Srinivasa Bharathi

Comedy

3  

Srinivasa Bharathi

Comedy

విప్పి చూస్తే.....శ్రీనివాస భా

విప్పి చూస్తే.....శ్రీనివాస భా

1 min
482


"విప్పు..గబగబా"

"ఇప్పుడొద్దు"

"మరెప్పుడు?""

"సాయంత్రం చూద్దాం"

"ఇప్పుడు విప్పకపోతే నాకెలా కన్పిస్తుంది?"

"తర్వాత చూద్దాం అన్నానా?"

"సాయంత్రం నాకు కుదరకపోతే?"

"మరోరోజు అవుతుంది"

"నా మాటేందుకు వినవు?"

"నాకు వీలవదు"

"నేను సాయం చెయ్యనా?"

"ఆడిగానా..."

"చేస్తానన్నా తప్పేనా?"

"అన్ని విప్పెయ్యమంటారు...మళ్ళీ కట్టమంటే కట్టరు"

"ఇప్పుడు విప్పుతావా నన్ను లాగేయమంటావా"

"మీ ఇష్టం ఎప్పుడు చెప్పిన మాట విన్నారు గనక"

"అదికాదురా..సాయంత్రం పనిపడేట్లున్నది..

మళ్ళీ కుదర్దు.."బుజ్జగిస్తూ అన్నాడు శివ.

"ఐతే..?".

"చూపించమంటాను"

"నేను చూసుకుంటాలెండి"

"మళ్ళీ కావాలంటే నేనే చూడాలిగా?"

"అందుకే తొందరెందుకు?"

"ఎప్పటిదప్పుడు ఐతే నాకూ ప్రశాంతత"

"రేపట్నుండి ....నాకు కాంప్ ఉండొచ్చు.."

"రండి చూపిస్తాను...కళ్ళార్పకుండా చూడండి"అంటూనే

మళ్ళీ చూడలేదనేరు"...అంది లలిత

"నన్ను కుదురుగా కూర్చోనీ ముందు"

"విప్పినవన్ని పక్కన పెట్టాలి...చోటుంచండి అక్కడ"

"నీకు, నాకు కొంచెం చోటు....వాటికెక్కువ"

మెల్లమెల్లగా ఒక్కొక్కటి విప్పుతోంది లలిత

వింటూ తలాడి స్తున్నాడు మెల్లగా...రెప్పవాల్చకుండా చూస్తూ

"అన్నీ చూసేసారా....తృప్తిగా ఉందా ఇప్పుడు?"

"హమ్మయ్య...అనుమానం పోయింది "అన్నాడు శివ

"ఇప్పుడు అన్నీ కట్టండి."

"వద్దులే...తర్వాత మళ్ళీ""

"జ్యోతి అన్ని సరుకులూ మంచివే ఇస్తుంది మనకి.."

"చూడక్కర్లేదు...అంటే వినేరకమా మీరు..?"

"డబ్బిచ్చి కొన్నాక మంచివేగా కోరుకొంటాం...రెండుసార్లు మార్చేటప్పుడు నా తల ప్రాణం తొక్కొచ్చింది.మళ్ళీ అలా జరక్కూడాఉండాలనే పట్టుబట్టింది."

"అన్నీ సీసాల్లో సర్దేయండి శ్రీవారూ..."

"నువ్వే చూస్కో..నాకు బోలెడు పనుంది. వస్తా"

బయల్దేరాడు శివ..

కాగితం పొట్లాలు, పురితాళ్లు..దీనంగా చూస్తున్నాయి.

"లలితా గేట్ తాళం తీసుకురా..."

"అయ్యోరామ.. ఎడం చేత్తో ఎక్కడో పెట్టేసా"

"మరెలా బైటకి వెళ్లడం...?"

"ఈలోపు కొంచెం సర్దేయండి...గుర్తొస్తోందేమో"

"అర్ధం అయ్యింది....తప్పుతుందా..."

అన్నీ సర్దేసరికి గంట పట్టింది...

అప్పుడు దొరికింది తాళం .. వంట గది సింకు దగ్గర...

శ్రీమతి....మతి ఎలాంటిదో బాగా అర్థం అయింది శివకు.

************%%%%%%%%%%%;;**************


Rate this content
Log in

Similar telugu story from Comedy