వీడియో ...
వీడియో ...


"వద్దు... నాకు కుదర్దు""
"చెయ్యాలి తప్పదు"
"వద్దన్నాగా"
"తప్పదు మరి"
"బలవంతం చెయ్యొద్దు"
"అందుకే అడుగుతుంది.."I
"నేను చేయలేను"
"నువ్వే చెయ్యగలవ్"
"నన్నొదిలేయ్..."
"నాక్కోపం తెప్పించ్చోద్దు"
"వేరే వాళ్ళతో చేయించుకో"
"నువ్వైతే నే బాగుంటుంది"
"వదలవా నన్ను"
"వదిలెట్టాయితే ఇంతవరకు తేవడం ఎందుకు"
"నీకో దండం...."
"ఏంచేసినా తప్పదు మరి. చెప్పినట్టు చేయాల్సిందే"
"ముందు అది విప్పు"
"తప్పదా"
"తప్పదు. ఎందుకలా మురిపించు కొంటావ్"
"నాకిష్టం లేదు"
"నాక్కావాలది"
"వద్దు గాక వద్దు"
"విప్పు ముందు"
తప్పనిసరిగా విప్పింది నీరజ
"బాగుంది. ఇప్పుడు చేతుల్లోకి తీసుకో"
"ఛీ ఛీ"
"ఎందుకసహ్యం... నాకిష్టం అనా"
"ఏమైనా అనుకో"
"శుభ్రంగా కడుగు"
"నా కేమిటీ నరకం?"
"ఒక్కసారి రుచి చూస్తే వదలవు మరి"
"చూస్తుంటేనే అసహ్యం..ఇంకా రుచీనా?"
"నోట్లో పెట్టుకొంటే కరిగిపోద్ది"
"నాకొద్దు...వినడానికే చికాగ్గా"
"ఇప్పుడు స్నానం"
"నో ....నో...."
"తప్పదు...నీరు వృధా అవుతోంది..."
"పోతే పోనీ?"
"నాక్కోపం వస్తోంది"
"నా మనసుకు నచ్చని పని చెయ్యిస్తున్నావ్"
"కాస్సేపు దాన్ని పక్కన పెట్టి నేను చెప్పినట్టు చెయ్యి"
"తప్పదా?"
"తప్పదు...బాగా రుద్దు"
"ఛీ... యాక్...థు.."
"కాస్సేపుపోని..నువ్వే కావాలంటావ్ మళ్ళీ..."
"ఛీ... అసహ్యం"
"మధ్యకి బాగా చీల్చు..."
"అదొకటా ఇంకా..."
"అప్పుడే సరిగ్గా వస్తుంది"
"వేడిగా ఉందా?"
"ఉంది..."
"కాసేపు అలానే ఉంటుంది...ఓర్చుకోవాలి.."
"అవిర్లోస్తున్నాయ్"
"లోపల చెయ్యి పెట్టి వెదుకు"
"నా చెయ్యి దూర్చాలా?"
"ఇంతవరకు చేసింది నువ్వేగా?"
"ఐతే..ఇదీ నేనే చెయ్యాలా?"
"చెయ్యాలి మరి...లేకపోతే రుచిలో తేడా వచ్చి అంతా బుగ్గిపాలౌతుంది."
"నీ సొమ్మేం పోయింది...చక్కగా వీడియో తీసుకొంటూ మురిసిపోతున్నావ్..నాకు మాత్రం ఎలాగోలా"
"వీడియో లో చూపించమన్నావ్ నువ్వే?"
"ఐతే ఇలాగా...అన్నీ నాచేతే చేయించి...?"
"ఇలాగైతే నే బోలెడు లైక్ లు"
"అందరికీ చూపిస్తావా?"
"మరి నీ కెలా గుర్తింపు వస్తుంది...?"
"ఇదా నీ నిర్వాకం...ఆ వీడియో ఆపుముందు..."
"ఏం?"
"అందరూ చూస్తే?"
"బాగుంది అనుకుంటారు...నిన్ను మెచ్చుకుంటారు కూడా..."
"నా మొహానికి అదొక్కటే తక్కువ..."
"ఇప్పుడు అందరికి తెలుస్తుందిగా..భయమెందుకు?"
"నన్ను గెంటేస్తారు..".అంటూ లేచింది నీరజ.
"ప్లీజ్...ఈ ఒక్కసారికి..."
"నో...నో...నో...".అరిచిందామె..
"మధ్యలో ఆపేస్తే ఎలా?"
"నీ ఖర్మ...నన్నడకాకుండా మొదలెడితే ఇలాగే.."
నీరసంగా కూలబడిపోయాడు క్రిస్
బ్రహ్మన్ల అమ్మాయి నీరజ ...నవ్వుతోంది గలగల.
చచ్చిన కోడి బిక్కుబిక్కుమంటూ చూస్తోంది ఆ భార్యా భర్తల్ని.
★★★★★★★★★★★★★★★★★★★★