Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

ఓ కొత్త ప్రయాణం

ఓ కొత్త ప్రయాణం

2 mins
394


ఆదిత్య హైదరాబాద్ లో రెండు రోజులు పర్యాటక ప్రదేశాలు చూడ్డానికి లక్కీ డ్రా లో ఎంపిక అయ్యాడు. లగేజీ సర్దుకుని టిప్పు టాపుగా రెడీ అయ్యి ట్రావెల్ ఆఫీసుకు వెళ్ళాడు.


హైదరాబాద్ కి ఫ్లైట్ లో పంపిస్తున్నారా నన్ను అంటూ కౌంటర్ లో ఉన్న వ్యక్తికి తను లక్కీ డ్రాలో ఎంపికైన విషయం చెప్పాడు.


ఆ వ్యక్తి ఆదిత్యను కూర్చోబెట్టి మరో గదిలో ఉన్న ఒక అరవై ఏళ్ల స్త్రీని , ఆమెతో పాటు ఓ కాలేజీ విద్యార్థినిని తీసుకు వచ్చాడు. 


ఇదిగోండి.. ఈయన పేరు ఆదిత్య. ఈ ఊరిలోనే ఓ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. మిమ్మల్నిద్దరినీ భద్రంగా హైదరాబాద్ తీసుకుని వెళ్లి తీసుకొస్తాడు. ఏం భయం లేదు అన్నాడు. 


అదేంటి ట్రిప్ కి నేను మాత్రమే కదా సెలక్ట్ అయ్యింది అని అడిగాడు ఆదిత్య.


లేదు సార్. మీరు ముగ్గురూ లక్కీ డిప్ లో సెలక్ట్ అయ్యారు. కొంచెం వాళ్ళను జాగ్రత్తగా చూసుకోండి.

 అదిగో మీకోసం కారు కూడా వచ్చేసింది అంటూ బయట ఉన్న కారు చూపించాడు.


ముగ్గురూ కార్లో కూర్చున్నారు. తనొక్కడే వెళ్ళినా, తనలా పాతికేళ్ల వాళ్ళతో వెళ్ళినా టైమ్ పాస్ అవుతుంది అనుకున్న ఆదిత్యకి ఇప్పుడు వీళ్ళిద్దరితో ఎలా అడ్జస్ట్ అవ్వాలో అర్థం కాలేదు.


బామ్మ గారూ! అవసరమైన టాబ్లెట్లు అన్నీ తెచ్చుకున్నారా? వెనక్కి తిరిగి లేని నవ్వు తెచ్చిపెట్టుకుని అడిగాడు. 


కాల్ మి మేడమ్. అయినా నాకేం రోగం టాబ్లెట్లు వాడ్డానికి అంది. రోజుకు రెండు సార్లు స్నానం చేస్తాను. రోజుకు రెండు సార్లు యోగా చేస్తాను అంటూ చెప్తోంది.


అయ్యో మేడమ్. మీరు ఫిట్నెస్ ఫ్రీక్ లా ఉన్నారే అని కారు విండో లోంచి బయటికి చూస్తున్న కాలేజీ అమ్మాయిని పలకరించాడు.


హాయ్. ఖాళీ టైమ్ లో ఏం చేస్తుంటారు? నాకైతే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ చూడ్డం అలవాటు. గేమ్ ఆఫ్ త్రోన్స్ మొత్తం చూసేసా అన్నాడు.


ఆ అమ్మాయి నిర్లిప్తంగా నవ్వి నేను ఓన్లీ కొరియన్ సీరియల్స్ మాత్రమే చూస్తాను అని మళ్లీ కిటికీ లోంచి బయటికి చూస్తోంది.


ఆదిత్య డ్రైవర్ వైపు చూసి ఏదో అడగబోయి మళ్లీ సైలెంట్ అయిపోయాడు. అతడికి ఈ ట్రిప్ బాగా మెమొరబుల్ అవుతుంది అనిపించింది.



Rate this content
Log in

Similar telugu story from Abstract