Srinivasa Bharathi

Romance

4.2  

Srinivasa Bharathi

Romance

బుక్ చేసిన బుక్...శ్రీనివాస భా

బుక్ చేసిన బుక్...శ్రీనివాస భా

3 mins
662


"నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం, నీ మాట కోసం ఎన్నేళ్లయినా ఇక్కడే వేచి ఉంటాను. నీ నుండి జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ...త్వరలో  వస్తావు కదూ. . నా నెంబరు.." ఆ ఉత్తరం అప్పటికి పదిహేను సార్లు చదివాడు....కృష్ణకాంత్.

ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం జాయిన్ అయ్యి

రెండు నెలలయింది.

సరదాగా లైబ్రరీ కి వచ్చాడు..మెంబర్షిప్ ఇచ్చిన ఉత్సాహంలో.

కార్డ్ ఇచ్చి రాక్ లోంచి నచ్చిన పుస్తకం కళ్ళుమూసుకుని

ఎంచాడు. కౌంటర్లో ఎంట్రీ వేయించి ఆ లావుపాటి పుస్తకాన్ని గుండెలకు హత్తుకున్నాడు.

లైబ్రరీ రోడ్ నుండి హాస్టల్ రూమ్ లోకి వచ్చాడు.

రూమ్ లో ఫ్రెండ్షిప్ మెల్లగా పెరుగుతోంది.

అప్పుడప్పుడూ సీనియర్లు రాగింగ్ అంటూ ఏవేవో పిచ్చి చేష్టలు చేస్తుంటారు...పెరవేర్టెడ్ సైకాలజీ అనికూడా కొందరు వెక్కిరిస్తారు...అయినా తప్పదుఈజాడ్యం.

కాలేజ్ లో చేరిన మొదటి రోజులు గుర్తొచ్చాయి అతడికి.

తనలాగే శేషగిరి, శేఖర్ రాగింగ్ బాచ్ చేతిలో పడ్డారు.

"ఒరేయ్ నువ్వు చొక్కా విప్పరా.." వేలు చూపించి వెక్కిరించాడు మదన్.

"వాడి వీపుమీద పది గుద్దులు గుద్దరా" పవన్ కేకేసాడు.

కృష్ణకాంత్ అలా చేసినంతవరకు వదల్లేదు వాళ్ళు.

"ఒరేయ్ నీపేరు? "శేఖర్ని అడిగాడు గోవర్ధన్.

పేరు చెప్పాడు శేఖర్.

"వాడి మీదెక్కి కూర్చో. రెండు రౌండ్స్ కొట్టండి."

శేఖర్ కృష్ణకాంత్ మీదెక్కి కూర్చున్నాడు.

"రాత్రికి మళ్ళీ వస్తాం. ఈ విషయం ఎవరికైనా చెప్పారో" అంటూ హెచ్చరించి వెళ్లిపోయారు.

అక్కడ మొదలైన స్నేహంమరో ఇద్దరిని కలుపుకొని రూమ్మేట్స్ చేసింది.

ప్రస్తుతానికొస్తే..కృష్ణకాంత్ మనసు మనసులో లేదు.

"ఎవరా అమ్మాయి. ఎవరి కోసం రాసింది. తాను రావడానికి ముందొక అమ్మాయి ఆ పుస్తకం తీసి ఏదో చూసి, తాను అటువైపు చూడగానే ఆ పుస్తకం పెట్టేసింది. తనకోసం రాసిందా.. వేరే ఎవరి కోసమైనా..

పరాగ్గా చూసాడు తాను. అందమైన అమ్మాయే. కానీ

మొహం అంతగా గుర్తులేదు. మెరుపులా అంతర్ధానమైంది. మొత్తానికి చూడాలన్పించే ముఖం.అంతవరకు కరక్టే....కానీ ఆ అమ్మాయినెలా పట్టుకోవడం."

ఊహాలు రూమ్ చేరుకున్నంతవరకు జోరీగల్లా వెంటపడ్డాయి.

ఇదే ఆలోచన. పరధ్యానం పెరిగింది.

వయసు ప్రేమని గుర్తుచేస్తే, కళ్ళు అమ్మాయిని వెదకడం మొదలెట్టాయి.గత పదిహేను రోజుల నుండి కాస్త తీరిక దొరకడమే ఆలస్యం..కళ్ళు అమ్మాయిల చుట్టూ బొంగరంలా.

లైబ్రేరియన్ బోర్డ్ చూపించాడు...ఫైన్ చెల్లించాలి గడువు దాటితే అని.

