STORYMIRROR

Lahari Mahendhar Goud

Children Stories Comedy Drama

4  

Lahari Mahendhar Goud

Children Stories Comedy Drama

స్ప్రైట్ యాడ్

స్ప్రైట్ యాడ్

1 min
333

పనులు చేస్తూ వంటింట్లో గిన్నెలతో, 

టీవీ రిమోట్ తో, 

దండం మీద బట్టలతో 

అన్నింటితో మాట్లాడే అలవాటున్న నేను


ఒకసారి వాటర్ బాటిల్స్ నింపుతూ వాడితో మాట్లాడుతూ ఉండగా

టీవీలో స్ప్రైట్ యాడ్ వస్తుంటే

బాటిల్స్ తో మాట్లాడడం ఆపేసి 

ఆ యాడ్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశాను

{ ఓల్డ్ స్ప్రయిట్ యాడ్ విత్ కాకి }

అందులో ఒక బిట్

హేయ్ ఆగు

హేయ్ ఆగు

హేయ్ ఆగాగు... గా... ఆగు అంటూ హమ్ చేస్తూ ఉండగా


అటుగా వెళ్తున్న మా పక్కింటి ఆంటీ

ఏంటమ్మా నాతో ఏమైనా పని ఉందా

హేయ్ ఆగు

హేయ్ ఆగు

అని పిలుస్తున్నావు అంటూ ఇంట్లోకి వచ్చింది...


అప్పుడు మా అమ్మ చెప్పడం మొదలు పెట్టింది ఇక

మన గొప్ప గొప్ప అలవాట్లు అన్నీ

అప్పటినుండి ఆ ఆంటీ నన్ను ఒక రకంగా చూడటం స్టార్ట్ చేసింది...


మనకున్న బ్రెయిన్ కి మనుషులతో మాట్లాడటం కన్నా

ఏ కౌంటర్ వేసిన తిరిగి రిప్లై ఇవ్వలేని వస్తువులతో మాట్లాడటం బెటర్ అనేది అప్పట్లో నా ఫీలింగ్



Rate this content
Log in