Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

ఏమైపోతానే

ఏమైపోతానే

6 mins
11



చందన్ కొత్తగా ముంబయ్ లో అడుగు పెట్టాడు, సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం..


అన్నేళ్ళుగా రాజమండ్రిలోనే చదువంతా, మధ్యతరగతి కుటుంబం తనది ...


" హాయ్ " అంటూ వచ్చింది టీమ్ మెంబర్ ప్రియాంక, చందన్ క్యాబిన్ దగ్గరకి ...


వెనకాలే తమ టీమ్ వాళ్ళే మరో నలుగురూ వచ్చారు, అందరూ కలిసి బ్రంచ్ ( లేట్ బ్రేక్ ఫాస్ట్ కమ్ ఎర్లీ లంచ్ లాగా తినేది ) తినేందుకు వెళ్ళారు ..


పిజ్జా, బర్గర్ , పావ్ బాజీ .. ఇవీ తినాల్సిన అయిటమ్స్ ... అదే ఇంట్లో అయితే అమ్మ వేడివేడిగా , కమ్మగా ఇడ్లీలో, ఉప్మానో చేసిపెట్టేది, అని దిగులుగా ఇంటిసభ్యులను గుర్తుచేసుకుంటూ తింటున్నాడు చందన్ ...


" హేయ్ చందన్, అట్లు తెచ్చాను తింటావా, నీకు ఇవి నచ్చటంలేదనుకుంటా " అంటూ తన టిఫిన్ బాక్స్ చందన్ కి ఇచ్చింది ప్రియాంక ..


" వద్దులే, పర్లేదు ... " అంటూ మొహమాటపడుతూనే, బాక్స్ అందుకున్నాడు చందన్ .. అట్లు తింటుంటే, హాయిగా అనిపించింది చందన్ కి ..


ప్రియాంక , చందన్ తో బాగా కబుర్లు చెబుతుంది . చందన్ కి , ప్రియాంక అంటే చాలా ఇష్టంగా అనిపిస్తోంది ... ప్రియాంక అంటే అమితమైన ఆకర్షణగా ఉంటుంది చందన్ కి .. కళైన మోము, కలుపుగోలుగా మాట్లాడే ప్రియాంక వలన, చందన్ కి తన ఇల్లంటే ఉన్న దిగులు క్రమక్రమంగా తగ్గిపోయింది ...


ముంబయ్ ఫాస్ట్ లైఫ్ , మొదట్లో చందన్ కి ఇబ్బందిగా అనిపించినా, అతని టీమ్ మేట్స్ స్నేహం వలన ముంబయ్ జీవితం, చందన్ కి అలవాటయిపోయింది .


అటు నరసింహ ఇంటికి, అతని చెల్లెలు పావని, తన కూతురు పూర్ణతో వచ్చింది... " అన్నా, చందన్ కి ఉద్యోగం కూడా వచ్చింది, ఇహ పెళ్ళి చేసేద్దాం అన్నా పూర్ణకీ, చందన్ కి, ఎలానూ ముందుగా మనం అనుకున్న సంబంధమేగా " చెప్పింది పావని...


నరసింహ , చందన్ కి ఫోన్ కలిపాడు... అప్పుడే చందన్, ప్రియాంకతో కలిసి లంచ్ చేస్తున్నాడు...


" నాన్నా చెప్పండి " అన్నాడు ఫోన్ లో చందన్.. " మీ అత్త మీ పెళ్ళి కి ముహూర్తం పెట్టిస్తుందటరా మరి " చెప్పాడు నరసింహ...


" ఇప్పుడా నాన్నా, ఇప్పుడే వద్దులే " అన్నాడు చందన్... 


" మరీ వయసు ఎక్కువయిపోతోంది కదరా నీకూ, పూర్ణకి, .. ఇహ మీ పెళ్ళి చేసేస్తే, నీకూ ముంబయ్ లో ఇంటి భోజనం చేసి పెడుతుంది కదరా పూర్ణ " అన్నాడు నరసింహ అపురూపంగా, పూర్ణ తల మీద చేయి వేసి...


" ఇప్పుడే పెళ్ళి వద్దులే నాన్నా, అయినా నేను సాయంత్రం మీతో మాట్లాడుతాలే " అనేసి ఫోన్ పెట్టేసాడు చందన్...


" ఏంటి చందూ, అప్సెట్ గా ఉన్నావు, ఏంటీ విషయం " అడిగింది ప్రియాంక... 


