నందినీ ఏమైంది?? part 1
నందినీ ఏమైంది?? part 1
నందిని.. ట్రైన్ దిగి.. హాస్టల్ కి వెళ్ళిపోయి ఉంటుంది.. ఇంకా ఫోను చేయలేదేంటి అని ఆలోచిస్తున్నారు.. రమణారావు గారు.. నందిని తండ్రి.. ఇంతలో తల్లి సుప్రజ ఏమండీ.. ఫోన్ వచ్చింది అనగానే కూతురు ఏమో అని వెంటనే ఫోను ఎత్తాడు.. అది వేరే వాళ్ళు..
నందిని.. బెంగుళూరులో ఉద్యోగం చేస్తుంది..సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం.. సంక్రాంతి పండగకి.. అమ్మా నాన్నతో సరదాగా గడిపి తిరిగి.. ట్రైన్ ఎక్కింది..
అమ్మా నాన్న ఉండేది..విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరు..
రమణారావు విజయవాడ వరకు వచ్చి ట్రైన్ ఎక్కించాడు.. రిజర్వేషన్ భోగీనే.. కానీ..అది స్లీపర్ బెర్త్ దొరికింది.. చలికాలమే కదా అని పర్లేదు అనుకుంది..
బెంగళూరులో తనకి కారు ఉంది.. కానీ రమణారావు ఎప్పుడూ వచ్చినా ట్రైన్ కి కానీ ఫ్లైట్ కు కానీ రమంటాడు... అప్పుడప్పుడు ఫ్లైట్లో కూడా వస్తుంది కానీ ఆరోజు అది కూడా కుదరక ముందుగానే ఎందుకైనా మంచిది అని ట్రైన్ కి రిజర్వేషన్ చేయించింది అందుకే... ట్రైన్ లో వెళ్ళింది..
ట్రైన్ లో ఉండగానే.. ఫోన్ ఛార్జింగ్ అయిపోవచ్చింది.. నేను హాస్టల్ కి వెళ్ళాక చేస్తా అంది..
తను వర్కింగ్ విమెన్ హాస్టల్లో.. ఉంటుంది..
ట్రైన్ రాత్రి 8గంటలకు దిగితే..9గంటలకల్లా.. హాస్టల్ కి వెళ్తుంది..కనీసం పది గంటలకైనా చేయాలి కదా ఎందుకు చేయలేదు అని చూస్తున్నారు... ఇంటిదగ్గర..
ట్రైన్ స్టేటస్ చూసారు రీచ్ అయ్యిందని 8:30నిమిషాలకే.. అని చూపిస్తుంది..
టైమ్ అయ్యేకొలది టెన్షన్ పెరుగుతుంది.. ఇక ఉండలేక హాస్టల్ కి కాల్ చేశారు..ఇంకా రాలేదు అండి.. అయినా హాస్టల్ టైం అయిపోయిందండి.. పది దాటితే ఉండదు కదా.. అన్నారు..
అవునా లేట్ అయ్యిందని వేరే ఫ్రెండ్ దగ్గరికి గాని వెళ్ళివుంటుందా అనే డౌటు.. వచ్చింది..
ఉదయం వరకు చూద్దాము అనుకున్నారు..అసలే సుప్రజకి గుండె ధడ ఎక్కువ.. అందుకే.. ఇవేమి చెప్పకుండా.. అమ్మాయి ఫోన్ చేసిందా అని అడిగితే.. నీకు అంతా తొందరే చేస్తుందిలే.. ఫోన్ రింగ్ అవుతుందిలే అని అబద్దం చెప్పాడు.. సరే అలసిపోయి పడుకొని ఉంటుంది.. మీరు కూడా పడుకోండి పొద్దున్నే చేద్దురు అంది..
రమణారావుగారికి.. మనసంతా కకాలవికాలంగా ఉంది.. కూతురు కోసం.. ఎప్పుడూ లేనిది ఏదోలా ఉంది..తండ్రి కూతురు కోసం టెన్షన్ పడేలా ఉంది ప్రస్తుతం మన సమాజం..
ఇలా కాస్త కునుకు పట్టిందో లేదో.. కూతురు కాపాడండి నాన్న అని అరిచినట్లు అనిపించి.. నందూ.. అని అరిచాడు ఒక్కసారిగా.. దానితో.. సుప్రజ తుళ్ళిపడి లేచి ఏమైందండీ అంది.. ఏమిలేదు నువ్వు పడుకో.. అన్న రమణారావు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి..
ఎప్పుడు తెల్లారుతుందా అని ఉంది తనకు.. ఇంతలో విక్రమ్ గుర్తుకొచ్చాడు.. తనకి ఫోన్ చేస్తేనో అనుకున్నాడు..
విక్రమ్ కుమార్.. రమణారావు.. స్నేహితుడి.. కొడుకే.. సి.ఐ గా చేస్తున్నాడు.. తనకే నందిని ఇచ్చి పెళ్ళి చేయాలి అనుకుంటున్నాడు...
తన ఆలోచన రాగానే.. కొంచెం శాంతి కలిగి తనకి.. ఫోన్ చేశాడు అప్పటికే టైం మూడు అవుతుతుంది..
విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఈ టైములో చేశారేంటి అనుకుంటూ.. హలో అంకుల్ చెప్పండి అన్నాడు..
హా బాబు విక్కీ.. నీతో కొంచెం మాట్లాడాలి.. ఈ టైములో చేశాను అనుకోకు.. అన్నాడు..
అంకుల్ పర్లేదు ఏంటో చెప్పండి.. నందూ.. నిన్న బెంగళూరు వెళ్ళింది..ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది.. హాస్టల్ కి కూడా వెళ్ళలేదంట.. అందుకే టెన్షన్ గా ఉంది..
అవునా.. మీకు ఎప్పుడు చేసింది ఆఖరిసారి అన్నాడు లేచి కూర్చొని..
నాకు 7గంటలకు చేసింది.. ఇంకో గంటలో.. ట్రైన్ దిగుతాను.. ఛార్జింగ్ అయిపోతుంది.. హాస్టల్ కు వెళ్ళాక చేస్తా అంది.. తరువాత నుండీ స్విచ్చాఫ్ వస్తుంది.. అన్నారు..
అవునా సరే రేపు ఉదయం ఫోను చేద్దాం.. మీరు కంగారు పడకండి... నేను కూడా కనుకుంటా అన్నాడు..
విక్కీకి కూడా డౌట్ గానే ఉంది... ఏమై..ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు..
ప్రస్తుతం మన సమాజంలో..ప్రస్తుతమనే కాదు.. ఎప్పటినుండో.. అమ్మాయి కనిపించకపోతే ఏమైందో అనే టెన్షన్ పడాలిసిన స్థితిలో ఉన్నాము.. ఇంతకీ నందిని ఏమైందో తరువాత భాగంలో చూద్దాం..
ఇంకా ఉంది..
ధన్యవాదములు 🙏

