శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Drama Inspirational

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Drama Inspirational

మూసిన తలుపులు

మూసిన తలుపులు

4 mins
288


ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లడం కోసం బస్సెక్కాడు వివేక్.ఒక ప్రైవేట్ స్కూల్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్నాడు.కేజీ నుంచి పీజీ వరకు ఉన్న ఆ స్కూలేజీ లో మంచి జీతమే వస్తుంది అతనికి.

ఈ మధ్యే వివేక్కి పెళ్లి అయింది.భార్య మమత.

పేరులో నింపుకున్న మమత,ఒక సంవత్సరానికి సరిపోయింది.మమత కూడా మిడిల్ క్లాస్ అమ్మాయే.జీవితం మీద బోలెడన్ని ఆశలతో వచ్చానని మొదట్లో చెప్పినపుడు,వివేక్ సంతోషపడ్డాడు.నాకు అన్నింటిలోనూ తోడుగా ఉంటుంది అనుకున్నాడు.

ఏమండీ!అంటూ పొద్దున కాఫీ కప్పుతో మరియు నవ్వుతో ప్రత్యక్షమై...మీకిష్టమైన టిఫిన్ చేసెను,కుంకుడు రసంతో తలంటుకొండి,షాంపూ వద్దు..తలస్నానం చేసి సరిగ్గా తుడుచుకోరేమిటీ!?ఇంక చాకలి వద్దు,బట్టలు నేనే ఉతికి ,ఇస్త్రీ చేస్తాను.ఇలా ..వివేక్ జీవితపు ఒడ్డును సంతోషపు కెరటాలులా తాకుతూ...మురిపించేది..

నా అంత అదృష్టవంతుడు భూమి మీద లేడని,ఓ నిర్ణయానికి వచ్చేసేడు.ఈ సంతోషంలో ఓ పాపకి జన్మనిచ్చింది మమత..కూతురుని మాధురి అని పిలుచుకున్నాడు వివేక్..

మనవరాలు అయినా కుతురిలా పెంచుతున్నారు వివేక్ తల్లిదండ్రులు.మమతకు పొద్దంతా ఇంటిపని,వివేక్ వచ్చాక కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ...భోజనాలు సాగించడం రివాజు అయింది.

మాధురి స్కూల్ కి వెళ్లడం మొదలైంది.మీ పాప వెరీ బ్రిలియంట్..ఇంత ఫాస్ట్ గా నంబర్స్,ఆల్ఫాబెట్స్ వావ్!ఆశ్చర్యం అంది క్లాస్ టీచర్..మురిసిపోయారు ఇంటిల్లిపాదీ..

రెండో క్లాసులో ఉండగానే అన్నిరాష్ట్రాలు,రాజధానులు,

దేశాల పేర్లు వివేక్ ఇంటికి రాగానే నేర్పించగా...

నేర్చేసుకుంది.తాతయ్యకూడా వానాకాలం చదువుని మనవరాలికి నేర్పించేడు..పురాణాల్లో దేవతలు,రాక్షసులు పేర్లు గంటాపధంగా చెప్పేది..

పదో క్లాసుకి వచ్చింది..తండ్రిలో కంగారు మొదలయింది.

మమతా!ఐదింటికి మాధురి రాగానే,ఫ్రెష్ అప్ అవనిచ్చి,ఓ గంట దగ్గరుండి రెవిజన్ చేయించు,ఓ పొద్దు షేవింగ్ చేసుకుంటూ..భార్యకు చెప్పేడు.

ఏమిటి!ఎపుడూ లేనిదికొత్త పనులు ఆప్పచెబుతున్నారు కొంచెం కోపంగా అడిగింది.

అలా కాదూ!మాకూ స్కూల్ లో టెన్త్ బాచ్ ఉంటుంది కదా!ఈ రోజు నుంచి స్పెషల్ క్లాసులు నాకూ వేస్తున్నారు..ఏడవుతుంది నేను వచ్చేసరికి.ఇన్నాళ్లనుంచి ఐదింటికి రావడంతో నా బంగారాన్ని నేనె చదివించుకున్నాను..ఇక నీ బాధ్యత మొదలైంది..

నాకు కొత్త బాధ్యతలు అప్పగించకండి.ఉన్నవే చేసుకోలేక చస్తున్నాను.అందరికీ నేనె చెయ్యాలి.నాకు చేసేవారెవరూ లేరు..అంతా నా ఖర్మ..

మమతా!ఇపుడు ఏమైందని?పిల్లని ఓ గంట కూర్చుని చదివించమంటున్నాను.ఎదో పెరిగేలా ఉందనుకున్న వివేక్ తల్లి,నేను చూస్తానులేర అంది.

స్కూల్ టైం కావడంతో ,రెట్టించకుండా తయారయి వెళ్ళిపోయాడు..వంట,ఇంటిపని కానిచ్చి టీవీ ముందు కూర్చుంది మమత.భోజనానికి వచ్చిన మాధురి...తొందరగా వడ్డించమ్మా!ఇవ్వాళ్టినుంచి పావుగంట లీసర్ అంతే!రేపట్నుంచి నాకు బాక్స్ పెట్టమ్మా!అక్కడే ఉండిపోతాను..కాల్లుకడుక్కుని టేబుల్ ముందు కూర్చున్నా టీవీ దగ్గర్నుంచి లేవలేదు మమత.

నాన్నమ్మ వడ్డించింది..ముద్దలు చేసి తినిపించి...రేపట్నుంచి నేను కారేజీ తెస్తానులే అంది..

థాంక్యు నాన్నమ్మా!ముద్దిచ్చి వెళ్లిపోతూ..బై మమ్మీ అన్నా పలకలేదు మమత.

సాయంత్రం తాతయ్యా దగ్గర పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది.తల్లిగాడు చదువుతున్నాడా అంటూ నాన్న ఫోనుకు.. మరింత బాగా చదవాలనుకుంది..

పో!తాతయ్యా!నీకసలు లెక్కలు సరిగ్గా రావు.సైంసు,సోషల్ కూడా ఏమీ చెప్పవూ...

నీకులా మా నాన్న చదివించలేదు తల్లి..లేకుంటే మీ స్కూల్ లో టీచరుగా వచ్చేసేవాడిని నవ్వేడు కానీ,మనవరాలు చదువు పాడవుతుంది బాధ కలిగింది..

సాయంత్రం కొడుకుతో చెబుదామనుకునేలోపు,మాధురి నాన్నతో అంటోంది..నా ఫ్రెండ్ కూడా మన ఇంటి లైనులోనే నాన్నా.ఇద్దరం చదువుకుంటాం ప్రామిస్ .

మార్కులు తగ్గకూడదు ..కావాలంటే తననే మనింటికీ రమ్మను..అన్నయ్య ఉన్నాడు కదా ఆ అమ్మాయికి ..మన ఇల్లు అయితే సేఫ్టీ కూడా ఉంటుంది.మరీ మరీ చెప్పేడు.

చదువుకుందాం అనే వెళ్ళింది మాధురి.కానీ టీవీలో ఎపుడూ మ్యూజిక్ ఛానల్ డిస్టర్బ్ చేసేది.అదే విషయం ఫ్రెండ్ కి చెబితే..మ్యూజిక్ వింటూ చదివితే తొందరగా ఎక్కుతుందని అన్నయ్య అంటాడు..ఇలా చేస్తాడు.అది తింటాడు ఇలా నెమ్మదిగా రూటు మారడం మొదలైంది.

ఇపుడు మాధురి నాన్నకి సెలవు వచ్చినా,దగ్గర ఉండడం మానేసి ఫ్రెండ్ తో చదువుకుంటాను అంటుంది.

ఓరోజు చూడడానికి వెళ్లిన నాన్నమ్మకి ...ఫ్రెండ్ సోఫాలో చదువుకుంటూ ఉంటే...మాధురి,ఆ అబ్బాయి దివాన్ మీద కుర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తున్నారు..

ఆరోజు నాన్నమ్మ అరిచిన అరుపుకి ఫ్రెండ్ అమ్మగారు..ఇలా జరగదండీ అంటూ ప్రాధేయపడింది.