" నా పెళ్ళి గురించి " అనేసి విషయాన్ని దాటేయ్యాలని ప్రయత్నాలు చేయబోయాడు చందన్...


" పెళ్ళా, ఎప్పుడు , ఎవరితో " అంది చిలిపినవ్వు నవ్వుతూ ప్రియాంక...


" చిన్నప్పటినుంచీ, నా మరదలు పూర్ణతో, నా పెళ్ళి అని చెబుతున్నారు మా నాన్నగారు " అన్నాడు చందన్...


" అవునా " అని షాక్ తిన్నట్లుగా అనేసి, ఛటుక్కున లేచి నుంచుని, ఒక మోసగాడిని చూసినట్లుగా, ఒకసారి చందన్ ని చూసి, బాధగా ' ఎందుకిలా ' అన్నట్లుగా చూసి, తడికన్నులతో చకచకా అక్కడినుంచీ, అతనినుంచీ వెళ్ళిపోయింది ప్రియాంక....అంతే, ఆ రోజు మొదలు, ప్రియాంక మళ్ళీ చందన్ తో మాట్లాడలేదు..


ప్రియాంక దూరం అవుతున్న కొద్దీ, చందన్ కి ప్రియాంక మరీ ఇంకా అపురూపంగా అయిపోయి, ఆమె ఆలోచనలే అతని లోకంగా మారిపోయాయి..


ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తే, ఆమె అస్సలు మాట్లాడటం లేదు, ఆమెనే చూస్తూ ఉంటాడు చందన్, ఆమె వెనకాలే, ఆమె ఇంటిదాకా కూడా ఫాలో అయిపోతాడు... ఆమె ఇంటి ఎదురుగా, వీధి మీద కాపు కాస్తూ నుంచుంటాడు, ఆమె బాల్కనీలోకి వస్తే, ఆమెను ఒక్కసారి చూడచ్చని, గంటలు గంటలు అయినా నుంచునో, అక్కడే ఉండే అరుగు మీద కూర్చునో ఉంటాడు,ఉద్యోగం ఏదో ఒక పనిలాగా అలా అలా చేసేస్తున్నాడు.. తిండి తగ్గిపోతోంది, మనిషి దిగులుగా అయిపోతున్నాడు..


ప్రియాంకని పలకరించబోతే, ఆమె అస్సలు మాట్లాడటం లేదు... నెల రోజుల తరువాత ఒకరోజున , చందన్ మీద జాలి వేసి అతనికి చెప్పింది " నిన్ను , నీ మరదలితో పెళ్ళి చేయాలని, మీ పెద్దవాళ్ళు అనుకుంటున్నారని తెలిసీ, నన్ను నీ ప్రేమకి అలవాటు చేసావు, ఇప్పటికే నీ జ్ఞాపకాల నుంచీ బయట పడటం నాకు కష్టంగా ఉంది, ఇంకా నయం నేను ఇంకా నీ ప్రేమలో మునిగిపోయి ఉండుంటే, నేను అస్సలు తేరుకోలేకపోయేదానిని, ఎందుకురా ఇలా మా సున్నితం మనస్సులతో, మా భావాలతో ఆడుకుంటారు మీరు, ఇంత మోసం అంత సునాయాసంగా ఎలా చేసేయాలనుకున్నావు " అని తన చేతలకు, తన నిరాదరణకు ఒక స్పష్టమైన కారణాన్ని చందన్ కు చెప్పేసి వెళ్ళిపోయింది ప్రియాంక...." అయ్యో మోసం కాదు, నా మరదలితో పెళ్ళి అని పెద్దవాళ్ళు అనుకోవటమే కానీ నేను ఏ రోజూ సమ్మతమే అని నిర్ధారించలేదు " అని చందన్ , ప్రియాంకకు, వెనకనించీ చెబుతున్నా, ఆమె వినిపించుకోకుండా వెళ్ళిపోయింది...


అది మొదలు చందన్ ప్రేమ విఫలమై మనసు చెదరకొట్టుకున్నాడు...


ఉద్యోగం పోయింది, సరిగా తినడు, సరిగ్గా నిద్ర పోడు, ప్రియాంక గురించే ఇరవైనాలుగు గంటలూ ఆలోచనలూ.... తల్లితో, తండ్రితో సరిగా మాట్లాడడు...


