Lahari Mahendhar Goud

Classics Fantasy Inspirational

4  

Lahari Mahendhar Goud

Classics Fantasy Inspirational

గాజుల సవ్వడి

గాజుల సవ్వడి

2 mins
281


గాజులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి

గాజులకు అమ్మాయిలకు విడదీయరాని ఆత్మీయ అనుబంధం ఉంటుంది


ఇష్టమైన వారి చేతి గాజుల సవ్వడిలో కూడా

సంగీతం వినిపిస్తుంది మనసుకి


బోసి నవ్వుల పాపాయి కూడా

అమ్మ గాజుల సవ్వడికి నవ్వుల పువ్వులు పుయిస్తారు కదా


హిందూ సాంప్రదాయం ప్రకారం గాజులు 

పెళ్ళైన ఆడవారి సౌభాగ్యంగా భావిస్తారు

గర్భిణీలకు కూడా 5 వ నెల కొన్ని చోట్ల 7వ నెలలో చేతికి మట్టి గాజులు వేస్తారు


వైజ్ఞానికంగా కూడా ఉపయోగాలు చూస్తే

గాజులు ధరించటం వలన

మణికట్టు దగ్గర రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి గాజులు ఉపయోగపడతాయి

తద్వారా ఆడవాళ్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది

ఇంకా

గర్భిణీలకు అలా గాజులు వేయటం వెనుక గల కారణం ఏంటంటే

కడుపులో ఉన్న బిడ్డ

ఆ గాజుల సవ్వడి వింటూ పెరుగుతారు

బిడ్డ పుట్టగానే ఆ గాజుల కదలికను బట్టే తల్లిని గుర్తిస్తారట 

అలాగే గర్భిణీలు గాజులు ధరించడం వల్ల ఒత్తిడిని అధిగమించి సుఖ ప్రసవానికి యోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు


**************


ఎంతలా రెడీ అయినా సరే డ్రెస్కి, చీరకి మ్యాచింగ్ గాజులు లేకపోతే ఏదో వెలతిలా ఉంటుంది


ఇక నా గాజుల పిచ్చి విషయానికి వస్తే

ఎక్కడికి వెళ్లిన ఆ ప్రదేశానికి గుర్తుగా 

గాజులు మరియు అక్కడి చరిత్రకు సంబంధించిన ఒక బుక్ కొనుక్కొని రావడం నా హాబీ అంటాను నేను

కాదు అది నీ పిచ్చి అంటారు మా ఇంట్లో వాళ్ళు


నా గాజుల పిచ్చితో ఇంట్లో డబ్బాలు డబ్బాలు నింపేస్తున్నానని మా అమ్మ కూడా ఎప్పుడు అంటూ ఉంటుంది


ప్రతి డ్రెస్ కి మ్యాచింగ్ గాజులు వేసుకుని కాలేజీకి వెళ్లడం వలన

ఇంత మోడర్న్ గా తయారై పాత చింతకాయ పచ్చడిలా 

ఆ గాజులు ఏంటే బాబు అంటూ మా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తూ

కొంపతీసి ఇష్క్ సినిమాలో నిత్యామీనన్ల

ఎవరు బ్యాంగిల్స్ ఇస్తే వాడినే పెళ్లి చేసుకుంటా అని అనవు కదా అంటూ కామెంట్స్ చేస్తారు


ప్రతిరోజు అలా డ్రెస్ కి మ్యాచింగ్ గాజులు వేసుకొని రావటం నచ్చని మా సీనియర్ అక్కయ్యలు

గర్ల్స్ వెయిటింగ్ రూమ్ కి పిలిచి మరీ 

రేపటినుండి ఇలా మ్యాచింగ్ మ్యాచింగ్ లో రావద్దు అని చిన్న సైజు వార్నింగ్ ఇచ్చి పంపించారు


వాళ్లు ఆరోజు వార్నింగ్ ఇచ్చినా కూడా దానికి రీజన్ తెలుసుకొని సంతోషపడ్డాను


ఆ రీసన్ ఏంటంటే నా బ్యాంగిల్స్ పిక్స్ తీసుకుని వెళ్లి

నిజామాబాద్ లో నేను రెగ్యులర్ గా షాపింగ్ చేసే 

అన్ని షాపుల్లో వాళ్ళు ఆ బ్యాంగిల్స్ కోసం ట్రై చేసి 

అవి దొరకకపోవటంతో ఈగో హర్ట్ అయి 

నాకు అలా వార్నింగ్ ఇచ్చారు


వాళ్ల పిచ్చి కాకపోతే నేను రాజస్థాన్ నుంచి తెప్పించిన బ్యాంగిల్స్ నిజామాబాద్ లో వెతికితే ఎక్కడ దొరుకుతాయండి


ఇంకా త్రెడ్ బ్యాంగిల్స్ సీజన్లో అయితే

ఎన్ని వెరైటీ డిజైన్స్ చేయగలనో అన్ని డిజైన్స్ చేశాను

అదే మేనియాలో ఏ అకేషన్ వచ్చినా, ఎవరి బర్త్డే వచ్చిన బ్యాంగిల్స్ చేయడం గిఫ్ట్ ఇవ్వడం ఇదే అలవాటుగా అయిపోయింది


ఒకరోజు మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి

అమ్మ తల్లి ""నువ్వు నా ఎంగేజ్మెంట్ కి వేసుకొని వచ్చిన బ్యాంగిల్స్ ఎక్కన్నుంచి తెప్పించావే

నా ఫియాన్సీ నా ప్రాణం తోడేస్తోంది 

దాని బర్త్డేకు అలాంటి బ్యాంగిల్స్ గిఫ్ట్ ఇవ్వాలట

నీ బ్యాంగిల్స్ చూసిన దగ్గర నుండి ఆన్లైన్లో తెగ సెర్చ్ చేసేస్తుంది అంటూ వాపోయాడు""


నా పిచ్చి చూడలేని ఇంట్లో వాళ్ళు గోల్డ్ బ్యాంగిల్స్ చేయించిన కూడా...

చార్మినార్ దగ్గర మనకు దొరికే బ్యాంగిల్స్ కలెక్షన్ ముందు ఇంకా ఏ బ్యాంగిల్స్ కూడా సరితూగవు అంటారు కదా


ఆ చార్మినార్ బ్యాంగిల్స్ & మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఫేమస్ ప్లేసెస్ లోని బ్యాంగిల్స్ మాత్రమే కాకుండా

రాజస్థాన్, సూరత్, మనాలి, రామేశ్వరం, కంచి, మహాబలిపురం, బెంగళూరు, ఎర్నాకులం చివరగా గోవా ఇలా ఎవరు ఏ ప్లేస్ కి వెళ్ళినా నాకోసం బ్యాంగిల్స్ తీసుకొచ్చి నా హార్ట్ ని ఫుల్ ఫిల్ చేసేస్తారు


ఎన్ని ఫాన్సీ బ్యాంగిల్స్ గోల్డ్ బ్యాంగిల్స్ పార్టీవేర్ బ్యాంగిల్స్ వేసుకున్న కూడా

మ్యాట్ బ్యాంగిల్స్... అదేనండి మన మట్టి గాజుల్లో కొత్త వర్షన్ అన్నమాట

ఆ మ్యాట్ బ్యాంగిల్స్ చేసే సవ్వడే వేరే లెవెల్ ఏమంటారు మీరందరు 



Rate this content
Log in

Similar telugu story from Classics