Lahari Mahendhar Goud

Tragedy Classics Inspirational

4  

Lahari Mahendhar Goud

Tragedy Classics Inspirational

గుర్తింపు లేని కార్మికులు

గుర్తింపు లేని కార్మికులు

8 mins
288


ఈవినింగ్ స్నాక్స్ టైంకి

ఆఫీస్ నుండి భర్త యోగేష్

హాస్పిటల్ నుండి కోడుకు నీల్

కూతురు స్నాక్స్ టైంకి ఇంటికి చేరటంతో

[వర్క్ ఫ్రం హోం ఉండటంతో ఇంట్లో వర్క్ చేసుకుంటున్న నిత్య]

ముగ్గురికి పకోడీ, కాఫీ అందించి కిచెన్ లోకి వెళ్ళింది అలివేలు


కాసేపటికి కిచెన్ లో ఏదో పడిపోయినట్టు టప్పుమని శబ్దం రావటంతో హాల్లో ఉన్న ముగ్గురు కిచెన్ వైపు పరుగులు పెట్టారు


వాళ్ళు వెళ్లేసరికి నేల మీద అచేతనంగా పడిఉంది అలివేలు 

తల్లిని అలా చూడగానే 

నీల్ వెంటనే అలివేలును ఎత్తుకొని కిచెన్ దాటెలోపు అప్పుడే నీల్ ని కలవటానికి వచ్చాడు అతని ఫ్రెండ్ డాక్టర్ దేవ్


అయ్యో ఆంటీకి ఏమైందిరా ముందు తనను బెడ్ మీద పడుకోబెట్టు నీల్


అలివేలును బెడ్ మీద పడుకోబెట్టగానే

నీల్ బీపీ ఆపరేటర్ తీసుకురా...

నీల్ మెడికేటెడ్ కిట్ తీసుకురా... అంటూ హడావుడి చేస్తూ అలివెలుకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు దేవ్


ఒక 20 నిమిషాలకు

అలివేలు ఉన్న రూం డోర్ క్లోజ్ చేసి కిందకు వచ్చి

వాళ్ళ ముగ్గురితో పాటు హాల్ లో కూర్చున్నాడు


ఏంటిది అంకుల్ ఆంటీ అంత వీక్ అయ్యే వరకు ఇంట్లో మీరంతా ఏం చేస్తున్నారు

నువ్వు కూడా ఏంటిరా నీల్

ఇంట్లో డాక్టర్ ఉండి ఉపయోగం ఏంటి


వర్క్ ఫ్రం హోం అని నువ్వూ ఇంట్లోనే ఉంటున్నావుగా నిత్యా

నువ్వైనా నీరసించిపోతున్న ఆంటీని అబ్జర్వ్ చేయలేదా


వాళ్ళందరూ వాళ్ళు చేసింది తప్పు అన్నట్లుగా

మౌనంగా ఉండిపోయారు

కాసేపటికి తాను ఏం మాట్లాడడో గమనించిన దేవ్

ఎంతైనా ఇది వాళ్ల ఫ్యామిలీ మ్యాటర్ నేను తొందర పడి వీళ్ళను ఇలా అని తప్పు చేశానా అని ఆలోచించి


ఓకె నీల్

నేను వెళ్తాను

కానీ

కనీసం రెండు రోజులైనా ఆంటీకి కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరంరా

తనని చూసుకోవటం మీ పనుల వల్ల కుదరకపోతే నాకు కాల్ చేయ్

నేను మేడ్ ని పంపిస్తా అని చెప్పి వెళ్లిపోయాడు


దేవ్ అటు వెళ్ళటం ఆలస్యం

అసలు ఏమనుకుంటున్నాడురా మీ ఫ్రెండ్

ఆ మాత్రం చూసుకోవటం మనకు చేతకాదు అనుకుంటున్నాడా... అని యోగేష్


అవును అన్నయ్యా

2 డేస్ మమ్మీని జాగ్రత్తగా చూసుకొని

శభాష్ నిత్యా అని దేవ్ చేతే అనిపిస్తా చూడు అంటూ

జ్యూస్ చేయటానికి కిచెన్ లోకి వెళ్ళింది నిత్య


నిత్య చేసిన గ్లాసెడు జ్యూస్ కి

ఆయమ్మ ఒక గంట పాటు కిచెన్ క్లీనింగ్ చేయాల్సి వచ్చింది అంటే అర్థం చేసుకోండి నిత్య ఏ లెవల్లో జ్యూస్ చేసిందో