సరే. అంటూ వెనక్కి వచ్చి రూమ్ లోని బుక్ ఇచ్చేద్దా మనుకున్నాడు సాయంకాలం.

కాస్త కడుపులో వేసుకున్నాక మంచం పై విశ్రాంతి తీసుకున్నాడు.ఆలోచనలు ఆప్తుల్లా వదలడం లేదు.ఎలాగైనా సరే. ఆ అమ్మాయిని పట్టుకొని తీరవలసిందే..అంటూ ఒక దృఢనిశ్చయానికి వచ్చాడు.

"బుక్ ఇచ్చేసి, ఆ లెటర్ ద్వారా ఎంక్వయిరి చేస్తే...

నెంబర్ తెలియదు. బుక్ తో పాటు లెటర్ కూడా ఉంటే అది చూసి నెంబర్ రాయొచ్చుగా.

కాబట్టి బుక్ విత్ లెటర్ తప్పని సరి.

ఆ బుక్ మరెవరో కావాలని తీసుకెళ్ళి తనలాగే.... మళ్ళీ ఈ బుక్ తియ్యకుండా ఉండే మార్గం..."

ఆలోచనలు...ఆగకుండా...

"ఏం చేస్తే బుక్ ఎవరూ తీసుకెళ్లరు...?"

ఎంత ఆలోచించినా మార్గం కన్పించలేదు.

దాదాపు పదిగంటలు.

చిత్రం ఇప్పుడా అమ్మాయి స్థానాన్ని పుస్తకం ఆక్రమించింది.

వేకువఝామున వచ్చిన ఒక ఆలోచన అతడికి నిశ్చింత కల్గించింది.అలాచేద్దాం.అదొక్కటేమార్గంఅనుకున్నాడు.అప్పుడు పట్టింది అతడికి ప్రశాంతంగా నిద్ర.

మర్నాడు పుస్తకం రాక్ లో యధాస్థానంలో.

రోజూ లైబ్రరీకి హాజరు. మూడుపూటలా ఆ పుస్తకం , లెటర్ చూడడం ...నిత్యకృత్యం అయ్యాయి కృష్ణకాంత్ కు.

మరో నెల గడిచింది.

పుస్తకం చోటు మారలేదు.లోపలి కాగితం పేజీ లో నంబర్ నిండ లేదు.అస్సలా అమ్మాయి కన్పించనే లేదు.

మొదటి సంవత్సరం పూర్తయింది...అన్వేషణ ఇంకా కొనసాగుతున్నా.

రాను రానూ ఆలోచనలు ఆరోగ్యం మీద రిజల్ట్స్ చూపించి, స్నేహితులు పదేపదే నిలదీసాక జరిగిన విషయం చెప్పక తప్పలేదు కృష్ణకాంత్ కు.

విన్నాక వాళ్లంతా బిగ్గరగా నవ్వగానే కోపం వచ్చింది అతడికి.

ఇప్పుడా సమస్య ఆ రూమ్ లోని ఐదుగురిదీ.

"ఎవరా అమ్మాయి?" శేషగిరి అడిగాడు

"లేడీస్ హాస్టల్లో ఉందా? డే స్కాలరా?"శేఖర్ ప్రశ్న

"బుక్ ఫస్ట్ ఇయర్ ది. తన కోసం తీసుకెళ్లిందా?ఎవరైనా ఫ్రెండ్ కోసమా?" మరో ఫ్రెండ్

"అసలా అమ్మాయి ఆ బుక్కే తీసిందా మనవాడేమైన పొరబడ్డాడా?"ఇంకో ఫ్రెండ్ అనుమానం.

"లేదా వేరే పరీక్ష కోసం తీసి ఇక దాని మొహం చూడలేదా?"శేషగిరి ప్రశ్న.

"నంబర్ రాయబోయే టైమ్ లో మనవాడు చూసాడు..

ముందు రాత అసలు అమ్మాయి దేనా?"శేఖర్ అన్నాడు.

"కాలేజ్ స్టూడెంట్ ఐతే ఇన్నాళ్లలో మళ్ళీ కంటపడలేదేందుకని?"మరొకడు అన్నాడు.

"ఆ లెటర్ ఎవరికోసం ఎవరు రాసారు?" అన్నాడింకో ఫ్రెండ్.

ఇన్నాళ్లకు వాళ్లకు లైబ్రరీలోని నిశ్శబ్దం మీద పట్టలేనంత

కోపం వచ్చింది.

ఎక్కడా లేని రూల్ ఇక్కడ మాత్రమే ఉండడం వల్ల ఆ రోజుతో తేలిపోవలసిన సమస్య సంవత్సరం సాగింది.

