శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

సృజనా...ఎలా ఇలా

సృజనా...ఎలా ఇలా

2 mins
347


సృజన ఇక లేదట..చాలా మంచిది..చక్కగా మాట్లాడేది..నవ్వు చెరగనిచ్చేది కాదు ఎప్పుడూ..కానీ పిల్లలే అలాంటోళ్లు..

ఆ పిల్లలు!పిల్లలు ఎం చేస్తారు..చదువు చదువు అని దూరం పెట్టింది..ఉద్యోగాలు అని ఖండాలు దాటించింది..అన్ని లకరాలు ఇన్ని లకరాలు జీతమ్ పిల్లలకి అని గొప్పలు పోయేది..ఇప్పుడు ఏమైంది..ఐసుపెట్టెలో పడుంది..వాళ్ళు రావాలి ఈమె పోవాలి..

మనం కొంచెం కడుపుకు ఏమైనా తినాలి..రెండురోజుల ఉంచాలి అంటే మాటలా!!పగలంతా వచ్చిపోయేవాళ్ళ సందడి ఉంటుంది కాబట్టి సరిపోతుంది...రాత్రిపూట పీనుగతో జాగారం ఎవడు చేస్తాడు..

ఇగో!నిన్ను ఉండమన్నా ...నావల్లకాదు!పిల్లలు నువ్వు లేకుంటే ఉండలేరని చెప్పు నేనూ అదే చెప్తాను..పని మనిషి,తోటమాలి,చాకలామె మాటలు పైవిధంగా సాగిపోతున్నాయి...

టీలు,టిఫిన్లు నీళ్ళల్లా ఖర్చు అవుతున్నాయి..ఎవరు ఇస్తారో డబ్బులు కానీ,భలే పెడుతున్నారు..

బోండా,బజ్జి,దోస రెండు చట్నీ,కూల్ డ్రింక్,మజ్జిగ మధ్య మధ్యలో టీలు..

ఏ పీనుగకి ఇంత ఖర్మ రాకూడదు..దానికి పెట్టాల్సిన సమయంలో నాలుగు మెతుకులు వండేవాళ్లే కరువయ్యారు .అంతా పడి తినేవాళ్లే...ఇవతల చెరువు వడ్డున ఒటేలు సీతమ్మ ఇడ్లీ ముక్కలు చేసి కాకులకి వేస్తుంది..ఇలా చూడమ్మ సృజన!!నేను నీకు ఎం కాను కాబట్టి అన్నం పెట్టలేను .నువ్వుండగా బయటకు ఎప్పుడేళ్లినా బాక్స్ లో నాలుగు ఇడ్లీ పెట్టు బామ్మా!అనేదానివి..ఇపుడు అక్కడ శరీరం ఉన్నా ఈ బయటే తిరుగుతుంటావని నీకిష్టమైన ఇడ్లీ తెచ్చాను..తిను తల్లీ అన్నిటికీ కన్నీళ్ళతో దణ్ణం పెట్టుకుంది ...

మనసుతో చేసే పనికి ఫలితం ఉంటుంది...ఇక్కడే ఉండి తింటే తనని గుర్తు పట్టేస్తారనుకునో ఏమో...బామ్మ చేతిలో ముక్కలు అవ్వబోతున్న ఇడ్లీ మొత్తం లాగి,ముక్కున కరుచుకు ఎగిరిపోయింది ఓ కాకి..

అమ్మ దొంగా!బామ్మ పెదాలపై నవ్వు విచ్చుకుంది..

బామ్మకి కనపడని ఓ నవ్వు కూడా అక్కడ సంతోషంగా చిందులు వేస్తుంది..న్యాయమే చేసాను కదా అనుకున్నట్టు...

ఇక్కడికి వస్తే...ఇంకా ఈపూట అంటే మూడో రోజు చేస్తారన్నమాట..ఏమైనా తినడానికి బావుంది కాకుంటే సృజన కదలని శరీరం ముందు అన్న మీమాంస తప్ప,అది బాధ కాదు..

అన్ని కార్యక్రమాలు ఖరీదుగా కానిచ్చేరు కొడుకు,కూతురు అంతా కలిసి..ఊరన్తా పదకొండు రోజులూ పొయ్యి వెలగలేదు..దానం ధర్మం అన్నీ చక్కగా సాగిపోయాయి..ఊరి గుడిలో మండపానికి,బడిలో మంచినీళ్లు,సౌచాలయానికి...చెరువు చుట్టూ కట్ట,పూలమొక్కలు...పచ్చగడ్డి గట్ల పాటకి బ్యాంకులో కొంచెం అమౌంట్ వేసింది..ఆ వడ్డీతో గట్టుపాట పాడుకొమ్మని పైలోడు యాదగిరికి అప్పజెప్పినట్టుగా మొట్టమొదటి నోటు అందించారు కొడుకు కూతురు..

