STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Comedy Drama Inspirational

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Comedy Drama Inspirational

విధి

విధి

2 mins
605

రోజుని విధిగా నిర్వర్తిస్తూ పోవాలి అలా...కాదని ఆగామో!ఆగం ఆగమే...ఆమధ్య ఓ టీవీ పుట్టిన కొత్తల్లో ఈ విధి,చాలా మంది గతి,రోజువారీవిధుల్ని గంగలో కలిపేసింది.

అంతకుముందు హిమబిందువులు,కిట్టిగాళ్ళు,ఆనందాల బ్రహ్మాలు చక్కగా,పొందిగ్గా కూర్చోబెట్టి ఆ వారమో,ఆరోజుకో,ఓ సందేశాన్ని ఇచ్చి,నవ్వించి ఇంటికి పంపించేవి.

స్నేహితులు లేదా నాన్నమ్మ,పిన్నీ,అత్త తోడుగా,ఇంటిదారి పడుతుండగా విస్తృతమైన చర్చలు కూడా జరిగేవి ఆరోజు భాగం మీద.బిందు బాధపడింది,

కిట్టిగాడు అల్లరి ఎక్కువయింది,

శకుని నవ్వించేడు,

భీముడు భలే తిన్నాడు,

రామయ్య ఎం మాట్లాడేడని,

హనుమకి అంత ప్రేమ ఎందుకయ్యా రాముడు అంటే!?రావణుడు భలే అందగాడు సాహిత్యంలో,

నకులసహదేవులు చెవులకు చేటలు ఎందుకు కట్టుకున్నారు!

కుంతి సూర్యుడ్ని ప్రార్దించి బిడ్డని కని,పాపం ఏట్లో వదిలేసింది పిల్లోడు భలే తెల్లగా ఉన్నాడు...

సూరీడు అంశ కదేటి!? మరీ అందుకే అంతందం..

జస్పాల్ బట్టి భలే హాస్యం ఆడతాడు

.భ్యోoకేష్ ఇవ్వాళ ట్విస్ట్ ఎలా చేదిస్తాడు?

మందిరబేడి బొట్టు భలే పెట్టుకుంటుంది.

.ఈ సీరియల్ ఒక్కటే శుత్తమ్మా!!!

రినిఖన్నా ,శివేంద్ర జంట వచ్చింది ఇంగ్లీష్ వార్తలు చదవడానికి..భలే పోటీలే వాళ్ళిద్దరిదీ!?

సుకన్య రామకృష్ణన్,మినీ ఏమన్నా తక్కువా!?

జేవీ రమణల ద్వయం శాంతిస్వరూప్ ని గుర్తు తెస్తారురా!?

ఇవ్వాళ మధ్యాహ్నం చెన్నై కన్సర్ట్ లో చిత్ర పాట పాడింది..బాలుని కూడా చూసేమ్..

సినిమా ఏకుటారుల గుంపంతా ఉందండీ పాపగారూ!ఈ పాటలో(ఖాళీ సమయంలో మిలేసుర్ పాటగురించి)..

పిల్లలు అంటే అలా సకాశకా పొస్తకాలు సర్దుకుని బరికి పోవాలి (స్కూల్ చలే హమ్ పాట చూసి)

ఇయ్యాల ధర్మేంద్ర సినిమా వత్తది,తొందరగా బువ్వలు తిని టీవీకాడికి సేరుకోవాలి..

మూగ వార్తలు చెప్పే అమ్మాయి వేళ్ళు ఎంతబావున్నాయో!?పాపం నోరు కట్టేసుకోడం వలనేమో,ఆపాప సాలా లావుగా ఉంటది!

అలాంటి ఉంగరం కొనుక్కోవాలి పెద్దీ!

ఈడమ్మాకడుపుకాలా!చిత్రలహరిలో ఫష్టుకంటాని ఈపాట ఎత్తే,టయిమంతా తినెత్తాదే బాబూ!(జయకృష్ణాముకుందామురారి గురించి)బ్రేక్ వరకూ ఒకే పాట సరిపోయేది మరి...

ఈళ్ళ ఆటాలు కడసారనవ్వా!ఆదివారం సినిమా ఎగ్గొట్టేసి క్రికెట్ ఇచ్చేడు సత్యవతిగారూ!

