ఓ వర్షం కురిసిన రాత్రి
ఓ వర్షం కురిసిన రాత్రి
నేనుగుడిసెలో నులకమంచంపై
కూర్చున్నాను.
బయటహోరుగాలి,తుంపరలుగా వాన మొదలైంది.
గుడిసెలోకి గాలి,పెరుగుతున్న వాన చలిని మోసుకొస్తుంటే,వెదురుతడికతలుపు మూసేసి మ ళ్ళా మంచంలో కూర్చున్నాను.
వర్షం వదిలేలాలేదు.అర్ధరాత్రికావస్తొంది.
గుడిసె పక్కగా వాననీటి ప్రవాహం చప్పుడు.
మెల్లిగా లేచి మట్టిపొయ్యిలో ఎండుమర్రిపుల్లలు వేసి వెలిగించి చాయపెట్టుకున్నాను.
ఉరుములురుముతు ఆకాశం అప్పుడప్పుడు మెరుపులుమెరుస్తుంది.
అలా పొయ్యిదగ్గర చేతులువెచ్చజేసుకుంటు చాయమరిగేవరకు కూర్చొన్నాను.మెల్లిగా చాయ నా స్టీలుగ్లాసులో పోసుకొని మళ్ళీ నా నులకమంచంపై చేరాను.నా గుడిసె నేలపదనుచేరింది.బయట వాన,గాలి జతకలిపి భీభత్సకచేరి చేస్తున్నాయిపక్కవాయిద్యాల్లా మెరుపులూ,ఉరుములూ తోడయియాయ్యి.నాకు రాత్రంతా శంకర జాగరణే అన్పించింది.చేసేదేంలేక,నిద్దరపోలేక మోకాళ్ళురెండుమునగదీసుకొని,వాటిపై తలాన్చి కళ్ళు మూసుకొని,నాశరీరాన్ని దుప్పటిలోదూర్చాను.
మాటిమాటికి ఉరిమే ఉరుములతో కళ్ళుజిగేల్మనిపించే వెలుతురు నన్ను ప్రశాంతంగా వుండనీయటంల్దు.
అలా మగతగా కన్నంటుకొనే సమయంలో,నడిరేయిదాటిపోయిందనుకుంటా దబ్బుమని గుడిసెలో ఏదో పడ్డచప్పుడు.మెల్లిగా తలపై నిండుగాకప్పుకున్న దుప్పటి తీసి గుడిసెమద్యలో గుంజకు మొలకు తగిలించిన దీపాన్ని చూసాను.అది భయపడ్డచంటిపిల్ల లారెక్కలాడిస్తు గుక్కపెట్టి ఏడుస్తున్నట్టు గాలిహోరుకు రెపరెపమంటోంది. నాకళ్ళుమెల్లగా శబ్దం వచ్చినవైపుకు తిరిగాయి. అక్కడ కనిపించిన దాన్నిచూసి పై ప్రాణాలుపైనే పోయాయి.చలిని మించిన వణుకు తెలిసిందాక్షణాన. నల్లని కృష్ణసర్పము.కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి. పెద్దవెదురపతట్టలా విప్పుకున్నదానిపడగ.కమ్మరికొలిమి చప్పుడులా బుస. నరాల్లో రక్తం గడ్డకట్టుకొనిపోతున్నభావన.నన్నే తదేకంగాచూస్తోంది.నా నాలుక తడారిపోయిన షుగర్ పేషంటులా తయారైంది.ఇంకాసేపైతే ఊపిరులు ఉొష్ కాకన్నట్టుంది. విసురుగా అదితనతలను గుడిసెలోని తనబ్బీవైపుతిప్పింది.అమాంతం ఒక్కసారిగా గాల్లోకి యెగిరి లాఘవంగా ఓ ఎలుకపిల్లన్నినోటకరుచుకెని
గుటుక్కునమింగేసింది.అక్కడనుంచే నా మంచవైపోసారి చూసి జరజరా పాక్కుంటూ తడిక తలుపు సందుగుండా బయటకి వెళ్ళిపోయింది.అందాక స్తబ్దుగా వున్న పంచప్రాణాలు నాలో మెల్లగా చేరాయి.
గుడిసెబయట పారే నీళ్ళచప్పుడు తగ్గిపోయింది.వానవెలసింది.వెలుగురేఖలు విచ్చుకున్నాయని బయటప్రపంచపు సందడితో అర్థమైంది.భయం తగ్గిన నేను మెల్లగా కర్రతో చప్పుడు చేస్తు గుడిసెతలుపుదీసి
బయటకువచ్చాను.రాత్రివానకు బురదలేకుండా అంతాకొట్టుకొనిపోయింది.నేలతేటగా వుంది.
మొహంకడుగుకొని నా పనుల్లో నేనుపడదామనుకుంటున్నతరుణంలో
రోడ్డుపై జనాలు పరిగెడుతున్నది కన్పడింది.ఏమైవుంటుందా యని నేనూ తెలుసుకుందామని బయలుదేరాను.