ఇంక అలా ఊరన్తా పంచుతూనే ఉన్నారు..ఇన్నాళ్లు తనవాళ్ళలా పని చేసిన చాకలి,తోటమాలి,మాయి కి రెండేసి లక్షలు ఫిక్స్డ్ వేసింది..అయ్యగారిని నలుగుపెట్టి తలస్నానాలు అంటూ ఆటపట్టించే మంగలి వెంకన్నకు అయిదు కుంచాల పొలం రాయించింది..పందులు మేపుకునే వారి పిల్లలు నలుగురికి చదువుకు గాను బ్యాంకులో డబ్బులు పాస్ పుస్తకాలు..ఊరన్తా తనపేరు నిండిపోయేలా ఎన్ని పనులు చేయించుకుందో లెక్కే లేదు..సృజన ఇప్పుడు దాదాపు అందరింటి అక్క,అమ్మ అయింది..ఇప్పుడు కూడా కొడుకుల్ని తోలేసి కుక్కల్ని పెంచుకుంది అనుకుంటున్నారు ఒక వర్గం వారు.

ఎందుకంటే ఆ వర్గానికి ఎంత తిన్నా తరగని ఆస్తి ఉంది..కానీ ఎం తిన్నా ఒప్పుకునే ఆరోగ్యం లేదు..మనం ఎం పెడితే అదే తిరిగి వస్తుంది..ఎం చేస్తే అదే ఎదురౌతుంది .ఇలా ఎన్నో అందరింటి పెద్దవాళ్ళు,తెలిసినవాళ్ళు చెబుతుంటే సృజన లాంటివాళ్ళు వింటారు..ఈ మరో వర్గం తేలిగ్గా కొట్టిపడేస్తారు .

ఇంతటి ఊరిలో ఎవరికేమి ఇవ్వాలో భలే ఎంపిక చేసుకుంది సృజన..కానీ సీతమ్మని వదిలేసింది...బామ్మా బామ్మా అని కొంగుపట్టుకు తిరిగినట్టు ఉండేది..

కానీ సృజన ఎంపికలో ఆమెకూ చోటు ఉంది..అడ్డంలాంటి సృజన హృదయం,అంతే అద్దం లాంటి ఇంటిని సీతమ్మకి గుండెలు లేకుండా రాసేసింది..తన భర్త ఉన్నంతవరకూ తల్లిలా సాకమని ప్రాధేయపడుతూ నోటుకి కలిపిన ఓ ఉత్తరంలో ఈ ప్రస్తావన చేసింది సృజన...

మాకూడా వచ్చేయండి నాన్నా!ఈ రాజ్యం పూర్తిగా అమ్మదే ఇక బాధలోనూ నవ్వుకుంటుంటే...

నన్ను ఇక్కడే కలిసిపోనివ్వండి..అదంటే ప్రాణం నాకు..దాని ప్రాణం ఇక్కడ ఉంటే ,నేను మీకూడా రాలేను..కన్నీళ్లు ఇంకిపోయాయి సృజన భర్తకి..

అన్నా!మీరేం బెంగపడకండి...బాబాయ్ ని కంటికిరెప్పలా నేనూ మా ఆడదీ చూసుకుంటాం..ఈసారి సెలవులకు వచ్చినపుడు ఎవుర్ర ఆపిల్లలు మనింటికీ వచ్చేస్తున్నారు అనేలా చెయ్యకపోతే నాపేరు చంద్రమే కాదు గొప్పగా చెబుతున్నాడు సీతమ్మ పెంపుడు కొడుకు...

కన్న పిల్లలు దూరమవుతున్న రోజుల్లో చంద్రంలాంటి వాడిని పెంచుకున్న సీతమ్మ ఎంపిక,సీతను తన భర్తకు తల్లిని చేసిన సృజన ఎంపిక ఊరి జనానికి ఓ అద్భుతంలా అనిపిస్తోంది అప్పటి నుంచి..మనం జీవితంలో ఎంపికకు ఇవ్వాల్సిన భాగస్వామ్యం ఇస్తున్నమా లేదా అని బుర్రకు పనిచెప్పాయి..ఈ ఎంపిక మాయి,తోటమాలి లాంటి కురచ ఆలోచనలో కూడా మార్పు తెచ్చింది..సృజన అందరి మనసులను సంతోషంగా సృజించింది..అందుకే ఈ మార్పు..ఎంపిక చేసిన ఓ మంచి కూర్పు...


Rate this content
Log in

Similar telugu story from Abstract