మగాళ్ళకి పండగ ఆరోజు..ఆడాళ్ళని ఎర్రకళ్లేసుకుని,తలెత్తి చూడగలిగే మగాళ్ల రాజ్యం రోజు అది..

ఆదివారం కూడా ఎంత విధిగా సంతోషం పంచేదో టీవీ కూడా!పొద్దున్నే పిల్లలను నిద్రలేపే నెపంతో జంగిల్ బుక్,మికీ మౌస్,...యువతకి రంగోలి,పెద్దాళ్ళకి భారతం,అంతా ఓ సమయాన విధిగా సాగేవి..

అప్పుడు అందరిళ్ళల్లో టీవీలు లేవు.కానీ ఇంత ఆనందం చూడండి..సమయానికి ఆడమగా ,పిల్లజల్లా పనులు చక్కబెట్టుకుని చూసే విధంగా,విధిగా ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమాలు. ఆటికోసం ఎదురుచూపులో ఓ సంతోషం,ఆత్రుత ఉండేది..అంతవరకు ఆగే గుణం కూడా ఉండేది..కార్యక్రమం అయ్యాక ఆరోగ్యకరంగా చర్చ ఉండేది..ఆ చర్చకి నలుగురిలో గుర్తింపు ఉండేది.ఎలా అంటే ఇవ్వాళ ఫలానా వాళ్ళు టీవీ చూడ్డానికి రాలేదా!అని కుశలమడుగుతూ...

కానీ విధి చూడు!అందరింటికీ,అందరికి అన్ని టీవీలు అందించినా ఆ సంతోషం లేదు.టీవీల్లో కూడా విధి విపరీతాలు సాగతీతలు నేర్పినియ్యి..వంట మనకి గంటలో అవుతుంటే,వాళ్ళు వారం అంతా వండుతారు.వచ్చేవారం పాచింది తింటారు..కోడలుకు వంట చేయమని సోమవారం చెబితే,మంగళవారంకి మార్కెట్ కి పోయి,బుధవారానికి కూరలు శుద్ధి చేసి,గురువారానికి కోసి,శుక్రవారంనాడు దాకలో పొపేసి,శనివారంకి పులుసువేసి,ఆదివారం వడ్డిస్తుంది..

మనం అది చూసి ఇడ్లీ,దోస పిండి ,చట్నీ సమేత వారానికి ఓమాటే రుబ్బేసుకుని,మార్చురీ లో తోసేస్తున్నాం.ఒకచోట పులుసు,పప్పు కూడా ఉడకబెట్టి పెట్టేసుకుంటున్నారట..అందరూ ఆ బడే!మళ్ళీ తెలీనట్టు అవునా!?అని కళ్ళు ఇంత చేసుకుంటారు.

నీసు కూర అయితే ఫ్రిజ్జు పై అరలో కాలుమీద కాలేసుకుని,అన్ని కాలాల్లో చలికి వణుకుతూ... మరీ మాటాడితే రెండు వారాలకి నిద్రపోతుంది.అపుడపుడూ ఆత్రుత పెళ్లిళ్ల కంచంలో మంచుకొండలా పడుతుంది..ఏ అంటే,అస్తమానూ వేడి చేయకూడదంట..విధిరాతను మార్చుట ఎవరితరము గువ్వలచెన్నా...

ఎం ఖర్మ ఇది అనుకుంటే...విధి అమ్మా!విధి!

మనం ఇదం తప్పి,విధిగా చేయాల్సిన పనులు మానుకుని,ఆ దీపం,ఈ రాగం,ఆచెట్టు,మాజీగట్టు అని చూస్తూ కూర్చుంటే,పైగా ఒకరాధ ఇద్దరు కృష్ణులు పోయి ఓ కిట్టయ్యా ఓ పది ఏమో!ఎవరో...నాకేం తెలుసు !?ఈళ్ళంతా వచ్చి ఒకసారి కిందకి ఓసారి పైకి అంటూ చక్రాన్ని తిప్పుతుంటే...దొంగ ఏడుపులు,బాధలు పడిపోతూఉంటే...నటించండి మహనటులారా!అని దేవుడు రాసిన కొత్త విధివిధానాల అసందర్భ సందడి ఇది..మారాలి ఈ విధి..



Rate this content
Log in

Similar telugu story from Comedy