నిత్యా దెబ్బకు

అలివేలు ఆరోగ్యం కుదుటపడే వరకు ఇంటి వైపుకు రాకూడదని ఆయమ్మ ఫిక్స్ అయిపోయింది


రాత్రి డిన్నర్ కోసం అలివేలు అప్పటికే కర్రీ ప్రిపేర్ చేసి పుల్కా పిండి రెడీ చేసి పెట్టడంతో

ఆయమ్మ రాత్రికి పుల్కాలు చేసి ఇచ్చి వెళ్ళిపోయింది



________________



నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేస్తూనే

బ్రేక్ఫాస్ట్ నిత్యా

లంచ్ యోగేష్

డిన్నర్ నీల్.... ఇలా ముగ్గురు షెడ్యూల్ వేసుకొని పనులను పంచుకోవటంతో


టిఫిన్ కి ఏం చేయాలి , కావాల్సిన వస్తువులు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి అలివేలుని నిద్ర లేపటానికి వెళ్లాలి అనుకున్న నిత్యను ఆపి


ఎందుకే మమ్మీ నిద్రను డిస్టబ్ చేయడం 

నీకేం కావాలో చెప్పు నేను వెతికి ఇస్తాను కదా

అని వెతుకుతున్న నీల్ కు 

ఫ్రిజ్ లో రెడీ చేసి పెట్టిన దోశ పిండి కనిపించగానే

అది నిత్యకు తీసి ఇచ్చి

తాను ఫ్రెషప్ అవటానికి వెళ్ళాడు


మొదట రంగంలోకి దిగిన నిత్య

అలివేలు దోస కోసం పిండి రెడీ చేసి ఫ్రిజ్లో పెట్టడంతో

తన పని చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకుంటూ ఆనందపడుతూ

దోశలు వేయడం మొదలు పెట్టింది


అదేంటో పాపం నిత్య ఎన్నిసార్లు ప్యాన్ మీద పిండి వేసి తిప్పినా

అది ప్యాన్ కి అంటుకుపోవడం తప్ప దోశ రూపంలో బయటకు వచ్చింది లేదు


దీన్ని ఇలాగే వదిలేస్తే పిండి దోశ రూపంలో కడుపులో పడే బదులు

వేస్టేజ్ రూపంలో డస్ట్ బిన్ లోకి చేరడం కంపల్సరీ

అని అనుకొని నీల్ రంగంలోకి దిగాడు


నీల్ చకచకా దోశలు వేసి

నిత్యకు యోగేష్ కి పెట్టి

ప్లేట్లో దోశలు వేసుకొని అలివేలు రూమ్ కి వెళ్ళాడు నీల్


వాళ్ల అమ్మతో కబుర్లు చెబుతూ

ఆమెకు తినిపిస్తూ తాను కూడా తింటున్న నీల్ 

అలివేలుకు ఎందుకో కొత్తగా కనిపించడంతో

ఆమెకు తెలియకుండానే కళ్ళలో నుంచి ఆనంద భాష్పాలు జలజలా రాలిపోతున్నాయి


-------------


ఎన్నో ఏళ్లకు తన పాక ప్రతాపం చూపించే అవకాశం రావడంతో

యోగేష్ ఎంతో ఉత్సాహంగా కిచెన్ లోకి రంగప్రవేశం చేశాడు

యోగేష్ వంట పూర్తి చేయడం ఏమోగానీ

కిచెన్ లో ఉన్న పాత్రలన్నీ క్లీనింగ్ సెక్షన్ కి వచ్చేసాయి

[పాపం ఇంకా వీళ్ళకి తెలియటం లేదు ఆయమ్మ డుమ్మా కొట్టిన విషయం]


తండ్రి చేసిన లంచ్ టేస్ట్ ని ఆస్వాదిస్తూ

తండ్రి కూతురు ఇద్దరూ భోంచేస్తుండగా

నీల్ మాత్రం ప్లేట్లో భోజనం పెట్టుకొని ఉదయంలానే 

వాళ్ళ అమ్మతో కలిసి ముచ్చట్లు పెడుతూ ఆమెకు తినిపిస్తూ అతని భోజనం కూడా పూర్తి చేశాడు