తండ్రిని నిందిస్తూ ఉంటాడు... " మీ పెద్దవాళ్ళ వల్లనే, నాకు నా ప్రేమ దూరం అయ్యింది, నా పెళ్ళిని నా ప్రమేయం సరిగా లేకుండానే, మీరు ఎలా నిర్ణయిస్తారు, నా జీవితకాలం బంధం కాదా పెళ్ళి అంటే, ఫోన్ లో చర్చించుకునేంత చిన్న విషయం కాదు కదా పెళ్ళంటే, ఆ రోజున అనవసరంగా ఫోన్ లో నా ప్రియాంక ముందు, నా పెళ్ళి విషయం మాట్లాడి, నా భవిష్యత్తుని బలి చేసేసారు " అని ఒకటే అరుపులు కోపంగా, ఓపికున్నంతసేపు అరుస్తాడు, తరువాత ఉన్నట్టుండి నీరసంగా మంచం మీద కుప్పకూలిపోతూ గట్టిగా ఏడ్చేస్తాడు...


" అయ్యో కన్నా " అంటూ తల్లి, చందన్ ని పట్టుకుని ఏడుస్తుంది... కానీ నరసింహ మాత్రం బయటకు ఏడవలేక, గుండె బరువెక్కి సోఫాలో కూలబడతాడు... తలంతా నొప్పి, నరాలు జుమ్మని లాగుతుంటాయి నరసింహకు, కొడుకు బాధను చూడలేక....ఇహ ఒక రోజున, తెల్లవారుఝామున నరసింహకు మెలకువ వచ్చి లేచాడు... మనసులో ఏదో తెలియని అసౌకర్యం, గుండెలు దడదడామని కొట్టుకుంటున్నాయి, ఏదో ప్రేమపాశం మనసుని తొందరపెడుతోంది, కాళ్ళు తమంతట తామే కొడుకు గది వైపు దారి తీసాయి...


కొడుకు మంచం మీద లేడు, బాత్రూమ్ లో ఉండుంటాడని బాత్రూమ్ వైపు వెళ్ళాడు.. తలుపు బయట గడియ వేసే ఉంది, అంటే లోపల లేడు.. మరి ఎక్కడున్నాడు కన్నయ్య అనుకుని, గబగబా గదులు వెతుకుతున్నాడు... హాల్లో లేడు, కిచెన్ లో లేడు, బాల్కనీలోకి నడిచాడు నరసింహ... 


ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుంచీ కింద కనిపిస్తోంది... ఒక యువకుడు నుంచుని ఉన్నాడు, తన భుజాన డబ్బాలోని, పెట్రోల్ గుమ్మరించుకుంటున్నాడు, పెట్రోల్ వాసన ఘుప్పున వస్తోంది, శ్రద్ధగా పరికించి చూస్తున్న నరసింహకు ఒక యువకుడు పెట్రోల్ వంటి మీద పోసుకుంటున్నాడు అనిపించగానే, గుండె ఝల్లుమంది, టక్కున అనిపించింది, తెలిసింది, వాడు ఎవరో కాదు చందన్, వళ్ళంతా షాక్ కొట్టినట్లు వణికింది నరసింహకి, నరాల్లోని కంపనం బాగా అనుభవమవుతోంది ఆ తండ్రికి ...


అంతే .....


అంతే ....


ఒక్క ఉదుటన కిందకి పరుగు తీసాడు... అప్పటికే నిద్ర లేచి భర్త, బిడ్డ కోసం వెతుక్కుంటున్న భార్యను కూడా పట్టించుకోలేక, ఎదురుగా నడిచి వస్తున్న భార్యను దాదాపుగా తోసేస్తున్నట్లుగా , పక్కనుంచీ రాసుకుంటూ పరుగెత్తుకు వెళుతున్నాడు కిందకి నరసింహ, తన కొడుకును సమయానికి అందుకోవాలి, అతని మూర్ఖపు ప్రయత్నాన్ని అడ్డుకోవాలి అన్న అతని తొందర, అతన్ని అతని వయసుని కూడా లెక్క చెయ్యనంతగా అతన్ని పరుగులు పెట్టించింది...


" ఏమిటండీ, ఏమయ్యిందీ " అంటూ వెనకాలే భార్య కూడా వస్తోంది...


కింద పెట్రోల్ తో తడిసిన కొడుకు , అగ్గిపుల్లను వెలిగించే ప్రయత్నంలో విఫలం అవుతున్నాడు... బహుశా ఒక తండ్రి మనసు చేస్తున్న ప్రార్ధన ఫలితం, ఆ కొడుకు అగ్గిపుల్లను వెలిగించలేని విఫలయత్నం ...


