Srinivasa Bharathi

Drama

3  

Srinivasa Bharathi

Drama

ఎంతకు ఎంతెంత?:: శ్రీనివాస భారత

ఎంతకు ఎంతెంత?:: శ్రీనివాస భారత

1 min
426


"అవునా?"అంది సుగుణ

"అవునట" అంది సుజాత మెల్లగా..కోనేటి దగ్గర సంభాషణ ఇలా మొదలైంది ఇద్దరి మధ్య.

"ఎవరు చెప్పారు"

"అనసూయ నాతో అంది."

"అనసూయా?"

"ఏం నా మాట మీద నమ్మకం లేదా?"

"అలా అనికాదు. కానీసీతకి లవ్ స్టొరీ ఉందా అని"

"అమ్మాయి కాదా?" సుజాత వెటకారం గా అంది.

"నిజమే. కానీ నిప్పు లాంటి వంశం అంటుంటారుగా"

" అవతలి వాడు నీరులా కుమ్మేసి ఉంటాడు"

"అయినా ఆ పాడు ఆలోచన ఎలా వచ్చిందో"

'సినిమాలు , ఫోన్లు..చాలవా"

"అవును. రాత్రి లేదు పగల్లేదు.. పొద్దంతా ఒకే యావ"

"కొందరంతే లే"

"నవ్విపోతారన్న జ్ఞానం కూడా లేక పోతే ఎలా?"

"పిదప కాలం పిదప బుద్ధులు"

"బైట షికార్లు, తిరుగుళ్లు, ఆ వెకిలి వేషాలు..కంట బడితే తేళ్లు, జెర్రులు ఒంటిమీద పాకినట్టుంటాయి."

"అంతేనమ్మా..పట్టించుకున్నోళ్లకు పట్టించుకున్నంత"

"వాళ్ళ కి ఇలాంటి ఆలోచనలు రావు.పరువు తీసేస్తున్నారు.ఇలాంటి వాళ్ళు బ్రతకడం కన్నా."..అని ఆపేసింది..సుగుణ

రాత్రి ఐయింది. సీత అలసిపోయి ఇంట్లో నిస్త్రణగా వాలిపోయింది.

మర్నాడు సూర్యుడు నవ్వుతూ బైటికి వచ్చాడు..."ఇవాళ కొత్త కబుర్లకు ఎవరు ఎలాంటి రంగులద్దు తారోనని".

జానకి ముగ్గులేస్తూనే "ప్రమీల ఇది విన్నావా? సుగుణ వాళ్ల అమ్మాయి రాత్రి ఇంట్లోంచి వెళ్లిపోయిందట"

ప్రమీల వేస్తున్న ముగ్గు ఆపేసి"అవునట..ఆ ఘనకార్యం చేసింది సుజాత వాళ్ళ అబ్బాయట".

"అనుకున్నా. ఎంతసేపూ ఎదుటి వాళ్ళని ఆడి పోసుకోవడం తప్ప మరేమీ లేదాయే. .."

బయట పెద్ద గొడవ జరుగుతోంది. వంశచరిత్రలు గాలిలో తూటాల్లా పేలుతున్నాయి.ఇలా కూడా తిట్టు కోవచ్చని కొత్త పుస్తకం రాసేలా వాళ్ళ యుద్ధం, జుట్లు పట్టుకొని కొట్టుకొనేదాక వెళ్ళింది.

ఈ రోజుల్లో పిల్లల్లో ఇలాంటి పట్టింపులు ఏమి లేకపోయినా పెద్దల ఆలోచన ధోరణి మాత్రం భిన్నం చాలా కుటుంబాల్లో.

సీత మళ్ళీ బైటకి బయల్దేరింది..ఇవేమీ పట్టించుకోకుండా...కళ్ళముందు కదులుతున్న కాళ్ళు లేని తమ్ముడు, రోగిష్టి తల్లి, ఫోటోగా మిగిలిన తండ్రి...తన ముందు కర్తవ్యం గుర్తు చేస్తుండగా.

.

      xxxxxx.    xxxxxxxxxxx. xxxxxxxx


Rate this content
Log in

Similar telugu story from Drama