ఆ తర్వాత ఆ ముగ్గురు వాళ్ళ వాళ్ళ ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని

సాయంత్రం కాఫీ టైం కి అందరూ లాన్లోకి చేరారు

ఎన్నో ఏళ్లకి కుటుంబంతో ఇలా ప్రశాంతంగా సమయం గడపడం అలివేలు మనసుకు ఎంతో సంతోషంగా ఉంది

కాఫీ తాగుతూ ఆ క్షణాలని ఆస్వాదిస్తున్న అలివేలు ఇది కల కావద్దు దేవుడా అనుకుంటూ కళ్లు మూసుకుంది


సాయంకాలపు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ ముగ్గురు గార్డెనింగ్ కూడా చేస్తున్నారు


రాత్రికి నీల్ పుల్కా తో పాటు బటర్ నాన్ కర్రీస్ అన్నీ చేసాడు

ఈసారి అలివేలుని కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చో బెట్టి

నీల్ స్వయంగా అందరికీ సర్వ్ చేసాడు

అలా అందరితో పాటు కలసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తాను ఎప్పుడు తిన్నదో కూడా అసలు గుర్తు లేదు అలివేలుకు


పడుకునే ముందు టాబ్లెట్స్ వేసి పాలు తాగించి అలివేలు నిద్రపోయాక ఆ రూమ్ లో నుంచి బయటకి వచ్చాడు


__________________



నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక

ఒక్కొక్కరి మొహాలు చూడాలి

ఇల్లంతా చిందరవందరగా

కిచెన్ లో కైతే కాలు కూడా పెట్టలేని అంత దారుణంగా కనిపించింది

మరోవైపు ఉతకాల్సిన బట్టలు కూడా కుప్పల్లా తయారైపోయాయి


వాటన్నిటినీ చూశాక అప్పుడు వెలిగింది ఈ ముగ్గురికి ఆయమ్మ నిన్నటి నుండి డుమ్మా కొట్టిన విషయం


నీల్ కిచెన్ నూ

నిత్యా ఇళ్లు శుభ్రం చేసే పనిని 

ఈసీగా ఉంటుందని యోగేష్ వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసే పనినీ పంచుకొని 

ఇవన్నీ చేయడానికి ముందుగా ఎనర్జీ కావాలి కాబట్టి

నీల్ బయట హోటల్ నుండి టిఫిన్ పార్సిల్ తీసుకొచ్చాడు

బ్రేక్ ఫాస్ట్ పూర్తిచేశాక ముగ్గురు వారి వారి పనులను మొదలుపెట్టారు


వాళ్లు ఆ పనులు చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికే చాలా అలసి పోవటంతో

ముగ్గురిలో ఎవరికీ వంట చేసే ఓపిక ఏమాత్రం లేక

లంచ్ స్విగ్గి లో ఆర్డర్ పెట్టారు


వాళ్ల ముగ్గురికి అలాంటి ఫుడ్ అలవాటే కనుక వాళ్ళు తినేశారు

కానీ అలవాటు లేని ఫుడ్ తినటం అలివేలుకు చాలా కష్టంగా అనిపించి ఏదో తిన్నాను అనిపించింది


సుఖాలకు అలవాటు పడిన వారు 

ఏదో ఒక్క రోజు అంటే హుషారుగా పని చేయగలరు

వీళ్ళు కూడా అలాంటి వాళ్లే కాబట్టి రాత్రికి కూడా బయట ఫుడ్ ఆర్డర్ చేశారు


_____________


మరుసటి ఉదయం


వాకిట్లో ముగ్గు 

తులసి కోట దగ్గర దీపం

ఇల్లంతా ఎక్కడి వస్తువులు అక్కడ పొందికగా అమర్చి

సాంబ్రాణి ధూపం పొరలు పొరలుగా ఇల్లంతా పరుచుకొని ఉంటే

నిద్రమత్తుని దూరం చేసే కమ్మటి కాఫీ వాసన నాసిక పుటలను తాకుతూ ఉంటే

కాఫీ కప్పులతో ఆ దూప పోగలను చీల్చుకుంటూ ప్రశాంతమైన చిరునవ్వుతో వాళ్ళ ముగ్గురు ముందుకు వచ్చి నిలబడింది అలివేలు


