Dinakar Reddy

Abstract Children Stories Comedy

4  

Dinakar Reddy

Abstract Children Stories Comedy

పటాకులు - పిల్లలు

పటాకులు - పిల్లలు

2 mins
355


వీడొకడు నా ప్రాణానికి. దీపావళి వచ్చిందంటే చాలు. అన్ని పటాకులూ వాడికే కావాలంటాడు. 


చూడు తమ్ముడు ఎంత హుషారో అని వాణ్ణి నెత్తిన పెట్టుకొని ఇలా తయారు చేసారు.

అమ్మ దగ్గరికెళ్ళి అలిగి కూర్చున్నాను. పోన్లేరా. నేను నీకు విడిగా కొంటాను అనేంతవరకూ అలానే ఉన్నాను. 


నేను అనుకున్నది జరగ్గానే పరుగెత్తబోయి ఆగాను.


అమ్మా! చిన్నూకి ఎవరు కొంటారే? అని అడిగాను.


నీకెందుకురా? కలిపి కాకుండా విడిగా పటాకులు కావాలన్నావ్. నేను కొనిస్తా. తమ్ముడి మీద అంత ప్రేమ ఉంటే కలిపే కొంటా అంది. 


ఎందుకొచ్చిన గొడవ అని నేను ఆడుకోవడానికి వెళ్ళిపోయాను. 


ఇక రెండు రోజుల్లో దీపావళి. ఐదో తరగతి వాళ్లకు హోమ్ వర్క్ ఇచ్చారు. నేను ముందుగానే వ్రాసేసాను. చిన్నూ మూడో తరగతే. వాళ్లకేం తెలుసు హోమ్ వర్క్ బాధ.


నాన్న చిన్నూకి రెండు కాకరపువ్వొత్తుల డబ్బాలు, ఒక కుక్క పటాకుల ప్యాకెట్టు (ఎర్ర పటాకులు) ,మూడు చిచ్చుబుడ్ల ప్యాకెట్లు, రెండు భూ చక్రాల ప్యాకెట్లు, తాళ్ళు తెచ్చారు.


అమ్మ నాకూ అవే తెచ్చింది.

నేనూ, చిన్నూ విడివిడిగా పటాకులు ఎండబెట్టాం. నేను తెలివిగా పక్కింటి బన్నీ దగ్గర పాము పుస్సలు తీసుకుని అవి వెలిగించాను.


చిన్నూగాడు వచ్చి అన్నా! నాక్కూడా ఈయవా పాముపుస్సలు అన్నాడు. నేను కావాలనే ఇవ్వలేదు.


లేకుంటే ఇద్దరం కలిసి పటాకులు తెచ్చుకుందాం అంటే వాడికి ఎక్కువ కావాలని అంటాడా. ఇప్పుడు చూడు. నా దగ్గర పాము పుస్సలు, ఇంకా క్రితం దీపావళి తర్వాత దాచిన బొమ్మ తుపాకీ, రీళ్లు ఉన్నాయి. అసలు ఏమనుకున్నాడు వీడు అనుకుని ఇంటి లోపలికి వెళ్ళాను.


బయటికి వచ్చేటప్పటికి చిన్నూ చేత్తోనే కుక్క పటాకులు కాలుస్తున్నాడు. వాడికి తోడు వాడి ఫ్రెండు సుజన్ కూడా వచ్చాడు. 


రేయ్. దూరంగా కాల్చుకో అని చెప్పి నా పటాకులు జాగ్రత్తగా సర్దుకుని లోపలికి తెచ్చుకున్నాను.


కాస్సేపటికి వీధి తలుపు దగ్గర ఒకటే చప్పుడు. బయటికి వెళ్లి చూస్తే నిప్పురవ్వలు. కుక్క పటాకులు కాల్చేటప్పుడు మిరగళ్లు పడి అన్ని పటాకులూ పేలాయి. 


అమ్మా, నాన్నా ఏం జరిగిందో అని వచ్చి, చెరో దెబ్బా వేసి ఇంట్లోకి తీసుకెళ్ళారు. సుజన్ ఎప్పుడో ఇంటికి చెక్కేసినట్టున్నాడు.


నాన్న జాగ్రత్తగా బయట సగం కాలిన పటాకుల్ని నీళ్లతో తడిపి సంచీలో చుట్టాడు.


అసలేమైంది అంది అమ్మ. చిన్నూ గుక్క పెట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. నాన్న వచ్చి ఉన్న పటాకులు ఇద్దరూ జాగ్రత్తగా కాల్చుకోండి. అది కూడా సాయంత్రం ఆరు తర్వాత అని ఆర్డరు వేసాడు.


అమ్మ మా ఇద్దరి వైపూ చూసి బాగా అయ్యింది. కలిపే కొనుక్కుంటే సరిపోయేది. నేను ఉన్నప్పుడే కాల్చాలి పటాకులు అంటూ లోపలికి వెళ్ళింది.


చిన్నూ గాడు నా భుజం మీద చెయ్యి వేసి, పర్లేదు అన్నా! నేను నీకు కాకరపువ్వొత్తులు ఇస్తాలే అన్నాడు.


అసలు నాకెందుకు పటాకులు అనిపించింది..



Rate this content
Log in

Similar telugu story from Abstract