Dinakar Reddy

Abstract Drama

4.0  

Dinakar Reddy

Abstract Drama

బ్యాచిలర్ అయితే

బ్యాచిలర్ అయితే

2 mins
486


సంజూ. రేపు ఒక్క రోజు నైట్ షిఫ్ట్ చెయ్యవా. కొలీగ్ మాధవ్ నుంచి రిక్వెస్ట్. 

ఏం లేదు. వైఫ్ తో కలిసి వెడ్డింగ్ రిసెప్షన్ కి వెళ్ళాలి అన్నాడు. 

సరే మాధవ్. నెక్ట్స్ వీక్ నేను ఇంటికి వెళుతున్నా అప్పుడు అవసరం అయితే కొంచెం నా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అని తన అవసరం కూడా చెప్పాడు సంజయ్. మాధవ్ తప్పకుండా చేస్తాను అని భరోసా ఇచ్చాడు.


రెండు రోజుల తరువాత..


శేఖర్ సార్. నాకు నెక్స్ట్ వీక్ లీవు కావాలి. మేనేజర్ ని అతి వినయంగా అడిగాడు వరుణ్. లీవు విషయంలో తప్ప మిగిలిన టైంలో ఎప్పుడూ మేనేజర్ కి ఇంత రెస్పెక్ట్ దొరకదు అని శేఖర్ నవ్వుకున్నాడు.


నెక్స్ట్ వీక్ కష్టం వరుణ్. హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్షన్ ఉంది. ఏమైనా అర్జంటా.. అని ఆగాడు శేఖర్.


సార్. మ్యారేజ్ డే కి ట్రిప్ ప్లాన్ చేశాను అని చెప్పాడు వరుణ్.

సరే. ఒక పని చెయ్యి. నెక్స్ట్ వీక్ సంజయ్ కూడా లీవ్ అప్లయ్ చేశాడు. తను క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు నువ్వు వెళ్లొచ్చు అని ఐడియా ఇచ్చాడు శేఖర్.


వరుణ్ సంజయ్ దగ్గరికి వెళ్లి ప్లీజ్ సంజయ్. నెక్స్ట్ వీక్ లీవ్ క్యాన్సిల్ చేసుకోవా. నా మ్యారేజ్ యానివర్సరీ ఉంది. వెకేషన్ ప్లాన్ చేసుకున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకో బ్రదర్ అని అడిగాడు.


లేదన్నా. నాకు ఇంపార్టెంట్ పని ఉంది. పైగా నేను నాలుగు నెలల నుండి లీవ్ పెట్టకుండా ప్లాన్ చేసుకున్నాను అని సమాధానం చెప్పాడు.


సరే. ఈ ఒక్క సారి హెల్ప్ చెయ్యి. బ్యాచిలర్ వి నీకే లీవ్ అంత అవసరం అంటే మరి నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో. కావాలంటే తరువాత నువ్వు లీవ్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా బాస్ తో నేను మాట్లాడుతాను అని అన్నాడు వరుణ్.


వరుణ్ రిక్వెస్ట్ చేయడం చూసి పక్కనే ఉన్న మాధవ్ కూడా పాపం. సంజూ హెల్ప్ చెయ్యొచ్చు కదా అని ఓ ఉచిత సలహా పారేశాడు.


ఈ మాటలతో సంజయ్ కి విసుగు వచ్చింది. అరె! నైట్ షిఫ్ట్ చెయ్యొచ్చు కదా బ్యాచిలర్ వి. రూములో ఏం చేస్తావు. లీవ్ ఎందుకు. బ్యాచిలర్ వి ఏం పనులుంటాయి.


బ్యాచిలర్ అయితే ఏం. బ్యాచిలర్స్ మనుషులు కాదా. వాళ్ళకి పేరెంట్స్ ఇంకా బాధ్యతలు ఉండవా? కాస్త ఫ్యామిలీతో ఆనందంగా గడపాలని, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లాలని ఉండదా?


అసలు బ్యాచిలర్ కి సంబంధించిన లీవులు, టైమింగ్ ఇలానే ఉంటుంది అని లేకపోతే ఇలానే ఉండాలి అని రాజ్యాంగంలో ఏమైనా వ్రాసుందా అని గట్టిగా అరవాలనుకున్నాడు సంజయ్. 


ఈ లోపు శేఖర్ తన టీ కప్పు తీసుకుని బయటికి వచ్చి తాపీగా ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు.


వరుణ్ శేఖర్ వైపు చూశాడు. టీం కోసం మీలో మీరే అడ్జస్ట్ అవ్వొచ్చు కదా అని శేఖర్ ఒక డైలాగ్ వేశాడు. 


సంజయ్ ఏం మాట్లాడలేదు. 

అతడికి తను పని చేస్తున్న ఊరికి చాలా చాలా దూరంగా ఉన్న వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చింది. కొడుకు లీవు పెట్టుకుని వస్తాడు. 

వచ్చినప్పుడు మంచి చెనిగ్గింజల (వేరుసెనగ గింజలు) రసం చేయాలని చెనిక్కాయలు వలుస్తూ కూర్చున్న అమ్మ గుర్తుకు వచ్చింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract