Srinivasa Bharathi

Comedy

4  

Srinivasa Bharathi

Comedy

సెల్ భాగోతం...9::శ్రీనివాస భార

సెల్ భాగోతం...9::శ్రీనివాస భార

2 mins
454


నాగరాజు ఆప్టికల్స్ బోర్డు కొన్ని అక్షరాలు మెరుస్తూ మరికొన్ని పేలవంగా సంవత్సరాలుగా పెయింటింగ్కు నోచుకొనట్టు.

మెల్లగా లోపలికి వెళ్లాడు ఆనందరావు.ఓనర్ లేడు. పనివాడు చక్రధర్ విషయం అంతా విని అయ్యో అన్నాడంతే..

ఆ పదంలో శతకోటి భావాలను వెదుక్కోగలిగాడు ..ఆడగాలో వద్దో అనుకొంటూ.".కళ్ళద్దాలు కొంచెం విరిగిపోతే ఫ్రెమ్ మార్పిం

చేందుకు వచ్చి అనుకోకుండా

నా సెల్ ఫోన్ ఇక్కడ మర్చిపోయినట్టు గుర్తు"..మెల్లగా అంటూ...

అంతవరకు కథలా వింటున్న చక్రధర్ తన కళ్ళను చక్రాల్లా తిప్పుతూ ..టేబుల్ సొరుగు లాగి చూసి "ఇక్కడ లేవండి" అన్నాడు.

"అదికాదు..ఓ ప్రక్క చిన్నగా విరిగిపోతే తెచ్చాను..వెళ్ళేటప్పుడు ఇక్కడే సెల్ మర్చిపోయినట్టు గుర్తు..".

"మర్చిపోవడం గుర్తేమిటండి."... నవ్వాడు.

"అదో ఉతపదం..లే ఇంతకీ నాగరాజు లేడా?"

"వాళ్ళ అమ్మాయిని రైలెక్కించి వస్తానన్నారు."

"ఎన్ని గంటలకు?"

"పది నిముషాలు ముందే వెళ్లారు.. రావడానికి రాత్రి 7 దాటొచ్చు."

"ఫోనుందా?"

"మీరే చెయ్యండి"

"ఫోన్ పోయిందనే కదా ఈ బాధంతా?"

"సారీ. చేస్తానుండండి "

ఫోన్ రింగ్ అయింది.అట్నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు.

కాస్సేపు ప్రయత్నించి విసుగెత్తి ..."వాడొస్తే నా నెంబర్ చెప్పు "అంటూ భార్య నెంబర్ ఇచ్చి వెళ్ళాడు నీరసంగా కాళ్ళీడ్చుకొంటూ..

కొంచెం దూరంలో దేవాలయం కన్పించింది.. కాస్సేపు కూర్చొని వెళ్దాం అనుకున్నాడు...భక్తి సంగీతం విన్పిస్తుండడంతో..

అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం సదా ...అంటే నమ్మిన దైవం కరుణిస్తాడు.. "స్వామీ నా సెల్ దొరికేలా చూడు..ముఖ్యమైన ఫోన్ నంబర్స్ ఉన్నాయి..కనీసం సిమ్ అయినా కొంత నయం...నీదయా ...నా అదృష్టం" అనుకున్నాడు దైవాన్ని చూస్తూ... కాస్సేపు ఆ నెపాన్నయినా ఆధ్యాత్మిక భావాల లోకంలో సంతృప్తి పొందగలిగాడు.

మళ్ళీ అడుగులు బైటకి...అరగంట పోయాక

ఆటో ఇంతకు ముందు ఎక్కిందే దొరికింది. .ఆనందరావు వైపు జాలిగా చూసింది..తనలాగే తిరుగుతూ ఉండడం వల్ల.

ఎలాగైతేనేం ఇల్లు చేరాడు...అలసిపోయిన మొహం తో రావడం వల్ల పిల్లలు తల్లితో సైగల భాష మాట్లాడుతున్నారు. ఆవిడ మాత్రం మూగదాన్ని కానని

అరుస్తూ తిడుతోంది..పిల్లి కుక్క మీద పెట్టి...

పడుకున్నాడు ఆనందరావు...సూర్యుడికి బాధేసి మబ్బుల చాటున కన్నీరు కార్చి అట్నుండి అటే పడమరకు జారుకున్నాడు.

కలత నిద్ర ...నిండా సెల్ కలలే..ఒక్కోసారి ఒక్కోచోట వదిలేసినట్టు...

"పోతే పోయింది అనుకోవాలనుకున్నా నంబర్లు చాలా గుర్తులేవు. రోజు వందమంది గుడ్ మార్నింగ్ లు సిమ్ ను పారేసేలా చేసాయేమో...".

మెలకువొచ్చింది రాత్రి 8 గంటలకి...

మొహం కడుక్కొని భోంచేసి వార్తలు వింటున్నాడు.

మెల్లగా 10 కి చేరింది టైం. అలారం మోగి నిద్ర సన్నాహాలకు ప్రయత్నాలు చేస్తున్నారు..వాచీ ని పడుకొమ్మంటూ..

డిమ్ లైట్ వెలుగులు కళ్ళను పలుకరిస్తుంటే సీలింగ్ వైపు చూస్తున్నాడు నిర్వేదంగా...

ఫ్యాన్ గాలి మెల్లగా శరీరాన్ని తాకుతోంది...తన నోరు నొక్కేస్తారన్న భయంతో....

ఆఖరు 10 వ భాగంలో....


Rate this content
Log in

Similar telugu story from Comedy