Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

ఉద్యోగం - అర్హత

ఉద్యోగం - అర్హత

1 min
192


నమస్తే సార్. ఆదివారం కూడా వస్తాను సార్. లేట్ అయినా ఉంటాను సార్. లీవు అస్సలు అడగను సార్. కొంచెం హెల్ప్ చెయ్యండి సార్. ప్లీజ్ సార్. 


ఏమైందిరా? ఏంటి కలవరిస్తున్నావు? అని రూమ్మేట్ అడిగాడు. 


ఏం కలవరించాను? అని అడిగాను నేను.

ఏదో జాబ్ గురించి అన్నాడు వాడు. ప్రాధేయపడడం మాత్రమే నాకున్న అర్హతరా. పగలంతా అన్న మాటలే గుర్తుకు వచ్చుంటాయి అని నీళ్ళు తాగి ముసుగు కప్పుకొని పడుకున్నాను.


కొన్నాళ్ళు విపరీతంగా ప్రయత్నాలు చేశాక నాకు ఓ మోస్తరు ఉద్యోగం వచ్చింది.


ఆ రోజు స్వీటు ప్యాకెట్ పట్టుకుని రూం కి వెళ్ళాను.


జాబ్ వచ్చిందిరా అని తెచ్చిన స్వీటు ప్యాకెట్ విప్పాను. ఎలా వచ్చిందిరా అని అడిగాడు రూమ్మేట్. 


నేను ప్రాధేయపడ్డం భరించలేక మా సారు జాబిచ్చాడురా. అబ్బో అప్పుడే మీ సార్ అయ్యాడా. ఎంత గౌరవం.

బాగుందిరా. ఎలా ప్రాధేయపడ్డావ్ అని అడిగాడు వాడు.


స్వాతి ముత్యం చూశావా. అందులో కమల హాసన్ ఉద్యోగం కోసం సోమయాజులు గారి వెంట పడి ఎట్టకేలకు ఆయన్ను ప్రసన్నం చేసుకుంటాడే. అలా సంపాదించాను అని జాంగ్రీ ముక్క నోట్లో వేసుకున్నాను.


మరి నీకు సిగ్గు రాలేదూ. ఇంత చదువు చదివీ.. టాలెంట్ తో సంపాదించుకోకుండా ఇలా వాళ్ళ కాళ్ళూ గెడ్డాలు పట్టుకుని... అని ఏదో అనబోయాడు.


ఆపెయ్. ఇక నీ క్లాసు మొదలు పెట్టకు అని వాడి నోట్లో ఓ స్వీటు కుక్కాను.


అసలు టాలెంట్ ఉన్న వాడికే జాబ్ వస్తుందా. అసలు జాబ్ తెచ్చుకోవడమే టాలెంటా. లేక ఇవి రెండూ సమాంతర రేఖల్లాంటివా? ఏమో నోట్లో వేసుకున్న స్వీటు తియ్యగా అనిపించింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract