శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Drama Inspirational

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Drama Inspirational

నిజమైన కల

నిజమైన కల

3 mins
377


నాన్నా డైరీ మిల్క్ ...మీకు ఇష్టమైంది,ఇంకా ఈ కూతురికి ఇష్టమైంది జరిగింది అంటూ ముక్క విరిచి నోట్లో పెట్టింది అంకిత్ కూతురు మీనా..


చాక్లెట్ పెరు వింటే అమ్మ గుర్తొస్తుంది..తనను ఓ ఆట ఆడించేది..పండుగ,పుట్టినరోజా,లేక చెప్పడానికి ఇప్పుడు ధైర్యంగా అనిపిస్తుంది,ఆప్పుడైతే అమ్మ ముందే పాంట్ తడిచిపోయేది..


డైరీ మిల్క్ ఓ యాభై తెండి!ఉండండి..ఉండండి!మీ క్లాస్ స్ట్రేంత్ ఎంతరా చిన్నమ్మా!?


ఎందుకమ్మా!అమాయకంగా అడిగాడు అంకిత్,వనజ కొడుకు..ఆశ్చర్యం భర్తగారి వంతు కూడా అయింది..వనజ ఎం చేసినా వెంటనే ప్రశ్నించడం వివేక్ కి ఇష్టం ఉండదు..ఆ పహేలీ తానే చేధించాలి అనుకుంటాడు..చిరునవ్వుతో బండి దగ్గర అలానే నుంచున్నాడు..


ప్లీస్ అమ్మా!ఎం కంపు చెయ్యొద్దమ్మా!ఇప్పుడు మన ముగ్గురిలో ఎవ్వరి పుట్టినరోజూ లేదు..పండుగ సీజన్ కూడా కాదు..నీకు దణ్ణం ..


నోర్ముయ్యరా!నువ్వు చెబుతావా,స్కూలుకు ఫోన్ చేసి నేనే కనుక్కోనా!?అమ్మ ఆగేలా లేదు అనిపించి యాభైరెండు అన్నాడు..


ఓ డెబ్భై తెండి..కాలనీలో కూడా పంచాలి..ఆర్డర్ వేసి లోపలికి వెళ్ళిపోయింది..


లంచ్ బాగ్ ఏదిరా!పుస్తకాల బాగ్ భుజాన వేసుకున్న కొడుకును ప్రశ్నించేడు.


వద్దు నాన్నా!అతి అయింది అమ్మకి..ప్రతీ సంవత్సరం ఓ ఆట అయిపోయింది ఈమెకు.నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని కూడా లేదు..కరాటే పంచ్ ఒకటి పొట్టలో ఇచ్చుకున్నాడు.


జాగ్రత్త!అసలే లంచ్ లేదు..డబ్బులు ఏమైనా ..కాంటీన్కి సమర్పించుకుంటావా..


అసలు తిననే తినను నాన్నా!ఇవ్వాళ ఉపవోసం ..మీరు పోనివ్వండి..


అబ్బో పలకడానికి కష్టం అవుతుంది..అప్పుడే ఉపవోసం మొదలుపెట్టేసావా..!?వెనక్కి తిరిగి బుగ్గ అందుకోబోయేడు..


నాన్నా!ముందుకు పోనివ్వండి..డోంట్ డిస్టర్బ్..డ్యా.....మ్


ఓహో!ఇవి ఎక్కువయ్యే,అక్కడ తేడా జరిగిందన్నమాట నవ్వుకున్నాడు వివేక్..


రెండు క్లాసులు అయి,టిఫిన్ బ్రేక్ ఇచ్చేరు..సరయు,కార్తీక్,

కౌండిన్య,అగస్త్య,కోమలి,మాలిని వీళ్లంతా కూడా చాలా...అంటే చాలా హ్యాపీగా టిఫిన్ తింటున్నారు..

మధ్యలో రారా!అంకిత్ అని ఓ కమ్మని పిలువు ..ఇవ్వాళ ఆ కమ్మదనాన్ని ఆస్వాదించలేకున్నాడు అంకిత్..


అమ్మ స్కూల్ కి వస్తుందా!?ప్రిన్సి ని కలుస్తుందా!?కలిస్తే ఎం చెబుతుంది!?మునుపటి ప్రిన్సి పేనుబెత్తాన్ని విరిగేదాకా వేసేసేవాడు..అమ్మ దృతరాష్ట్రీని!ఒట్టి గుడ్డిది,పాషాణ మనస్విని అయిపోయేది..ఇంకా తెలీని వచ్చీరాని నవ్వు ఒకటి విషం....నిజమేనా!అమ్మ నాన్నతో ఐస్క్రీమ్ తెప్పిస్తుంది..చిరాకేసే ఆకుకూరల్ని చిటికెలో కట్లెట్గా మార్చేస్తుంది..అమ్మ పాయసం వండితే మా ఫ్రెండ్స్ కూడా నాకు మిగగల్చకుండా తినేస్తారు..నాడ్రెస్ ఎప్పుడూ డర్టీ ఉంచదు,అమ్మ చెప్తేనే నేను డ్రెస్ నీట్గా నాన్నలా ఎలా ఉంచాలో నేర్చుకున్నాను..ఇన్ని చేసిన అమ్మ ప్రిన్సి కొడితే నిజంగా నవ్వుతుందా!?రెందురకాల ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.


బెల్ ముగియడంతో మళ్ళీ క్లాస్ మొదలైంది..సైన్స్ టీచర్ క్లోరోఫిల్ ఎక్స్పరిమెంట్ చెబుతోంది..మధ్యలో అందమైన పిలుపు..అమ్మ వచ్చింది సంతోషంలో లేచినా,కారణం తెలిసి ఆగిపోయాడు..


నమస్తే వనజమామ్!ఏమిటి విశేషం!?చేతిలో కవర్ చూస్తూ అడిగింది..


క్లాస్ మొత్తం కిసుక్కున నవ్వుకుంటున్నారు..


డియర్ హీరోస్!మీ స్నేహితుడు అంకిత్ ఏ ఏడాదీ పరీక్ష తప్పాడు..అంటే మార్కులు తక్కువ వచ్చాయి అంటున్నాను..నేను వస్తుంటే సైన్స్ మామ్ గార్డెన్ లో లీవ్స్ చూపిస్తూ చెబుతాను పచ్చదనాన్ని ఆకులు ఎలా నింపుకుంటాయో అని..అంత కష్టపడ్డ మీ మిస్ కి మీరిచ్చే బహుమతి ఇంతేనా!?ఇరవైకి ఎనిమిది మార్కులా..ఈ పరిస్థితి ఇలా ఉంటే సగం సిలబస్ ఉండే మొదటి అస్సెస్స్ పరిస్థితి ఏంటి!?సిలబస్ మీరు ఎలా కవర్ చేసుకోవాలో మీకూ ఓ డిసైన్ వద్దా!!ఔట్ డోర్ గేమ్స్ ,ఫోన్లో గేమ్స్,టీవీలో కార్టూన్ అంటూ ఎంజాయ్మెంట్ కి ఉన్న టైంటేబుల్ ,చదువుకోవడానికి వద్దా!..


దానికి మీ క్లాస్ వద్దులే ఆంటీ!ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు మాకు..ఎవడో ఆకతాయి మాటలకి,సైలెన్స్ అంది మేడమ్.


నిజమే!మామ్ నేను అప్గ్రేడ్ అవ్వాలి..మేడమ్!నా మాటలు అవసరం లేనివారిని ఫ్రీ చేసే అవకాశం ఉందా ప్లీజ్!వనజ ఆర్ధింపుని కాదనలేకపోయింది..


ఇష్టంలేనివాళ్ళు గ్రౌండ్ కి వెళ్లొచ్చు..అనగానే క్లాస్ ఫస్ట్ వచ్చిన అమ్మాయితోపాటూ ఓ అరడజను మంది మాత్రమే వెళ్ళేరు బయటకి.


థాంక్స్ మై హీరోస్!అంటుంటే


చాక్లెట్ కోసం ఆగాము ఆంటీ!ఇంకొకడు అరిచేడు.


ముందు పంచేస్తాను..అయితే వెళ్లిపోతారా..ఎందుకంటే ఒక్కరు విన్నా నా మాట నాకు బోలెడంత తృప్తి ఇస్తుంది నవ్వుతూ చెప్పింది వనజ..


ఇంక మాట్లాడలేకపోయారు ఎవరూ!ఆంటీ ఈ రోజు టర్న్ మీది..మీరు ఏమైనా చెప్పండి.మేము వింటాం..ఇంకా మీరు చాలా బాగా చెప్తారు ఎం చెప్పినా,నాకు నచ్చుతుంది..ఈ క్లాస్లో నాది లాస్ట్ ర్యాంక్ ఆంటీ!ఇప్పుడు టాప్ టెన్ లో ఉన్నాను అది మీవల్లే అంటే మా ఇంగ్లీష్మిస్ ,సోషల్ సార్లు కూడా నమ్ముతారు..

వాడు కార్తీక్, వాడికి అబ్దుల్ కలాం అంటే ఇష్టం రోజూ ఫ్లైట్ చూస్తుంటాడు..

కోమలికి మరికోమ్ అంటే ఇష్టం ఇప్పుడు సైంసు బుక్ లో ఆమె పిక్ కూడా ఉంది చూడండి.

