STORYMIRROR

Dinakar Reddy

Children Stories Comedy Children

4  

Dinakar Reddy

Children Stories Comedy Children

హారి పిడుగా

హారి పిడుగా

1 min
198

మన బుడుగును ఈ మధ్యే ఇస్కూల్లో వేశారు. మరి బుడుగు అల్లరి మానేశాడా!

బాబాయ్! తెలుసా ఇవేళ మా క్లాసుకు రెండు జళ్ళ సీత వచ్చింది అని స్కూల్ బ్యాగు సోఫా మీద వేస్తూ అన్నాడు బుడుగు.

బుడుగు వాళ్ళ బామ్మ రేడియో వింటూ దీపాలకు వత్తులు చేస్తూ ఉంది.


ఏమిట్రా! ఎవరా సీత అని బామ్మ బుడుగును దగ్గరికి రమ్మంది.

బుడుగు వాళ్ళ బాబాయ్ మెట్ల మీద నుండి పరుగెత్తుకుంటూ వస్తున్నాడు.


అదే బామ్మ. మా స్కూల్లో చాలా మంది రెండు జళ్ల సీతలు ఉన్నారు. అందులో ఒక రెండు జళ్ల సీత ఇవాళ మా క్లాసుకు వచ్చింది.

బుడుగు వాళ్ళ బాబాయ్ ఏదో ఒకటి చేసి బుడుగుని మాట్లాడనివ్వకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. బామ్మ వెనుక నిలబడి సైగలు చేస్తున్నాడు.


కానీ బుడుగు వింటేగా. బాబాయ్ దగ్గర చాలా లౌలెట్రులు ఉన్నాయి కదా. అందులో ఒకటి రెండు జళ్ల సీతకు ఇచ్చా.

ఇదిగో నా బుగ్గ మీద ముద్దు కూడా పెట్టింది అంటూ లిప్స్టిక్ మార్కు చూపించాడు బుడుగు.


బామ్మ కోపం నషాళానికి అంటింది. చెబుతానుండు మీ బాబాయ్ పని అంటూ లేచింది.

బాబాయ్ వెనక్కి తిరిగి చూడకుండా మేడ మీదకు పరుగెత్తాడు.

బుడుగు నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళాడు.


Rate this content
Log in