రోడ్డుకు ఓవారగ చెత్తకుండి పక్కన ఓ పాపగొంతు ఏడుస్తుంటే అందరూ నిలబడి చూస్తున్నారు. పక్కన వున్నకాల్వల్లోంచి మురుగునీరును తోసుకొంటూ కొత్తవరదనీరు ప్రవహిస్తుంది.పాప ఇంకా ఏడుస్తుంది.పైనుంచి చెట్టుఆకులనుంచి చినుకులు జారిపడుతున్నాయి.పాపకాకలి అవుతుందేమో ఓ పక్కగా తిరిగి తల్లిని వెతికి కానరాక ఆకాశంవైపుచూస్తూ బిగ్గరగా ఏడుస్తుంది.చుట్టూ మూగిన జనాలు పాపకష్టాన్నిచూసి కళ్ళొత్తుకుంటూ ఎవరికితోచినట్టు వారుమాట్లాడుకుంటున్నారు.చంటిపాప ఇంకా ఏడుపునాపలేదు.పైనుంచి ఆకుకొనలనుండి టపటపా నీటిచుక్కలు పాపమోముపై నోటిలో పడ్డాయి.పాపఏడుపనాపింది.అంతవరకు మాట్లాడుతున్నజనాలు పాపఏడుపునాపటంతో వారూ మాటలాపి పాపవంకచూసీరు.వారిలో ఏ మూలో తల్లికదలాడింది.అయ్యయో అనుకొని పాపను ఒకావిడ చేతిలోనికి తీసుకుంది.పాపకాస్త శాంతించినట్టుంది.తిరిగి మళ్ళీ వాఖ్యానాలు.తల్లికర్కశత్వాన్నిగురించి,మనసుగురించి,నడతగురించి నాలుగురకాలుగ చేసుకుంటున్నారు.ఇంతలో ఒకతను బావిదగ్గర ఆడకూతురుశవం వుందనిచెప్పారు.అంతా అక్కడికి పరిగెత్తారు.జాలిమాటలు.విచారపుగొంతులు కాసేపు.అప్పటికి గుర్తొచ్చింది పాపను ఏంచేద్దామని?పోలీసులువచ్చి పంచనామచేసి శవాన్ని తీసుకొనిపోయారు.పాపనేంచేద్దామని? మళ్ళీ చర్చలు.రాత్రి నాకళ్ళముందే ప్రకృతి భయంకరంగా రోదిస్తుంటే కృష్ణసర్పం మింగేసిన ఎలుకనుచూసాను.అలా ఈ ఆడదానిజీవితం ఎవరిచేతిలో అంతమయ్యిందో ఎవరే ఒకరుచేసుంటారు.పోలిసులు పట్టుకుంటారు.కానీ ఈ పాపను ఏంచేస్తారు? నేనే ఎందుకుతీసుకోగూడదు.నాకూ తోడుగావుంటుంది.వెంటనే నా కర్తవ్యం బోధపడింది. నేనే అందరిని ఒప్పించి తెచ్చేసుకున్నాను.ఇరవైఐదేళ్ళుఅయిపోయాయి.నా కళ్ళు నా మల్లికోసంచూస్తున్నాయి.ఇంకారాలేదా ఏమని.ఓపికలేదు.నా మోకాళ్ళలో తలానించి మల్లికోసం ఆలోచిస్తూనకళ్ళుముూసుకున్నాను.
కాసేపటికి జనంగోల రంగయ్యతాతా యని దూరంనుండి.జనాలంతా నా గుడిసెవైపే వస్తున్నారు.పిల్లలంతా చెంగుచెంగున వారూ వస్తున్నారు.వారిమథ్యలో నా మల్లి కాకీబట్టలలో నడచివస్తుంది.నా మల్లేనా అని నా గుండె ఖాయపరచుకున్నాక నా కళ్ళు నన్నడగకుండానే నీళ్ళను వర్షిస్తున్నాయి.ఉప్పగా అనిపించలేదు నా పెదవినతాకిన మరుక్షణం.అదేదో దేవతలు తాగిన అమృతంలా తోచాయి. తాతా?అంటూ నామల్లినన్ను కౌగిలించుకొని ముద్దాడింది.నేను ఏడ్చానుఎవడో ఈ బంగారుతల్లిని వదలుకొన్నవాడు ఎంతటిదురష్టవంతుడు అనుకొన్నాను స్వగతంలో.
ఆనాటి రాత్రి వర్షం నాకుభయాన్నిచూపింది.నా ఈ కన్నీటివర్షం నాకు మమతానురాగాలు చూపింది.
ఒకటిభీభత్సముమరొకటి మనోరంజకము.
అందరూ మల్లికి పంచాయతీ ఆఫీసులో సన్మానసభఏర్పాటుచేస్తున్నారట.నన్నూ రమ్మంది.
మల్లికి కొన్నేళ్ళ క్రితం జరిగిన హత్యలో నిందితున్ని పట్టుకున్నందుకు సత్కారము ట్రేనింగ్ లోనే నేర్పుగా చేసినందుకు.
కలెక్టర్ గారు,పోలీస్ సూపర్నెంటుల సమక్షంలో .కాసేపటికి మల్లికి ఘనంగా సత్కారంచేసారు.నన్నూ స్టేజ్ పైకిపిలచి
అభినందించారు.పొగిడారు.అక్కడ పోలీసుఆఫీసర్ హత్యగావింపబడిన
వ్యక్తి ఫోటో ప్రదర్శించగానే నా కాళ్ళక్కింది భూమికదలిపోయింది.అదెవరో కాదుమల్లిని కన్నతల్లి.
అంటే మల్లితనకుతెలియకుండానే తనతల్లిని చంపిన వాన్ని పట్టుకుందా?
ఇంతకీ వాడెవడు?
తెలుసుకోవాలనివుందా?అయితే తెలుసుకోండి. మల్లిని కన్నందుకు మల్లితల్లినిచంపిన ఆ దుర్మార్గుడు మల్లితండ్రే.మగసంతానాన్నికననందుకు గొడవపడి గొడవలో మల్లితల్లినిచంపినకిరాతకుడు. వాడ్ని స్టేషన్ లో వేసారట.
అంతాబయలుదేరారు.నేనుకూడా నా మల్లితో దర్జాగా పోలిసుకారులో నా మల్లిపక్కన.
శుభం....

