లక్ష్మి
లక్ష్మి
చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న
తల్లి మరియు ఇద్దరు అన్నయ్యలతో పాటు
గారాబంగా,ఎంతో ఆనందంగా పెరిగింది లక్ష్మి...
లక్ష్మీ అన్నయ్య తమకు ఉన్న కొద్ది పొలంలోనే
వ్యవసాయం చేస్తూ తండ్రి లేడు అన్న కొరత
లేకుండా సంసారాన్ని సాఫీగా సాగిస్తున్నాడు,
ఏడవ తరగతి వరకు చదువుకున్న లక్ష్మికి
ఇంకా చదవాలని ఉన్నా, పక్క ఊరికి వెళ్లి
చదువుకోవాలి కాబట్టి ఆమెను పంపించలేక,
లక్ష్మీ అన్నయ్య ఊళ్లోనే మిషను కుట్టడం కూడా
నేర్పించాడు లక్ష్మీ మిషన్ కుట్టడం చాలా బాగా
నేర్చుకుంది..
తండ్రి లేడు తల్లి అన్నయ్యలతో జీవనం
సాగిస్తున్న లక్ష్మికి ఆమె తల్లి సురేష్ అనే
వ్యక్తికి రెండో భార్యగా ఇచ్చి పెళ్లి చేయాలి
అనుకుంది సురేష్ చాలా మంచి వ్యక్తి
తమ పొలం పక్కనే సురేష్ పొలం ఉండేది...
వ్యవసాయం చేసుకుంటూ బాగా బ్రతుకుతున్నాడు
మంచి సంస్కారవంతుడు పెద్దలంటే గౌరవం ఉన్నవాడు సురేష్ అందుకే లక్ష్మిని సురేష్ కు ఇచ్చి చేద్దాం అమ్మాయి సుఖంగా ఉంటుంది అని అనుకుంది...
లక్ష్మికి రెండో భార్యగా వెళ్ళడం ఇష్టంలేక
మనసొప్పక,తనకు మంచి జీవితాన్ని
ఇవ్వడం లేదని మనసులోనే తల్లిని
అన్నయ్యలను తిట్టుకొని శపించుకుంటూ,
ఆవేశంలో కొత్తగా పరిచయం అయిన మహేష్
అనే వ్యక్తితో ఎవరికి చెప్పకుండగా ప్రేమ పెళ్ళి
చేసుకొని,ఊరిని వదిలిపెట్టి మహేష్ ని నమ్మి
అతనికి కూడా ధైర్యం తనే చెప్పి ఇద్దరూ ధైర్యంగా
జీవనం సాగిద్దాం అని పట్టణానికి వెళ్ళి అక్కడ
అద్దె ఇల్లు తీసుకొని జీవనం మొదలుపెట్టారు...
అమ్మకు అన్నయ్యలకు,మంచిగా బ్రతికి
చూపించాలి మనం అనే పట్టుదలతో అతను
చెప్పిన మాయమాటల్లోని ప్రేమకు లొంగిపోయింది
అతని వలలో చిక్కిన లక్ష్మికి మహేష్ అందమైన
మాటలు చెప్పి అతనే ప్రపంచమని అనుకునేలా
మాయచేసి లక్ష్మీని అంతలా నమ్మించాడు.....
అంతలా అతనిని నమ్మినందుకు ఆరు నెలలు
గడిచిన తర్వాత తన నమ్మకం వమ్ము అయ్యింది,
అని లక్ష్మీకి తెలిసింది, మహేష్ కి అంతకు ముందే
పెళ్లి అయిపోయింది ఇద్దరు పిల్లల తండ్రి కూడా
అతను ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వ్యక్తి
ప్రేమ అనే అస్త్రాన్ని వాడి నీలాంటి ఎంతోమంది
ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు అని ఎవరో
మూడో వ్యక్తి నుంచి తెలిసిన లక్ష్మి లబోదిబోమని
ఏడ్చి ఎంతో బాధపడ్డది....
నా తల్లిని, అన్నయ్యలను బాధపెట్టి,అవమానపరిచి వచ్చినందుకు భగవంతుడు నాకు సరైన శిక్షే వేశాడు
అని కుమిలిపోయింది లక్ష్మీ.....
తన నుంచి ఎవరికీ బాధకలగకూడదని
మహేష్ ను వదిలిపెట్టి ఒంటరిగా జీవనం
సాగిస్తోంది...
తనలాగా అన్యాయమైన ఎంతోమంది
మహిళలను తలుచుకుని,చావు దీనికి
పరిష్కారం కాదు,ఇలా ఎన్నో బాధలకు గురి
అయిన మహిళలకు నేను చేదోడు వాదోడుగా
ఉండాలనే నిర్ణయం తీసుకుంది...
తన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి నాలుగు
కుట్టుమిషన్ లను తెచ్చి నలుగురికీ పని
నేర్పించింది, పట్టణంలో చిన్న వ్యాపారవేత్తగా
మంచి పేరు తెచ్చుకుంది...
"ఉత్తమ కుట్టు మిషన్ మహిళా" అనే పేరు
తెచ్చుకున్నది .మనసులో ఎంత బాధ ఉన్నా,
ప్రేమ పేరుతో మోసపోయిన వాళ్ళకు మోహానికి
బలి అయిన వాళ్లను ఆదుకుంటూ....
ప్రపంచానికి తన బాధ తెలియకూడదని
నవ్వుతూ ఉద్యోగంపై దృష్టిపెట్టి లక్ష్మీ
జీవితాన్ని సాగించింది...
ఇందులో నీతి ఏంటంటే...
తల్లితండ్రులు చూసిన సంబంధం చేసుకుంటే
కష్టమైన,సుఖమైన,సంతోషమైనా,
తల్లిదండ్రులకు చెప్పుకోవచ్చు కాస్త ఊరట
కలుగుతుంది....
అందుకే అడ్డదారులు తొక్కకుండా
జీవితాలను వీధిపాలు చేసుకోకుండా
ఇప్పుడున్న ఈ టెక్నాలజీ లో మునిగిపోకుండా
బాగా చదువుకొని తల్లిదండ్రుల మాటలు విని
మంచి భవిష్యత్తు ఉంటుంది....
