సెల్ హెల్...శ్రీనివాస భారతి
సెల్ హెల్...శ్రీనివాస భారతి


"ఎక్కడున్నావ్?"
"ఇంట్లో"
"హోటల్ కొచ్చావనుకున్నా"
"నేనా ఎందుకు?"
"ఎందుకో అలా అనిపించింది..ఐనా ఊరేదో వెళ్తానన్నావ్ కదా వెళ్ళవా?"
"ఇప్పుడప్పుడే లేదు...ఏం మీకేమైనా పనుందా?"
"అబ్బే అదేం కాదు"
"మీరెక్కడ?"
"ఆఫిసులో"
"అదేంటి ..క్యాంపు ఉందన్నారు?"
"వాయిదా పడింది"
"సరే..రాత్రికి ఇంటికి వచ్చేస్తారా?"
"ఫ్రెండ్ ఇంట్లో చిన్న పార్టీ"
"ఐతే రారన్నమాట"
"అనుకోవచ్చు అలాగే"
"ఎవరెవరు వెళ్తున్నారు?"
"ఇంచుమించు బాచిలర్స్ అందరూ"
"ఆఫిసర్స్ ఛాయిస్?"
"అంతకు మించి"
"సరళ రేఖ ఉన్నట్టేనా?"
"కుదరదుగా...ఓన్లీ మేల్స్"
"చెయ్యి చెరో భుజం పై వేస్తేనూ?"
" ఇంతకీ ఎక్కడున్నావ్ నువ్వు ?"
"మీ ఎదురుగా ఉన్న కాంటీన్లో"
సెల్ కట్టయ్యింది..
ఇంకో సెల్ తరుపు తెరుచుకొంది...కొంతసేపు గడిచాక.
కౌన్సెలింగ్.. ఇంటరాగేషన్ మొదలు పెడ్తూ....
గది తలుపులు మూసుకున్నాయిగుట్టు బైటికి పోనివ్వకుండా .
హోమ్ డిపార్టుమెంటా మజాకా????????
--------------౫౫౫౫౫౫౫౫౫౫౫౫౫౫౫౫౫-------------