Bharathi A

Drama Fantasy Inspirational

3.5  

Bharathi A

Drama Fantasy Inspirational

ఒంటరి

ఒంటరి

3 mins
427


 బయట వర్షం వస్తుంది.. కొంచెం తడుచుకుంటూ ఇంటికి వెళ్ళే సరికి కొంచెం.. ఆలశ్యమైంది.. ఇంతలో అమ్మ.. ఎదురొచ్చి ఏంటీ నాన్న ఇలా తడిచిపోయావు.. ముందు స్నానం చేసిరా తిందువు అంటుంటే..


       ఇంతలో నాన్న వచ్చి తడిచిన వాడికి టవల్ ఇవ్వకుండా ఏంటా మాటలు అని అంటుంటే ఇదిగోరా టవల్ తుడుచుకోఅని చెల్లి అంటుంటే.. నాయనమ్మ.. ఏమో.. ఏరా నాన్న తడిచిపోయావా.. పక్కన ఎక్కడైనా ఆగలేకపోయావా అంటూ బయటకు వస్తుంటే..


         ఆ వెనకాలే తాతయ్య వచ్చి.. ముందు నువ్వు.. మాటలు ఆపు వాడు నా మనవడు..తడిచినా ఏమి అవదు అంటూ ఉంటే.. అవును తాతయ్య మంచి సమయానికి వచ్చావు.. అని చెల్లి నెత్తిమీద మొట్టికాయ మొట్టి.. ఫ్రెష్ అయ్యి వచ్చాక..


    అమ్మ... రా నాన్న నీకోసం.. నీకు నచ్చిన కర్రీ చేశాను అంటుంటే.. తాతయ్య.. నాకు అదే ఇష్టమమ్మ అంటుంటే.. మీకు అన్నీ ఇష్టమేగా.. అని నాయనమ్మ అంటుంటే..అమ్మా మరి నాకో అని చెల్లి బుంగమూతి పెట్టుకుంటే.. ముందు వాడిని తిన నివ్వండి.. మీరు.. తినేటప్పుడు మాట్లాడకండి అంటున్న నాన్న..


     తింటున్న నాకు పొలమారుతుంటే.. అందరూ ఒకేసారి నా తల మీద తడుతూ.. మంచినీళ్ళు పడుతుంటే..


     అయినా నాకు ఎందుకో పొలమారుతునే వుంది.. ఇక చేసేది ఏమి లేక లేచి మంచినీళ్ళు తెచ్చుకున్నా..


    అదేంటి అనుకుంటున్నారా.. నేను చెప్పినట్లు.. నాకు చేయడానికి.. నా కోసం ఆలోచించడానికి.. నాకంటూ ఎవరూ లేని ఒంటరి నేను..


    నేను ఒక అనాథను.. ప్రతిరోజు ఇంటికి వచ్చాక ఇలాగే ఒక కుటుంబం ఉన్నట్లు... ఊహించుకుంటాను..


    నిజంగా కుటుంబం ఉన్న మీరంతా ఎంతో అదృష్టవంతులు..తిట్టడానికైనా.. పెట్టడానికైనా.. తల్లీతండ్రీ ఉండాలి..


      తిన్నావా.. ఉన్నావా.. అని అడిగే నా అన్న మనిషి ఉన్నవాడే..ఈ లోకంలో అందరికన్నా ధనవంతుడు..


       దేని విలువ అయినా అది లేనివాడికే తెలుస్తుంది..ఎవరైనా తల్లితండ్రిని వదిలేశారు.. ఇలాంటివి చూసినప్పుడు.. తెలిసినప్పుడు.. చాలా బాధవేస్తుంది.. అసలు ఇలా ఎలా.. చేయగలరా అని..


      నాకు 3సంవత్సరాల వయసప్పుడు ఎవరో నన్ను.. తీసుకొచ్చి అనాధ శరణాలయం దగ్గర వదిలేశారంట .. మాకు అక్కడ ఒక మదర్ ఉండేవారు.. ఆవిడే అందరినీ తన పిల్లలులాగే చూసుకునేది.. నేను అక్కడికి వచ్చేసరికి నా మెడలో బంగారు గొలుసు కూడా ఉండేదంట.. అందుకే నేను.. గొప్పోళ్ళ అబ్బాయినే అనేవారు మదర్.. నా పేరు రాజాబాబు అని పెట్టారు.. నా గొలుసును మాత్రం నాకే ఇచ్చారు దాచి నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక..


      అందులో చదువుకొని ఉద్యోగాలు వచ్చినవాళ్ళు మళ్ళీ శరణాలయానికి వచ్చి డబ్బులు ఇస్తూ ఉండేవారు.. నేను కూడా చదువుకొని... ఉద్యోగం రావడంతో.. సిటీకి రావాల్సి వచ్చింది..