అతెందుకు మీ అంకిత్ కి ఏంటీఆర్ డాన్స్ఇష్టం,ఎప్పుడూ 

అన్నలా అవుతా అంటాడు..రొప్పుతో ఆగేడు గౌతమ్ (టాప్ టెన్ లో వన్.)


ఇంత తెలుసా నీకు..మరి నీకు ఎవరు ఇష్టం గౌతమ్!?వనజ అడిగింది..


తలొంచుకు నిలబడ్డాడు..


చెప్పు గౌతమ్,ఎందుకు తల దించుకున్నావ్!?


ఏడుస్తున్నట్టుగా అర్థమౌతుంది..మేడమ్ నేను వెళ్ళనా!?మీరు...


మీకు ప్రాబ్లెమ్ లేదంటే వెళ్ళండి వనజా!ఇది పేరెంట్ ఇంటరాక్షన్ క్లాస్ ...పూర్తిగా మీ ఆధీనంలో ఉంటుంది 


ఎందుకు నాన్నా!ఏడుస్తున్నావ్!?ఆంటీ తప్పు ఆడిగిందా..


ఆంటీ తప్పు అనదు ఎప్పుడూ గట్టిగా అరిచేడు.అప్పటికి ఉన్న కాస్త అల్లరీ సద్దుమనిగి,నిశ్శబ్దం ఆవహించింది..


తిను నా రోల్మోడెల్..నాకు తిను అంటేనే ఇష్టం..మా అమ్మ..అమ్మ..గట్టిగా పట్టుకు ఏడ్చేసేడు వనజని..


ఏమైంది గౌతమ్!?


సారి వనజగారూ!గౌతమ్ కి అమ్మ లేదు..మిమ్మల్ని వాడి అమ్మగా...


వనజ విస్తుపోయింది అనడం కన్నా,ఓ మామూలు మనిషినీ ఇష్టపడచ్చా!అదీ చిన్నపిల్లల్లో ఇంత పరిణితిలో...క్లాస్ కి థాంక్స్ చెప్పడం,చాక్లెట్స్ పంచడం మర్చిపోయింది..అలా బయటకు,తరువాత ఇంటికి వచ్చేసింది,కానీ అంకిత్ కోసం ఎదురు చూస్తూనే ఉంది..

ఆ చూడడం... చూడడమ్ నేను ఇంత ఎదిగేవరకూ...

ఇంకో పదిమందికి ఏ చదువైనా చెప్పించే స్థాయికి..

అమ్మ నేను మార్కులు తక్కువ తెచ్చుకున్నపుడల్లా,పేరెంట్స్ స్పెషల్ క్లాస్ లో చాకలెట్స్ పంచేది..అమ్మ ఆలోచన ఏంటో నాకు ఇప్పటికీ తెలీదు.ఫ్రెండ్స్ కొంతమంది నవ్వేవారు,మీ అమ్మగారు గ్రేట్ రా అని కొంతమంది..గౌతమ్ మాత్రం నువ్వు అదృష్టవంతుడివి అనేవాడు..ఆ క్లాస్ నుంచి అమ్మ నాకూ దేవత అయిపోయింది..ఇంతా చేసి అమ్మ ఒకటో ర్యాంక్ గురించి ఎప్పుడూ చెప్పేది కాదు..మినిమం మినిమం...అంటూ ముప్పైఐదు నుంచి ఎనభై పెర్చెంట్ కి తెచ్చింది..ఇంక చాలు అనేది..ఆమె పిచ్చి ఏమిటో!?అనుకున్నాను..

వందకు వంద మన బ్రతుకే లేదురా అంకిత్!మార్కులు ఎందుకు!?ఒక తాటికి వచ్చి ఇంక పదిమందికి సాయపడే పని పెట్టుకోవాలి.మీ నాన్నని చూసి నేర్చుకో!అనేది..


చుట్టాలు పీనాసి,ఇంత ఉంది కారన్నా కొనడు అని గేలి చేసినా,నాన్న కొమ్మచాటు సేదతీరిన అక్షరసేధ్యులు కొంతమందే అయినా,మా ఇంటి ప్రతి పండుగలో వారి హాజరీ ఉంటుంది..మా ఇంటిని చూస్తే కల అని కొందరు,

ఎలా ఇలా అని కొందరు ఆశ్చర్యపోతూ ఉంటారు..మాకు మాత్రమే తెలుసు అమ్మ సరైనమాట అంటే,నాన్న దానికి సరే అంటే ..ఆ కుటుంబం కొలువుండేది ఓ కోవెల..అదో భిన్నమైన కల..దాని చేరాలంటే కొంచెం ఆగి మసులుకోవాల..



Rate this content
Log in

Similar telugu story from Abstract