Lahari Mahendhar Goud

Action Classics Children

4  

Lahari Mahendhar Goud

Action Classics Children

సూది భూగలు

సూది భూగలు

1 min
340


హల్లో ఫ్రెండ్స్


ఈ వర్షాకాలంలో ఒక రోజు మధ్యాహ్నం సన్నగా చిణుకులు పడ్తుంటే ఆరేసిన బట్టలు తీయటానికి వెళ్లిన నాకు 

ఆకాశంలో ఫుల్ గా ఎగురుతూ కనిపించాయి భూగలు (తూనీగలు)


ఒక్కసారిగా మనసు నా చైల్డ్ హుడ్ లోకి వెళ్ళిపోయింది


చిన్నప్పుడు భూగలను పట్టుకొని వాటికి దారం కట్టి ఆడుకోవటం

ఇంకా సూది భూగలు పట్టుకోవటం అయితే గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళం


స్వేచ్ఛగా ఎగిరే వాటిని 

అలా దారంతో కట్టి హింసిచ్చోద్దు 

అని అమ్మ ఎన్నో సార్లు చెప్పినా

ఆ ఏజ్ లో ఉన్న సరదా అటువంటిది మరీ

ఎవరి మాటా వినకుండా 

కేవలం మన సంతోషం కోసమే 

అలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటాం


ఒక రోజు నా భూగకు ఒక రెక్క విరిగి అది ఎగరలేక పోవటంతో దాని వైపే చూస్తూ ఉన్నానే తప్ప 

అప్పుడు కూడా దాని తోకకు ఉన్న దారం మాత్రం విప్పట్లేదు


సరిగ్గా అప్పుడు వచ్చాడు మా బాబాయ్

నా కాలుని ఒక చైర్ కి కట్టేసి 

కొంచం కష్టపడితే నాకు అందేంత దూరంలో నా ఫేవరేట్ చాక్లేట్ పెట్టి 

తాను స్నానికి వెళ్లి వచ్చే వరకు చాక్లేట్ తినేస్తే 

అలాంటివి మరో రెండు కొనిస్తా అని చెప్పి వెళ్ళాడు


కొంచం కష్టమైనా మొత్తానికి చాక్లేట్ తినేశా


బాబాయ్ వచ్చి నా కట్లు విప్పి

నా పక్కన కూర్చొని 

నా కాలుని చూయించాడు

అప్పుడు గమనించా నా కాలుని

తాడుతో కట్టేడయం వల్ల కొంచం కమిలినట్లు అయింది

ఆ ప్లేస్ లో టచ్ చేయమన్నాడు


టచ్ చేయగానే అప్పుడు నొప్పిగా అనిపించింది ఇంక ఏడుపు స్టార్ట్ చేసా

(మరి చాక్లేట్ తినెప్పుడు కాన్సంట్రేషన్ మొత్తం చాక్లేట్ మీదే ఉంది కాబట్టి అప్పుడు నొప్పి తెలియలేదు)


నా ఏడుపు ఆపటానికి నా చేతిలో మరో రెండు చాక్లెట్స్ పెట్టీ

కొద్ది సమయానికే నీకు ఇలా ఉంటే

నోరు లేని ప్రాణిని నువ్వు డైలీ కట్టేసి హింసిస్తుంటే 

దాని బాధ ఎలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించాలి అనే నిన్ను కట్టేసా



""ప్రతీ మనిషిలోనూ సహజంగా సున్నితత్వం అనేది ఉంటుంది

కానీ

ఒక్కోసారి మన ఆనందాల కోసం చేసే పనులు వలన అది బయటకు రాలేకపోవచ్చు""

అని చెప్పాడు




ఆ రోజు బాబాయ్ చెప్పిన మాటలు నా మనసు మీద ఎంతలా ఎఫెక్ట్ చూపించాయి అంటే

ఇప్పటికీ నేను కనీసం చీమను, దోమనూ కూడా చంపలేనంతగా




Rate this content
Log in

Similar telugu story from Action