సాయంత్రం వివేక్ ముందు పంచాయితీ నిలబడింది.చదువుకోవాలి కదమ్మా!ఈ వయసులో చదువు దారి తప్పితే...మళ్ళీ తలకెక్కదు...ఇది ఫౌండేషన్ సమయం..సాధ్యమైనంత జ్ఞానాన్ని ఆర్జించాల్సిన సమయం.ముందు ఏం చదవాలో డిసైడ్ చేసే చదువు ఇది.ఇపుడు దారి తప్పితే....

అబ్బా!నాన్నా...నువ్వు ఇంత భారతం చెప్పాల్సిన పనిలేదు.నాకు అర్థం అవుతుంది..బోరింగ్ నాన్నా!ఇంకేదైనా చెప్పండి..నాన్న చుట్టూ చేతులు వేస్తూ ...కూర్చుంది..ఇవ్వాళ మాధురి తంతు కొత్తగా ఉంది.నాతో మాట్లాడని మాటలు,చేతలు అన్నీ కొత్తగా ఉన్నాయి..

ఎప్పుడూ ఏదోటి ఆలోచిస్తూనే ఉంటాడు..పూర్ డాడీ..అంటూ వెళ్ళిపోయింది.

మమతా!అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటున్నవా?

మీరు దేనికే అనుమాన పడకండి.నేను అంతా చూసుకుంటాను..దాన్ని చదివిస్తున్నాను..ఇంటికి వస్తే లేట్ అని భోజనం ఇచ్చి వస్తున్నాను.సాయంత్రం స్నాక్ కూడా పట్టుకెళ్తున్నాను..మమత అబద్దాలకు హడలిపోతున్నారు లోపల మావా అత్త.

ఓ రోజు స్కూల్ నుండి ఫోను వచ్చింది వివేక్కి.మీ అమ్మాయి వారం రోజులుగా స్కూల్కి రావడం లేదు..ఈ టైములో ఊరెళ్తే,రేపు మార్కులు తక్కువైనియ్యి అంటారు అంటూ..

స్కూల్ కి వెల్దామని,దారికదా అని ఇంట్లోకి వెళ్ళేడు.మమత టీవీ చూస్తూనే నిద్రపోతోంది.పెద్దోళ్ళు బయట కూర్చున్నారు..ఐదవుతున్నా నిద్ర ఏంటి మమతా!స్నాక్స్ ఇవ్వవ మాధురికి...కొంచెం గట్టిగానే అన్నాడు..

ఉలిక్కిపడి లేచింది..ఆ!అదే అనుకుంటున్నా వంటగదిలోకి వెళ్లి బిస్కట్ పేకెట్ తెచ్చింది.ఇచ్చేసి రండి..మళ్ళీ పడుకోబోతుంటే...

ఎవరికి?ఎక్కడుంది అని ఇవ్వాలి?

పిల్ల ఎక్కడకి వెళ్తుందో కనుక్కుని పని లేదా నీకు?

వారం నుంచి స్కూల్ కి వెళ్లడం లేదట.ఫోన్ చేసేరు స్కూల్ నుంచి..

ఎం చెప్పాలో అర్థం కాలేదు మమతకు...కాగల కార్యం అన్నట్టు..బైకు ఆగిన శబ్దం అయింది.బై మూర్తి అంటూ ఫ్లయింగ్ కిస్ ఇస్తోంది కూతురు..కాళ్ళకింద భూమి బ్రద్దలైనట్టు అనిపించింది.

తండ్రిని చూసి తత్తరపడినా..ఎపుడొకపుడు తెలియాల్సిందేగా అన్నట్టు లోపలకి వచ్చి నుంచుంది..

ఎక్కడినుంచి?మునుపెన్నడూ ఎరుగని గొంతు

సి...సినిమాకి...వెళ్లే....చెంప మిగిలిపోయింది ఈలోపు.

ఎదిగిన పిల్లని అంటూ....అడ్డురాబోతుంటే మమతకు వడ్డించేడు వివేక్..

సంతోషం,సంపాదన పెంచుకోవడం రాదుగానీ...చెయ్యెత్తడం మాత్రం వచ్చు.ఇపుడు ఎం మునిగిందనీ...

