అసంతృప్త
అసంతృప్త
సగటు స్త్రీ కాదు కాదు హై క్లాస్ మహిళ కానే కాదు మధ్యతరగతి వనిత అంతర్మధనం...
సగటు స్త్రీ తన పనులు తాను చకచకా చేసేసుకుని పమిటచెంగు గుమ్మం దగ్గర పరుచుకుని కాసేపు నిద్రపోయి లేచి మళ్ళీ పనుల్లో మునిగిపోయి రాత్రికి అలిసి నిద్రపోతుంది తాగొచ్చిన మొగుడితో గొడవ పడి మరీ, ఈ స్త్రీ ఎక్కువగా ఆలోచించదు, కాయకష్టంలోనే సమయం గడిచిపోతుంది...
హైక్లాస్ మహిళ సాటి హై క్లాస్ వారితో బంగారం కొనుక్కోవడంలో పోటీపడి, కిట్టీ పార్టీలలో వాటిని ప్రదర్శించుకుని, బంగారం ఆభరణాలుగానే కాకుండా, చీరల్లో కూడా కలిపి నేయించుకుంటూ ఆ చీరలు కట్టుకుని ఆ చీరల గురించి కథలు కథలు చెప్పుకుని, కొన్ని దానధర్మాలు కూడా ఫొటోల కోసం చేసి పేపర్ లో ఫొటోలు వేయించుకుని టాక్ ఆఫ్ ద టౌన్ గా మారి రాత్రుళ్ళు నిద్ర పట్టదని స్లీపింగ్ పిల్ ఒకటి వేసుకుని నిదురపోతారు, ఎక్కువభాగం యాంత్రికమైన జీవితం...
ఇహ మధ్యతరగతి వనితలకు, ఎన్ని పనులు ఉన్నా, చేస్తున్నా, ఆలోచనలు ఎక్కువ. ఇరవైలలో పెళ్ళిళ్ళు చేసుకుని, ముప్ఫైలలో ఆలోచిస్తుంటారు, కొన్ని సంఘటనలు మనసుని బలంగా గాయపరిచాక,
" ఈ భర్త తనను సరిగా ప్రేమించడంలేదని, తనతో మనసు విప్పి మాట్లాడడని, తన విలువని సరిగా గుర్తించడని, తనకు తగిన భర్త దొరకలేదని, తాను పెళ్ళి చేసుకునే సమయంలో తన బుర్రకు ఈ వివాహ బంధం, పెళ్ళి అనే ఈ సంబంధం జన్మ అంతా ఉంటుందని, తగిన అబ్బాయిని తాను ఎన్నుకోవాలని తోచని పరిణితిలేనితనం, అసలు వివాహం అంటే జన్మంతా మోయాల్సిన బంధం అని ఊహకు రాని పసితనం లాంటి అజ్ఞానం, కనీసం తల్లీతండ్రీ కూడా కూతురు కోసం జీవితం మొత్తం కోసం ఇతను మనమ్మాయికి సరైనవాడు అవునా కాదా అని స్పష్టంగా ఆలోచించరు, ఎంతసేపూ గుండెలమీద బరువులాంటి భాధ్యతను దించేసుకోవాలనే తొందర.
ఫలితం ఆడపిల్ల ముప్ఫై వయసు నుండీ అసంతృప్తితో బతుకుతుంది. ఇతను నాకు సరిగ్గా నచ్చట్లేదు. నాతో మనసు విప్పి మాట్లాడడు. మాట్లాడినా దైనందిన జీవితం గురించి తప్ప ప్రేమపూర్వక, శ్రృంగారపూర్వక మాటలు అస్సలు మాట్లాడడు. నా మనసున రంజింపజేయలేడు.
నా జీవితం రసహీనంగా మారింది. ఇలాంటి జీవం లేని జీవితం చప్పగా ఉంది... అనేలాంటి ఆలోచనలతో మనసును రాయి చేసుకుంటుంది. తానొక కదిలే బొమ్మలా మారిపోతుంది. అయినా సరే కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయడు నామమాత్రపు భర్త. ఫలితం ఎడమొహం పెడమొహం. నలుగురిలో నవ్వు మొహాలు, నాలుగ్గోడల మధ్యన శ్రృతిలయలు లేని మూగ జీవితాలు, మౌనజీవితాలు, జీవం లేని జీవచ్ఛవాల్లాంటి జీవితాల
