సెల్ భాగోతం..10:::శ్రీనివాస భా
సెల్ భాగోతం..10:::శ్రీనివాస భా
ఏవేవో ఆలోచనలు...ఎక్కడ పోయిందది... ఎవరికి దొరికుంటుంది. వారికేలాగు పనికిరాదు..తనకిచ్చేస్తే...ఎంతోకొంత బహుమానం ఐనా ఇవ్వకపోతాడా అని అనుకోరా దొరికినోళ్లు... అనుకొంటున్నాడు ఎప్పటిలాగే...
వాచి చప్పుడు వెక్కిరిస్తోంది ఇన్నాళ్లకు నేను అవసరం అయ్యానా అని ..
కాలం జీళ్ళపాకంలా మెల్లగా సాగుతోంది ఆనందరావుకు.
చీకటి నల్లగా పరుచుకొంది కనుగుడ్ల తెల్లని కాంతిని మింగేస్తూ..
రాత్రి సెల్ ఎంతో ధైర్యం ఇచ్చేది నేనున్నానని పక్కనే...
ఇయర్ ఫోన్లు చెవులకి తగిలించి ఇంటర్నేషనల్ సమాచారం, గాసిప్స్ రాత్రుళ్ళు చక్కగా వినేవాడు...
ఆదివారం రాత్రి ఓ రెండు గంటలు అలవాటుగా....
మిగిలిన రోజుల్లో ఓ గంటైనా కాలక్షేపం దాంతో...
ప్రపంచాన్నే ముందుకు తెచ్చిన గ్లోబ్ ఒక ఉపయోగానికి పనికొస్తే, సెల్ అమ్మో....అది చేయలేని పనేదైనా ఉందా
అందుకే కాబోలు అందరు సెల్ పోగానే శరీర భాగం పోయినట్టు ఫీలయ్యేది..బహుశా భార్య కూడా అంతలా
తోడు రాదేమో....
కొన్ని నంబర్లయినా గుర్తొస్తే బాగుణ్ణు...ఒకటొకటి లింక్ ద్వారా 200 ఐనా కుదిరేవి. పాత నెంబర్ బ్లాక్ చేయించి మళ్ళీ అదే నెంబర్ పొందితే.....
రక రకాలుగా ఆలోచనలు...మర్రి చెట్టు ఊడల్లా.
అసలేమైంది..
ఇంట్లోనే అలవాటు లేనిచోట పెట్టి మర్చిపోయాడా తను...
లేదా బయటే పోయిందా
మాగన్నుగా నిద్ర పడుతోంది. రెప్పలు
పడుతూ...లేస్తూ
గడియారం చప్పుడు నన్ను తల్చుకో అంటోంది భార్య గురక తో పోటీ పడ్తూ..
అబ్బా...ఏం గురక తీస్తోంది...రైలింజన్ లా
పైపెచ్చు నన్ను దెప్పుతుంది కుంభకర్ణుడి నిద్ర...హెలికాఫ్టర్ సౌండ్ అంటూ...
పిల్లలు కూడా ఎక్కడ పడుకున్నదీ స్పష్టంగా చెప్పేయొచ్చు...పిల్లి కూతలు ఒకరు, మరో వర్ణించలేని సౌండ్ ఇంకొకరు.. చుట్టం కూడా...
చీకటి ఎంత జ్ఞానం ఇచ్చింది నిద్రను తీసుకొని అనుకున్నాడు ఆనందరావు..
ఎప్పుడు నిద్ర పట్టింది తెలీదు...కానీ ఒంటిమీద ఏదో
పడ్తే అసంకల్పిత ప్రతీకార చర్యగా పక్కకి తోసేశాడు...
అది ఇంకొకరి మీద పడింది కాబోలు ..లేచారు వెంటనే..
భార్య తిట్టుకొంటునే లైట్ వేసింది...
ఆ వెల్తూర్లో భగవంతుడి దర్శనంలా సెల్ కన్పించింది.
పిల్లి ఎలుకా పోరాటంలో అనుకోకుండా జారి పడింది.
తప్పిపోయిన వాళ్ళు ఇంటికొచ్చిన తృప్తి లభించింది.
రేపు స్వీట్స్ కొని పంచుకోవాలి...ఇంకెప్పుడూ సెల్ ఆఫ్ చెయ్యకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు...తేలిపోయిన నిద్ర ఇచ్చిన అనందం తో... ... .... (*సమాప్తం*)
@#$@#$@#$%^&&^$%^&*౧౨౩౪౪౫౬౭౭౮౯౯!@@####$$%%^&&†((()౦౯౮౮౭౫౫౪౩౨౧$%?/