STORYMIRROR

Bharathi A

Drama Fantasy Thriller

4  

Bharathi A

Drama Fantasy Thriller

నందినీ ఏమైంది?? part 2

నందినీ ఏమైంది?? part 2

3 mins
352

నందిని గురించి ఆలోచిస్తున్న విక్కీకి నిద్ర పట్టడంలేదు.. తనకి కూడా నందూ అంటే ఇష్టం.. ఆమె వ్యక్తిత్వం.. చిన్న వయసులో సాధించిన విజయాలు.. తన దైర్యం.. చివరికి తన అందం.. అన్నీ తనను ఇష్టపడేలా చేశాయి..


రమణరావు గారు తన తండ్రి రఘు.. తమ పెళ్ళి గురించి అడిగినప్పుడు తనకి ఇష్టమని చెప్పాడు కానీ ఇంకా నందిని అడగలేదు.. వాళ్ళు.. ఉగాదికి అడుగుదాం అనుకొన్నారు.. అప్పటికి తన ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది అని..


ఉదయం అవ్వగానే..రమణారావుకు ఫోన్ చేశాడు..


ఆయన ఫోను లిఫ్ట్ చేసి బాబు నేనే నీకు చేద్దాము అనుకుంటున్నా అన్నారు..


తను వెంటనే ఆత్రంగా అంకుల్ నందూ కాల్ చేసిందా అన్నాడు..


లేదు బాబు అదే కంగారుగా ఉంది.. అందుకే నీకు చేద్దామని అన్నారు..


సరే అంకుల్ నేను మీకు మళ్ళీ కాల్ చేస్తా.. రైల్వేస్టేషన్ పోలీసుకి చేసి సీసీ టీవీ ఫుటేజి అడుగుతా అన్నాడు..


విక్కీ కొంచెం త్వరగా కనుక్కో నాకు కంగారుగా ఉంది.. నేను తన ఫ్రెండ్ కి చేస్తా ఫోను అన్నారు..


ఓకే అంకుల్.. అని ఫోను పెట్టేసి అక్కడి ఎస్.ఐ కి కాల్ చేశాడు.. సీసీ టీవీ ఫుటేజీ.. పంపమని కొంచెం అర్జెంటు అని చెప్పాడు.. ఇద్దరూ ఫ్రెండ్స్.. అందుకే వెంటనే పంపాడు..


అందులో చూశాడు నందూ ఒక్కర్తే బయటకు రావడం కనిపించింది.. ట్రైన్ దిగిన తను ఎక్కడికి వెళ్ళింది ఏమైందీ.. అనుకొని..


ఫ్రెష్ అయ్యి రమణారావు గారిని విజయవాడ రమ్మని కాల్ చేశాడు..


అలాగే రమణారావు ఉదయం 9గంటలకల్లా విజయవాడ వెళ్ళి విక్కీని.. స్టేషన్లో కలిసాడు...


అంకుల్ సీసీ టీవీ ఫుటేజి లో నందూ ట్రైన్ దిగి ఒంటరిగానే వెళ్తున్నట్లు ఉంది.. మీరు ఒకసారి మళ్ళీ హాస్టల్ కి చేయండి.. వాళ్ళ ఫ్రెండ్స్ కి చేస్తే ఏమన్నారు అని అడిగాడు..


వాళ్ళు తెలియదు అంటున్నారు బాబు.. వస్తున్నా ట్రైన్లో ఉన్నాను అని చేసిందంట మెసేజ్...


హాస్టల్ కి చేసాడు మళ్ళీ ఇంకా రాలేదు అనే చెప్పారు..


అది విన్న విక్కీ అంకుల్ నందూ ఇక్కడకి వచ్చినప్పుడు.. ఏదైనా ప్రత్యేకంగా జరిగిందా అని అడిగాడు..


అలా ఏమి జరగలేదు కానీ.. ఒక చిన్న గొడవ జరిగింది బాబు.. అది మనఊరిలో.. కనుమకి జాతర జరుగుతుంది కదా అప్పుడు.. నందూని.. మా అక్కగారి అబ్బాయి మోహన్ .. కొంచెం తప్పుగా మాట్లాడితే నందూ అతని మీద చేయి చేసుకోవడం.. ఇంతలో అక్కడున్న కానిస్టేబుల్ చూడడం వాడిని స్టేషన్ కి తీసుకెళ్ళడం.. దానితో వాడు జీపు ఎక్కుతూ.. నీ అంతు చూస్తా నందూ అన్నాడు..


తరువాత నేను వెళ్ళి వాడికి జామీను.. ఇచ్చి తీసుకువచ్చా వెంటనే తను ఎంతైనా మా అక్క కొడుకు కదా..


ఇది చిన్న గొడవేంటి అంకుల్.. అస్సలు వాడు నందూని ఏమన్నాడు.. నాకు చెబుతారా.. అన్నాడు.. దాన్నిబట్టీ అతను ఎలాంటివాడో తెలుస్తుంది.. అన్నాడు..


అది అదీ.. మోహన్ కు ఇచ్చి చేయమని మా అక్క అడిగింది.. నేను దానికి ఒప్పుకోలేదు.. నందూ కూడా ఆ కోపంతో.. సిటీలో ఎవరినైనా ప్రేమిస్తున్నావా.. అక్కడ క్లబ్బులు.. వెంట తిరగడం బాగా అలవాటు అయినట్లుంది.. ఇక్కడ మేము ఎందుకు నచ్చుతాము అన్నాడు.. అయినా తాగి ఉన్నాడని.. పట్టించుకోవద్దు అన్నాను నేను.. ఇంతలో ఎన్నిసార్లు కడుపు తీయించుకున్నావు అన్నాడు.. దానితో.. నందూ వాడిని చెంప మీద కొట్టింది అన్నాడు..


అంతా విన్న విక్కీ.. విజయవాడ రైల్వేస్టేషన్ సీసీ టీవీ ఫుటేజీ కూడా తెప్పించాడు.. అందులో చూస్తున్న రమణారావు గారు ఆశ్చర్యంగా ఒకసారి ఆపు బాబు.. ఇతనే మోహన్ అన్నాడు..


అసలు మోహన్ అక్కడికి ఎందుకొచ్చాడు..అని మోహన్ కి ఫోను చేయమని చెప్పాడు విక్కీ.. చేసి ఎక్కడున్నాడో అడగమన్నాడు..


రమణారావు గారు మోహన్ కి.. ఫోను చేశారు..


నాకు ఫోను చేశాడేంటి ఈయన నన్ను రైల్వేస్టేషన్ లో గాని చూసాడా అనుకుంటూ.. కట్ చేశాడు..


ఫోను కట్ చేస్తున్నాడు విక్కీ అన్నారు.. వేరే నెంబర్ నుండి చేద్దాము అని తన ఫోనుతో చేశాడు.. విక్కీ.. ఎవరిదో నెంబర్ అని లిఫ్ట్ చేశాడు మోహన్..


హలో ఎవరు అన్నాడు మోహన్.. ఒక పక్కన కాల్ ట్రేస్ లో పెట్టించాడు విక్కీ..


మీ మావయ్య మాట్లాడుతారంట అని ఫోను రామారావు గారికి ఇచ్చి.. ఫోను పెట్టకుండా మాట్లాడించమని చెప్పారు..


హా నా ఫోనుతో ఎత్తలేదని నీతో మాట్లాడదామని చేశాను.. అంటే ఏం మాట్లాడాలి.. నాతో అని అయినా నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు అని కోపంగా అని ఫోను పెట్టేస్తున్నా..అన్నాడు..


కోపం తెచ్చుకోకురా.. మొన్న జరిగినదానిని..మనసులో పెట్టుకోకు.. ఇప్పుడు ఇంటిదగ్గర ఉన్నావా.. చెప్పు వస్తాను అన్నాడు..


నేను ఊరిలో లేను అన్నాడు మోహన్..


మరి ఎక్కడున్నావు అన్నారు.. వైజాగ్ లో ఉన్నాను అన్నాడు..


అక్కడికి ఎప్పుడు వెళ్ళావు అన్నారు.. మొన్న వెళ్ళాను.. నువ్వు.. నందూని ట్రైన్ ఎక్కించడానికి వచ్చావు కదా ఆరోజు..


నేను నీతో మాట్లాడానికి వద్దాము అనుకున్నా.. కానీ ఇష్టంలేక.. నువ్వు చూడకుండా వెళ్ళిపోయా అన్నాడు..


ఇంతలో విక్కీ వచ్చాడు..


మోహన్ మొన్న జరిగిందేదీ మనసులో పెట్టుకోకురా.. నందూకి కొంచెం కోపం ఎక్కువగానీ.. నిన్ను కొట్టినందుకు అలా జరిగినందుకు బాధ పడిందిరా అన్నారు..


నాకు తెలియదా నందూ గురించి అదీ పెళ్ళికి ఒప్పుకోలేదని.. ఎదో తాగి వాగాను.. కానీ అది అంటే కోపంలేదు.. అయినా అలా జరిగాక మీ ఎదుట పడలేక మాట్లాడలేదు అన్నాడు..


సరేరా మోహన్ నువ్వు ఇక్కడికి వచ్చాక చెప్పు అన్నారు.. సరే మావయ్య అని ఫోను పెట్టేసాడు..


విక్కీ అతను మాటలుబట్టీ నిజమే అనిపిస్తుంది.. అలాగే అతని మొబైల్ సిగ్నల్ కూడా అక్కడే చూపిస్తుంది అన్నాడు..


ఆరోజు ఏదో తాగి వాగాడు కానీ వాడు మంచివాడే అన్నారు రమణారావు గారు..


అయినా అతని కాల్స్ కూడా చెక్ చేయమంటాను.. అని మళ్ళీ ఒకసారి నందూకి కాల్ చేయండి అన్నాడు.. విక్కీ..


మళ్ళీ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది..


ఇంతకీ నందినీ ఏమైందీ.. నందినీకి.. ఏమైందీ.. తరువాత భాగంలో తెలుసుకుందాం..


ఇంకా ఉంది..


ధన్యవాదములు 🙏



Rate this content
Log in

Similar telugu story from Drama