతనికి కూడా రావడంతో

మెళుకువ వచ్చి చుట్టూ చూసిన అతనికి అది కల అని అర్థం అయిన తర్వాత

ఈ కల నిజమైతే నా కంటే లక్కీ ఫెలో ఎవరు ఉండరు అనుకుంటా అంటూ మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు


కొన్ని కొన్ని సార్లు

చాలా అరుదుగా

ఇలా విచిత్రంగా కలిసిన జంటలూ ఉంటాయి




Rate this content
Log in

Similar telugu story from Drama