టర్మ్ ఫీ కడదామని బీరువా తెరిచేసరికి ఓ డజను పట్టుచీరలు ఒకేసారి కిందపడ్డాయి.

ఇవన్నీ ఏంటి?ఇన్ని చీరలు...

మొహాలు చూసుకుంటున్నారు తల్లికూతుర్లు..నువ్వే చెప్పు అన్నట్టు కళ్ళెగరేస్తుంది మాధురి..

మీరు కూర్చుంటే...ఓ విషయం చెబుతాను..మాధురి,చివరింటి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు..అబ్బాయికి ఈ సంవత్సరం డిగ్రీ అయి, ఉద్యోగం వచ్చేస్తుంది.మధ్యతరగతివాళ్ళం ఇలాంటి సంబంధం తేగలమా!?పైగా ముహుర్తాలు కూడా పెట్టేసుకున్నారు..ఈ చీరలు నాకూ దానికి..ఇవ్వాళ మీకు కూడా కొందామని రాజమండ్రి వెళ్ళేరు...కళ్ళు తిరిగిపోతున్నాయి వివేక్ కి..నేను వింటున్నది నిజమేనా!నా కూతురు ఎదిగిపోయిందా!నేను కోమాలో ఉన్నాన??నా ఇల్లేనా ఇది...కొడుకుని పట్టుకున్నాడు తండ్రి..

చాలా సేపటికి తెలివి వచ్చేసరికి..మాటలు వినిపిస్తున్నాయి పెరటిలో నుంచి..మీ నాన్న జీతానికి అలాటి మొగుడ్ని తేవడం కలే!మీరు కూడ కొడుకు బాధపడిపోతాడు అనుకోక...విషయం ఇది అని చెప్పండి.ఇపుడు పెళ్లి ఆపడం కూడా కుదరదు..బైటయ్యి రెండు నెలలు అయింది పిల్ల. టెస్ట్ చేసి చూస్తే..పాజిటివ్ వచ్చింది.అల్లరి కాకుండా కార్యం గట్టెక్కాలి.కొడుక్కి సర్ది చెప్పండి..

ఎంత నమ్మకం,ప్రేమ తో మెలిగేను భార్య,కూతుర్లతో.. కనీస బాధ్యతగా కూడా నాతో డైరెక్ట్ గా విషయం చెప్పరా!?నెనుఎక్కడ లోటు చేసెను.ప్రతినెలా అందరి అవసరాలూ తీర్చేనే!?ఇంకా కావాలి అని అడిగి ఉంటే ప్రయత్నం చేసేవాడిని కదా!ఇపుడు ఎందుకు వీళ్ళను ఆపలేకపోతున్నాను..ఇంట్లో నా పాత్ర నిర్వహించడంలో లోపం ఎక్కడ జరిగింది?కుమిలిపోతున్నాడు వివేక్..

నేను చూపించిన ప్రేమ ,నమ్మకం ఖైదీగా నిలబెట్టాయి భార్య,కూతురు ముందు..నాకు శిక్ష ఏదైతే బావుంటుంది?ఆలోచిస్తున్నాడు..

మన ఊరు వెళ్లిపోదాం.చదువు చట్టుబండలూ ఊరు మారేం.జీవితాలు మారిపోయినియ్యి ఇపుడు.మన మాటకు విలువ లేదిపుడు..తండ్రి అంటున్నాడు.

వివేక్ కి ఎం వినిపించడం లేదు..భజంత్రీలు వాయించండీ..మాంగల్యం తంతు...నా చిట్టితల్లి జీవితానికి ఓ మంచి దారి వెయ్యలేకపోయాను.చీ!...

రండి!వియ్యంకుడు పిలుస్తున్నారు..కళ్ళుతుడుచుకోండి

..అమ్మాయి దూరం అవుతుందని బాధ పడుతున్నారు అన్నయ్యా!మమత మాటలు మరింత భాదిస్తున్నాయి.కానీ ఏం అనలేకపోతున్నాడు..ఎందుకని!?....



Rate this content
Log in

Similar telugu story from Abstract