    ఇక్కడ స్నేహితులు కూడా లేరు నాకు.. ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకున్నా లోన్ మీద.. చాలా మంచి ఉద్యోగం.. జీతం కూడా.. ఎన్ని వున్నా చెప్పానుగా నా అన్న మనిషి లేని జీవితం వ్యర్థం అని..


    ఒకసారి పండుగకు.. ఆ శరణాలయానికి వెళ్ళాను.. నేను కూడా నెల నెలా డబ్బులు పంపుతుంటా.. ఆరోజు పిల్లందరికి.. మంచి గిఫ్ట్ లు పట్టుకెళ్ళా.. మదర్.. ఎంతో ప్రేమగా మాట్లాడుతూ.. రాజా.. నీ చిన్నప్పటి ఫోటో దొరికింది అని ఇచ్చారు.. అందులో ఒక 12మంది పిల్లలు వున్నాము నన్ను నేనే గుర్తుపట్టేలా లేదు.. అయినా ఎంతో సంతోషం వేసింది ఆ ఫోటో చూసి...


    అక్కడినుండి వచ్చేసాక.. ఎవరో ఫేస్బుక్ లో ఫోటో పెట్టడం వలన వాళ్ళ కుటుంబ సభ్యులను కలిశాడు అంటే.. నేను కూడా నా చిన్నప్పటి ఫోటోని మోడీఫై చేసి.. కట్ చేసి.. ఫేస్బుక్ లో పెట్టాను.. అందరినీ షేర్ చేయమని రిక్వెస్ట్ పెట్టాను.. తెలుసుకదా ఫేస్బుక్ షేర్ షేర్ చేయమనాలేగాని..తెలిసినా తెలియకపోయినా.. షేర్ చేస్తారని.. అలా చేస్తూనేవున్నారు..


       ఎన్ని షేర్లు చేసినా.. ఓదార్పు మెసేజిలు వస్తున్నా.. మాత్రం నావాళ్ళు ఎవరో తెలియలేదు..


     ఇక నేను కూడా ఆశ వదిలేసుకున్నాను .. కానీ ఒక రోజు మెసెంజర్ కాల్ వస్తుంది.. ఎవరో అమ్మాయి చేస్తుంది.. ఎవరా అనుకుంటూ.. లిఫ్ట్ చేశాను .. హలో అన్నాను.. కానీ అవతలి నుండి ఏమి సమాధానం లేదు.. మళ్ళీ హలో ఎవరు ఉన్నారా.. అన్నాను ..


     అన్న.. అన్నా అని అరుస్తూ.. ఏడుస్తుంది ఆ అమ్మాయి..


    ఎవరూ మీరు అన్నాను ఆనందం తొళుకుతున్న 

గొంతుతో..


   ఇంతలో ఒకామే.. నాన్న..కన్నా.. నా కన్నా.. దీపు... బంగారు.. అంటూ ఏడుస్తుంది..


  నాకు అర్ధమవుతుంది వాళ్ళు ఎవరో.. కానీ నమ్మలేకపోతున్నాను .. తిరిగి మాట్లాడలేకపోతున్నాను.. మాటలు గొంతు దాటడం లేదు..


     నాన్న మాట్లాడరా.. నేను మీ నాన్నను అన్నాడు.. ఒకాయన.. ఆయన గొంతు కూడా బొంగురు పోయినట్లే వస్తుంది..


    ఇక నేను ఏడుస్తూ.. కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాను వాళ్ళకి..


   అక్కడ.. నాకు.. అమ్మ.. నాన్న..చెల్లి.. తాతయ్య.. నాయనమ్మ.. అందరూ వున్నారు.. అందరూ.. మాట్లాడలేక.. ఏడుస్తున్నారు.. నాకు.. కూడా దుఃఖం పొంగుకొస్తుంది.. ఇది కలా నిజమా అని అనుకుంటున్నాను .. కల మాత్రం కాకూడదు దేవుడా.. అని.. అరిచాను... ఒక్కసారిగా..


   తరువాత అందరూ ఒకరినొకరు.. పరిచయం చేసుకొని.. నా పేరు.. దిలీప్ రాజా.. అని చెప్పారు..నేను చిన్నప్పుడు తప్పి పోయాను అని ఎంత వెతికినా దొరకలేదని చెప్పారు.. ఏంటో దేవుడు.. మనుషులని మాత్రమే దూరం చేశాడు.. మా బంధాలు బాంధవ్యాలను కాదు..


    నేను ఎంతో సంతోషంగా నా తల్లితండ్రులను.. చెల్లిని.. నాయనమ్మని.. తాతయ్యను.. కలవడానికి వెళ్తున్నాను .. నా ఊహలు నిజం కాబోతున్నాయి..

 

           ధన్యవాదములు 🙏

    



Rate this content
Log in

Similar telugu story from Drama