వావ్..... మమ్మీ

నువ్వు నార్మల్ అయిపోయావా

ఈ టుడేస్ మేము ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా మమ్మీ

మా ముగ్గురిని ఎంత టెన్షన్ పెట్టేశావో

అయినా ఎప్పుడు ఇంట్లోనేగా ఉండేది నీ ఆరోగ్యం మీద నీకు ఆ మాత్రం శ్రద్ధ లేకుంటే ఎలా మమ్మీ... అంటూ నిత్య కాఫీ తాగడం పూర్తి చేసి ఆ కప్పును అలివేలుకి అందించింది


ఈ తింగరి మాటలకేం కానీ

నువ్వు నార్మల్ అయిపోయావు అది చాలా చాలా హ్యాపీ... అంటూ నీల్ వాళ్ల మమ్మీ చుట్టూ అల్లుకుపోయాడు


అన్నిటికీ చిరునవ్వే సమాధానంగా చిన్న చిరునవ్వు చిందిస్తున్న అలివేలు

వెళ్లి ఫ్రెష్ అప్ అయి రండి

మీ అందరికీ ఇష్టమని పూరి కుర్మా చేశాను టిఫిన్ చేద్దురు గాని అని చెప్పి వాళ్లందర్నీ అక్కడినుండి పంపించేసింది


ముగ్గురు టిఫిన్ చేస్తున్నంత సేపు ఆ రెండు రోజులు వాళ్ళు పడిన అవస్థలు చెప్తున్నారు

తెలుసా మమ్మీ దీనికి కిచెన్ లో ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా తెలీదు అంటూ నీల్ నిత్య మీద కంప్లైంట్ చేస్తుంటే


వాడు అలాగే అంటాడు మమ్మీ

నేను వేసి పెట్టిన దోశలు బాగా తిని నా మీద సెటైర్లు వేస్తున్నాడు అని నిత్య వాదనకు దిగడంతో


ఒసేయ్ డెవిల్ 

ప్యాన్ మీద నుండి డస్ట్ బిన్ చేరిన దోషాల గురించి చెప్పకు

అందరి కడుపు నింపిన దోసలు వేసింది నేనే అది గుర్తుంచుకో 

ఏం డాడీ అవునా కాదా


ఏరా మీరు మాత్రమే పని చేశారా నేను లంచ్ ప్రిపేర్ చేయలేదా అని యోగేష్ తను చేసిన పనిని కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు


అయ్యో ఎందుకు చేయలేదు డాడీ

మీరు లంచ్ ప్రిపేర్ చేశారు అనేదానికి గుర్తుగా

కిచెన్ లో ఉన్న పాత్రలన్నీ అంట్లు తోమే ప్లేస్కి వచ్చేసాయి కదా

టైంకి ఆయమ్మ హ్యాండ్ ఇవ్వడంతో

ఆ గిన్నెలన్నీ నేనే తోమాను మమ్మీ

అని చెప్తూ నీల్ టిఫిన్ చెయ్యడం పూర్తి చేశాడు


వాళ్ల ముగ్గురి మాటలకి అలివేలు చిన్నగా నవ్వుతూ టిఫిన్ చేసిన ప్లేట్స్ తీస్తోంది

కానీ యోగేష్ కి ఎందుకో అలివేలు అలా నవ్వటం నచ్చలేదు కానీ ఏమీ అనలేక టిఫిన్ తినేసి ఆఫీస్ కి వెళ్ళి పోయాడు


అలివేలు లంచ్ కోసం వంట ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ పైన అన్నీ సర్దేసి తన రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది


అలా ఆ రోజంతా కూడా పడుకుంటూ లేస్తూ 

కాస్త రెస్ట్ తీసుకుంటూ ఇంట్లో వాళ్లకి కావలసినవన్నీ చేసి పెట్టింది

_____________



మరుసటి రోజు పొద్దున్నే

నీల్ ని నిద్ర లేపటానికి అతని గదిలోకి వెళ్ళింది అలివేలు


అబ్బా మమ్మీ 

ప్లీజ్ మమ్మీ ఇంకా కాసేపు పడుకోనివ్వు

తెలుసా మమ్మీ

మొన్న నీకు హెల్త్ బాలేనప్పుడు

కిచెన్ లో వస్తువులు దొరకక ఆ రాక్షసి నిన్ను నిద్ర లేపడానికి ట్రై చేస్తే

నీ నిద్ర డిస్టర్బ్ కాకూడదని అన్నీ నేనే దగ్గరుండి తీసిచ్చాను


ఆ మాటతో అలివేలు ఇంకా ఏమీ అనలేక 

చెదిరిపోయిన నీల్ జుట్టును సరి చేసి నవ్వుతూ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది


ఆ తరువాత నిత్య గదిలోకి వెళ్ళింది అలివేలు


ఏంటి మమ్మీ ఇది పొద్దున్నే 

9 ఏ కదా అవుతుంది ఇంకా కాసేపు పడుకోనివ్వు


అది కాదమ్మా పెళ్లి కావలసిన పిల్లవి

నిన్నేమీ ఎర్లీ మార్నింగ్ లేపటం లేదు కదా

నా బంగారానివి కదూ లేమ్మా....


అబ్బా మమ్మీ

నీకోసం టుడేస్ నుంచి ఇంట్లో పనులన్నీ చేసి చేసి అలిసిపోయాను మమ్మీ

ఇంత పెద్ద ఇల్లు నేను ఒక్కత్తినే క్లీన్ చేశాను తెలుసా


ఒక్క మాటతో అలివేలు ఇంకా ఏమీ మాట్లాడక

నిత్య బట్టలు సర్ది నుదుటిన ముద్దు పెట్టుకొని బయటకి వచ్చేసరికి 

యోగేష్ చేతిలో టై పట్టుకుని రెడీగా ఉన్నాడు


ఏంటి అని అలివేలు కళ్ళతోనే సైగ చేయడంతో

యోగేష్ కూడా తన మెడలో టై కట్టమని సైగ చేసి చెప్పాడు


అలివేలు యోగేష్ మెడలో టై కడుతుండగా 

యోగేష్ అలివేలు నుదిటి మీద చేతి పెట్టి 

టెంపరేచర్ చెక్ చేస్తున్నట్టుగా చూసి 

ఎవరు చూడట్లేదు అని గమనించి అలివేలు బుగ్గ మీద ముద్దు పెట్టేసాడు


అలివేలు వెంటనే యోగేష్ ని కాస్త దూరం నెట్టేసి

ఏంటండీ ఇది పిల్లలు చూస్తే ఎంత చండాలంగా ఉంటుంది



యోగేష్ వెంటనే మాట మారుస్తూ

రెండు రోజులుగా నీ ఆరోగ్యం బాగవ్వాలని ఎంత కంగారు పడ్డానో అలివేలు

నీకు కష్టం కావొద్దని

బట్టలన్నీ నేనే ఉతికేశాను తెలుసా అని మొహంలో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టడంతో


అలివేలు నవ్వుతూ

సర్లేండి పిల్లలు ఇంకా నిద్ర లేవ లేదు 

మీరు రండి టిఫిన్ వడ్డిస్తాను... అంటూ అక్కడి నుండి కదలబోయిన అలివేలు చెయ్యి పట్టుకుని ఆపి


ఆగు అలివేలు నిన్నటి నుండి నేను గమనిస్తూనే ఉన్నాను ప్రతిదానికి ఒక వెటకారపు నవ్వు నవ్వి వెళ్ళిపోతున్నావు అసలేంటి నీ ఉద్దేశం

నీ కోసం మేము ముగ్గురం నానా చాకిరీ చేయడమే కాకుండా 

ఎంతో టెన్షన్ పడి నిన్ను రికవరీ చేసుకుంటే 

నువ్వు మాత్రం ఏం మాట్లాడిన 

మా మొహాన ఒక నవ్వు విసిరేసి వెళ్ళిపోతున్నావ్ 

నీ మనసుకి నువ్వు ఏమనుకుంటున్నావో నాకు ఇప్పుడు తెలియాల్సిందే 

అంటూ గట్టిగా అరవడంతో నీల్, నిత్య ఇద్దరు వారి వారి గదిలో నుంచి బయటకు వచ్చారు


మమ్మీ ఇప్పుడే రికవరీ అయింది కదా డాడీ ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా అని నీల్ అంటుండగానే


నువ్వు ఆగరా మమ్మీ అలా స్మైల్ ఇస్తూ ఉంటే నాకు చిరాకుగా అనిపించింది

నీ కోసం మేము అంత చేస్తే నీ ఫేస్ లో కనీసం హ్యాపీనెస్ కూడా చూడలేదు మమ్మీ

దట్ వాస్ టూ హర్టింగ్ మీ.... అంటూ నిత్య వాళ్ళ డాడీ పక్కన చేరి పోయింది


మాట్లాడు అలివేలు

ఇప్పుడు కూడా నువ్వు నీ నవ్వే సమాధానంగా చెప్తానంటే మాత్రం నేను అస్సలే ఊరుకోను


డాడ్....!

అసలిదంత పెద్ద ఇష్యూనే కాదు 

ఎందుకు మీరు ఇద్దరూ ఈ విషయాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు

అని నీల్ వాళ్ళిద్దరికీ ఎంత సర్ది చెప్పాలని చూసినా


వాళ్ళిద్దరూ అలివేలు నుండి కృతజ్ఞత తో కూడిన గౌరవ గుర్తింపు పొందాలని ఆశిస్తున్నారు


అలివేలు చిన్నగా నవ్వడం మొదలు పెట్టి

ఆ నవ్వు కాస్తా పెద్ద పెద్దగా మారి

అదే నవ్వు ఏడుపుగా వినిపించడంతో నీల్ కంగారుగా తల్లి దగ్గరికి చేరి ఆమెని పట్టు కున్నాడు


మీరు చిందరవందర చేసిన ఇల్లుని 

మీరు క్లీన్ చేస్తే 

మీ బట్టలు మీరే ఉతుక్కుంటే అదీ వాషింగ్ మెషీన్ లో వేస్తే

అందులో నన్ను ఉద్ధరించినది ఏమిటో నాకు అర్థం కావట్లేదు


అన్నీ మీరు నాకు చేసిన సేవగా అనుకుంటే 

మరి ఏళ్లతరబడి మీ కోసం నేను చేస్తున్నది ఏంటి

ఒకరోజు ఆయమ్మ రాకపోతే 

ఆయమ్మ రాలేదు అని ఆమె చేసే పనిని గుర్తించారు


కానీ 24 గంటలు ఇంటి పనికి అంకితమైన ఇంట్లో హౌస్ వైఫ్ పని మాత్రం మీకు ఎవరికీ పట్టదు

ఎంతసేపు మీకు టైంకి టిఫిన్ కావాలి,

లంచ్ బాక్స్ సిద్ధం కావాలి

మీ వస్తువులు ఎక్కడున్నాయో దొరకకున్నా మాకే తొందర


కార్ కీస్, బైక్ కీస్,ఇయర్ ఫోన్స్, సాక్స్, దుపట్టా,మాస్క్, దువ్వెన ప్రతి ఒక్కటీ మీరు అరవగానే మీ చేతిలోకి రావాలి


కానీ ఇక్కడ ఆ వస్తువులు వేటికి కాళ్లు లేవు

ప్రతి ఒక్క వస్తువులకి నా కాళ్లను అందించి టైంకి మీ చేతిలో పడేలా చేసేది హౌస్ వైఫ్


ఎందుకంటే మీ దృష్టిలో హౌస్ వైఫ్ అంటే

అందరిలా సంపాదించి చేతిలో పెట్టే మనిషి కాదు కాబట్టి

హౌస్ వైఫ్ లు ఇంట్లో ఎంత చాకిరి చేసినా గుర్తింపులేని కార్మికుల్లా ఉంటుంది మీ కళ్ళకి


ఏనాడైనా నువ్వు కూడా మాతో పాటు టిఫిన్ చెయ్ అలివేలు అని అడిగారా అని యోగేష్ కళ్ళలోకి చూడగానే కోపంతో అతని చూపు పక్కకి తిప్పుకున్నాడు


