STORYMIRROR

Lahari Mahendhar Goud

Drama Tragedy Classics

4  

Lahari Mahendhar Goud

Drama Tragedy Classics

ఎందరో దంపతుల అంతర్మధం

ఎందరో దంపతుల అంతర్మధం

1 min
356

ఓ మగువ మనసు పడే సంఘర్షణ నా ఈ చిన్ని కథ


నీతో గడిపిన క్షణాలన్నీ స్వర్గాలే అవకున్నా

నువు నా చెంతలేని సమయాలన్నీ నరకాలే


నీ చేరువలో మౌనాలు కూడా ఎన్నో భాషలు అద్దుకుంటే

నీ విరహంలో మాటలకు భాషే కాదు భావం కూడా కరువాయే


నీ ప్రతీ నవ్వు నాకే సొంతం అవ్వాలి అనుకునే గుప్పెడంత మనసు నాది

నా కోసం ఒక్క చూపు కూడా వృధా చేయకూడదనే కాలంతో పరుగులాట నీది


రెండు విభిన్న మనసులను ఏకం చేసిన

బంధానికి కూడా ముందే తెలిసుంటుంది

భిన్న ధృవాలే విడదీయలేనంతగా ఆకర్షించుకుని కలిసుంటాయని


మార్నింగ్ నుండీ తన భర్తకు దీనిని పంపటానికి 99 సార్లు

టైప్ చేస్తూ డిలీట్ చేస్తోంది ఆశ

ఆమెకు మెసేజ్ సెండ్ చేసే దైర్యం లేదు

అతనికి భార్య మనసు అర్థం చేసుకునే తీరిక లేదు


ఇది కేవలం ఆశ సమస్య మాత్రమే కాదు

కుటుంబం సంతోషం కోసం,

వాళ్ల సదుపాయాల కోసం 

కాలంతో పోటీ పడుతూ కెరియర్ వెంట పరుగులుపెడుతూ సాగిపోయే ఎందరో దంపతుల అంతర్మధం




Rate this content
Log in

Similar telugu story from Drama