వాయువేగంతో, కొడుకుని చేరుకుని, కొడుకు చేతిలోని అగ్గిపెట్టెను దూరంగా విసిరికొట్టేసి, కొడుకుని తన రెండు చేతులతో గట్టిగా చుట్టేసి, " నాన్నా పోకూడదురా, నన్ను విడిచి దూరం పోవద్దురా, ఆ అమ్మాయి నీకు దూరం అయిందని , నువ్వు మాకు దూరంగా వెళ్ళిపోతే, మేము ఎలా తట్టుకోగలం కన్నా, పోవద్దమ్మా మాకు అన్యాయం చేసి పోవద్దమ్మా " అని అంటూ నరసింహ భోరుమని ఏడ్చేసాడు...


నాన్న దుఃఖిస్తున్నాడు...


గుండెలు మొయ్యలేని బరువెక్కి, ఆ భారం దించుకునేలా భోరుమని ఏడుస్తున్నాడు ఓ నాన్న, తన కొడుకు కోసం ....


వెనకాలే అశ్విని వచ్చింది.. ఆమెకు విషయం అర్థం అవ్వటానికి , ఒక నిముషం పట్టింది, అర్థం అయిందో లేదో, ఆమెకు గుండె పట్టేసింది, అంతే నుంచున్న మనిషి నుంచున్నట్లే విరుచుకు పడిపోయింది...


అమ్మా అంటూ చందన్, అశ్వినీ అంటూ నరసింహ చెరోవైపూ వచ్చి అశ్వినిని పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళారు, అప్పుడే ఆ హడావుడికి అటుగా వచ్చిన నైట్ వాచ్ మెన్ సహాయంతో....


ఆ రాత్రంతా నరసింహ ఏడుస్తూనే ఉన్నాడు...ఒకవైపు చందన్ తీసుకున్న, చేసుకోబోయిన పెద్ద విషయానికి, మరోవైపు భార్య హాస్పిటల్ లో ఐసీయూ లో స్ప్రుహ లేకుండా పడిఉండటానికి....


హాస్పిటల్ లో చందన్ తండ్రి దగ్గరకు వచ్చి , తండ్రి భుజం మీద నిస్సత్తువగా తన తలను వేలాడేసి, తండ్రి పక్కనే కూర్చుని ఉన్నాడు... నరసింహ , చందన్ తలపై తన చేయి వేసి నిమిరాడు ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా....


ఆ రోజు సాయంత్రానికి డాక్టర్‌ లు చెప్పారు, అశ్వినికి గుండె పరంగా భయం లేదని, కానీ ఏదో అసౌకర్యంతోనో, అభద్రతతోనో ఆమె బీపీ హై అవుతోందని... అప్పుడు నరసింహ చెప్పాడు, ఒక్కసారి తాను, తమ అబ్బాయి అశ్వినిని చూసి మాట్లాడితే , తనకి ఆరోగ్యం కుదుటపడచ్చని...


ఇద్దరూ ఐసీయూ లోకి వెళ్ళారు... అశ్విని చేతిని మెల్లగా తట్టారు, కళ్ళు తెరిచి చూసిన అశ్వినికి కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి, సెలైన్ సూది గుచ్చి ఉన్న చేతితోనే, చందన్ చేతిని గట్టిగా పట్టేసుకుంది... " అమ్మా నేను బావుంటాను, నాకేమీ కాదు, నువ్వు భయపడకు " అని చందన్ తల్లికి స్పష్టంగా చెప్పాడు... ప్రమాణం చేస్తున్నట్లుగా తన చేతిని తల్లి తల మీద ఆప్యాయంగా నిమిరాడు...


అవునా, నిజమేనా అన్నట్లు అశ్విని , చందన్ ని చూసింది... నరసింహ, చందన్ భుజం చుట్టూ తన చేతిని బిగించి చూపాడు అశ్వినికి, మన అబ్బాయిని నేను వదలకుండా గట్టిగా పట్టుకుని ఉంటాలే అన్నట్లుగా... అప్పుడు కూడా ఉద్వేగంతో నరసింహ కళ్ళల్లో నీళ్ళు ...


నాలుగు రోజులకు నరసింహ, అశ్విని, చందన్ ... తమ ఇంట్లో ప్రశాంతంగా ఉండే ప్రయత్నంలో ఉన్నారు, భవిష్యత్తు కోసం తగినంత ధైర్యం తెచ్చుకుంటూ ....



Rate this content
Log in

Similar telugu story from Romance