ఎంతసేపు లాప్ టాప్ ముందు కూర్చొని 

మమ్మీ లంచ్ అయిందా 

మమ్మీ లంచ్ రెడియా అని అరవటం

ప్లేట్లో అన్నీ వేసి ఇస్తే తిని 

ఆ ప్లేట్ పక్కన పెట్టడం తప్ప

మమ్మీ నువ్వు లంచ్ చేసావా

మమ్మీ మనిద్దరం కలిసి లంచ్ చేద్దామా అని 

ఏరోజైనా అడిగావా అని నిత్యను ప్రశ్నించగా 

నిత్య అలాగే తలదించుకుని దగ్గర్లోని సోఫాలో కూలబడి పోయింది


మమ్మీ రేపు కాన్ఫరెన్స్ ఉంది డ్రెస్ రెడీ చెయ్

మమ్మీ రేపు మీటింగ్ ఉంది నా డ్రెస్ ఐరన్ చేయవా

అని ఆర్డర్ చేయడమే తప్ప

కనీసం మార్కెట్ వరకైనా ఏనాడైనా నన్ను డ్రాప్ చేశావ నీల్


మదర్స్ డే రోజునే మమ్మీ గుర్తొస్తుందా

మిగిలిన రోజులలో మమ్మీకి విలువ లేదా


వర్కింగ్ డేస్లో పోనీ

మీకు హాలిడే ఉన్న రోజైనా

నాతో కాస్త టైమ్ స్పెండ్ చేయాలని మీకు ఎవరికైనా అనిపిస్తుందా

కాస్త టైం దొరికితే చాలు బయట 

ఎవరెవర్నో కలిసి చాలారోజులైంది అని గుర్తొస్తుంది కానీ ఇంట్లో ఉన్న మనిషి(హౌస్ వైఫ్)తో మనస్పూర్తిగా మాట్లాడి ఎన్ని రోజులైందో మీలో ఎవరికైనా గుర్తుందా


అదేమంటే ఇంట్లోనే ఎప్పుడూ కళ్లముందు కనిపిస్తుంది కాబట్టి నిర్లక్ష్యం

పైగా అందరినీ నేనే అర్థం చేసుకోవాలి

ఏ మీరు మాత్రమే వర్క్ చేసి అలసిపోయి హాలిడే ఉంటుందా

మీ వెనుక పరిగెత్తే మాకు (హౌస్ వైఫ్) హాలిడే అవసరం లేదా

అలా హాలిడే అవసరం లేదు అనుకుంటే

ఇలా అనారోగ్యాల పాలు అవ్వక తప్పదు


మేము జీవితాంతం చేసే పనిని

ఆరోగ్యం బాగా లేని రెండు రోజులు చేస్తే మీరు మానుండి గుర్తింపు కోరుకుంటారు, మెచ్చుకోలు కోరుకుంటారు ఇంకా కృతజ్ఞత కూడా కోరుకుంటారు



అలివేలు మాటలతో యోగేష్ కి ఉక్రోషం పొంగుకు వచ్చి చేతికి అందిన ఫ్లవర్ పాట్ ను నేల మీద విసిరికొట్టి బ్రేక్ ఫాస్ట్ కూడా చేయకుండా కోపంగా వెళ్ళిపోయాడు



ఇన్ని రోజులు తమ ప్రవర్తన వల్ల వాళ్ళ మమ్మీ ఎంత బాధ పడిందో అర్థం చేసుకున్న నీల్ మరియు నిత్య

అలివేలుకు సారీ చెప్పి చెరొక వైపు నుండి అల్లుకుపోయారు 


నేను కోరుకున్నది మీ నుండి సోరి కాదురా

ఇప్పటికి కూడా

భార్యకూ ఒక మనసుంటుందని గుర్తించలేని భర్త మమకారం,

పిల్లలతో పాటు సరదాగా కాసేపు గడిపే సమయం కోసం

ఎదురు చూస్తూనే ఉన్నాను



ఇది కేవలం అలివేలు బాధ మాత్రమే కాదు

పైకి చెప్పుకోలేని ఎంతోమంది హౌస్ వైఫ్ లు

ఇలా వాళ్లలో వాళ్లే మధన పడుతూనే ఉన్నారు

గుర్తింపులేని కార్మికుల్లా మన మధ్యలో మిగిలిపోయారు



ఎందరో మాతృ మూర్తులకు ఇది అంకితం 




Rate this content
Log in

Similar telugu story from Tragedy