వాళ్ళు కూడా శతవిధాలా ప్రయత్నించారు. అయిన ఫలితం దక్కలేదు.

మెంబర్షిప్ నెంబర్ బట్టి వెదుకుదాం అన్నాడు

మొదటి పేజీలో అంటించిన సమాచారం బట్టి మళ్ళీ అన్వేషణ.

నెలంతా అందరూ తిరిగి రోజుల్ని ఐదుగురూ పంచుకొంటే..

అదీ ఫలితం ఇవ్వలేదు.

మళ్లీ ప్రయత్నాలు మొదలు.

ఆ బుక్ మరెవరూ ఎంచుకోకుండా తనేం కిటుకు చేసాడో చెప్పాడు వాళ్ళకి.

"అందుకేనన్నమాట. ఆ పుస్తకo ఎవరూ తీయంది?" అన్నాడు శేఖర్ ఆలోచనగా

"ఆ అమ్మాయి కూడా ఇదే కారణం తో తియ్యక పోయుండొచ్చుగా?" శేషగిరి ప్రశ్న.

"అవును. అలాకూడా"ఒకొక్కడు ఒక్కో అనుమానం

"మన కాలేజ్ లో ఎన్ని ప్రేమకథలున్నాయ్?"వాళ్ళ వివరాలు మన కెలా తెలుస్తాయ్?" అన్నాడు కృష్ణకాంత్.

"సీనియర్లు ఈ విషయంలో సాయం చెయ్యరా. అదీగాక

ఇప్పుడు మనమూ సీనియర్లమే కదా ." శేఖర్ అన్నాడు.

రెండో సంవత్సరం కూడా ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే కరిగిపోయింది నెమ్మదిగా.

మెల్లగా మూడో సంవత్సరం చాపకింద నీరులా సర్దుకుంటోంది.

ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు..ఎంతవరకు ప్రయత్నాలు వచ్చాయని.

నలుగురు నిరాశ మొహాలతో కన్పించారు కృష్ణకాంత్ కు.

మూడుకూడా మంచులా వేళ్ళ సందులనుండి కారిపోయింది చూస్తుండగానే.

సంబోధనే లేని ఉత్తరం, ఎవరు రాసారో, ఎందుకు రాశారో ..తెలియని ఉత్తరం గురించి ఇంకా తల పట్టుకోవడం అనవసరం అనిపించింది.

ఈ మూడేళ్ల లో ఆ పుస్తకం మరెవరూ చదవలేదు...ఒకవేళ చూడాలనుకుంటే ఆ అమ్మాయి తప్ప.

ఆ అమ్మాయే చదువుంటే ఫోన్ నెంబర్ రాసివుండేది.

అంటే.. ఆ అమ్మాయి రాలేదు. వస్తే ఆ బుక్ తీసి ఉండేది.

నాలుగో సంవత్సరం నవ్వుతూ వాళ్ళని కౌగలించుకొంది.ఐనా అమ్మాయి జాడ తెలియలేదు.

చివరకు వాళ్లంతా (ఇళ్లకు వెళ్లిపోయేరోజు)విడిపోయే రోజొచ్చింది.

స్టేజి మీద ఒక ప్రోగ్రాం చెయ్యడానికి వచ్చిందో అమ్మాయి.

మెలిముసుగు తొలగగానే కృష్ణకాంత్ గుర్తుపట్టాడా అమ్మాయిని.

ప్రోగ్రాం అయ్యాక కలిసాడు. ..తనకోసం ఇంతకాలం తానూ తన ఫ్రెండ్స్ ఎంతగా వెదికిందీ చెప్తూ...ఆతృత, ప్రేమ, అభిమానం,ఎన్నెన్నో భావాలు మొహంలో కదలడుతుండగా.

కిరణ్ వచ్చాడు వాళ్ళ మాటల మధ్యలో.

అప్పుడే తెల్సింది .తాను మాట్లాడుతున్న అమ్మాయి స్నేహాలత  భర్త అతడే అనీ.

లైబ్రరీలో పుస్తకాలు చదివే అలవాటు లేని వాళ్లకు

ప్రతి రాక్ లో ఇలాంటి లెటర్ ఒకటి పెడితే...  ఓ చిలిపి ఊహా......అని నవ్వేసింది ఆమె...

ఇలా తనకోసం వెదికే వాళ్లు ఉంటారనుకోలేదామె.

అసలు విషయం...ఆమె లైబ్రేరియన్ కూతురు...

ఇది ఎవరికి తెలీదు...మీరూ ఎవరికీ చెప్పకండేం.

-------------###############----------


Rate this content
Log in

Similar telugu story from Romance