VIJAY KUMAR

Romance Classics

3.4  

VIJAY KUMAR

Romance Classics

ఓర్పు

ఓర్పు

3 mins
225


  • ప్రస్తుత కాలంలో ఓర్పు కేవలం పుస్తక పఠనం లో దొరికే ఒక గొప్ప పదంగా ఉండిపోయింది. ఓర్పు ఒకప్పటి సహజ లక్షణం. ఇప్పుడు కేవలం ఒక మాట. ప్రతి ప్రశ్నకు సమాధానం ఓర్పు వల్లే లభిస్తుంది. సృష్టిలో ఏమి కావాలి అన్న కేవలం ఓర్పు వల్లే దొరుకుతుంది. కానీ అది ఒక మాటగా పరిగణిస్తారు ఈ కాలంలో. నికు ఉన్న ఓర్పును ఆధారంగా చెప్ప వచ్చు నీ లక్ష్యం ఎంత గొప్పదో అని. ఓర్పు సహజంగా పుట్టుకతో అందరికీ రాదు, కొంత మంది సాధన చెయ్యవలసి ఉంటుంది. కృషి లేకుండా వచ్చే ఏ చిన్న ప్రతి ఫలం ఎంతో కాలం నిలవదు. ఓర్పు అనేది ఉన్నతమైన సాధనలో సహజమైన ఒక లక్షణం అనే చెప్పాలి. అలాంటి కొన్ని గొప్ప సహజమైన లక్షణాలను కలిగి ఉన్న ఒక పిచ్చుక ప్రకృతితో చాల సన్నిహితంగా కలిసి జీవించేది. పిచ్చుక చేసే పనులను ప్రకృతి సంతోషంగా ఆహ్లాదకరంగా స్వీకరించేది. పిచ్చుకకి ఉన్న భావాలను ప్రకృతికి, ప్రకృతికి ఉన్న భావాలను పిచ్చుకకి చెప్పుకొనేవారు. అలా ఒక రోజు మాటల సందర్భంలో నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు నాకు ఉన్న ఏకైక బంధం నువ్వే అని పిచ్చుక ప్రకృతితో చెప్పింది ఆ మాటలకు ప్రకృతి పసి పిల్లల ఎంతగానో మురిసిపోయింది. సృష్టిలో ఒకరి సంతోషం ఇంకొకరికి ఇష్టం ఉండదు, ఎందుకు అంటే వాళ్ళు తప్ప ఇతరుల సంతోషంగా లేదా ఆనందంగా ఉన్న ఇష్టం ఉండదు కనుక, అలానే ఈ పిచ్చుక, ప్రకృతి స్నేహాల మధ్య ఇంకొకరి దృష్టి పడి వల్ల మధ్య ఉన్న స్నేహ భావం ఇబ్బందిగా మారింది. వాళ్ళ మధ్య ఇతరులు జోక్యం చేసుకొని ఒకరి పట్ల ఇంకొకరికి ద్వేషం అను విత్తనాన్ని నాటారు, అది కొన్ని రోజులకే వృక్షంగా మారింది. ఇద్దరి మధ్య బంధాలు సన్నగిల్లాయి. స్నేహ భావానికి భిటలు వచ్చాయి, ఐతే ఇతరులకి తెలియదు ఆ ఇరువురి మధ్య ఏర్పడిన బీటల నుండి మరొక బంధం ఏర్పడుతుంది అని, ఆ బంధం స్నేహానికి పట్టిన సంకెళ్లను తెంచి సృష్టికి ఒక కొత్త నిర్వచనం చెప్తారు స్నేహం కోసం అని. ఇతరులు ఇద్దరి మధ్య వచ్చి వారి పట్ల సంతోషాన్ని దూరం చేసి వాళ్ళు సంతోషంగా ఎన్నాళ్ళు ఉండలేరు, వారికి కాలమే సమదానం చెప్తుంది. అందుకే ఓర్పు అనేది చాలా ప్రధానం అవుతుంది ఇక్కడ. ఎప్పటిలానే పిచ్చుక, ప్రకృతి ఒకటిగా కలిసి జీవిస్తున్నారు. ఐతే వాళ్ల సంతోషం ఎన్నాళ్ళో లేదు కాలం వారి పట్ల మళ్ళీ చేదు అనుభవాలు ఇచ్చి వెళ్ళిపోతుంది, ఈ సారి కాలానికి జాలి లేదు ఎందుకు అంటే ప్రకృతి పిచ్చుక ల మధ్య వచ్చే విఘాతం వారి ఇరువురి జీవితాలని మార్చేస్తుంది అని వారికి తెలియదు. కాలం గడుస్తుంది, ఆ సమయం రానే వచ్చింది ప్రకృతి లో తెలియని ఆందోళన, భాద, అసహనం మొదలు అయింది. ప్రకృతి లో తెలియని మార్పులు వచ్చాయి గాలి తుఫాను ల మారింది, ప్రకృతి నుదుటి యందు ఏర్పడిన చెమట బిందువులు ఉప్పెనలా, వర్షంల సృష్టి మొత్తం ఒక్కసారిగా అంధకారం లో మునిగిపోయింది. ప్రకృతి మాటలు గర్జనగా, తన శ్వాస సుడిగాలిల, హృదయం అగ్ని జ్వాలల, తన కదలికలు భుప్రకంపనల మారుతు వచ్చాయి. తనలోని మార్పులను చూసి ఎలా స్పందించాలో తెలియని స్థితిలో ప్రకృతి ఒక పక్క, తన వద్దకు కూడా వెళ్లలేని స్థితిలో పిచ్చుక ఒకరి కోసం ఒకరు ఆలోచనల మధ్య ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. ప్రకృతి నుండి సమాధానం లేదు అల కొన్ని రోజులు గడిచాయి, ఆ దూరం కాస్త పిచ్చుక మనసులో తెలియని సందిగ్ధంలో పడింది. ఇలా ఉన్న పిచ్చుక ఓర్పుతో ప్రకృతి శాంతి రూపం కోసం ఎదురు చూస్తూ చాలా కాలం గడిపింది, రోజులు సంవత్సరాలుగా, సంవత్సరాలు యుగాలుగా మారాయి. పిచ్చుక తన పట్టుదలను, ఓర్పును ఆధారంగా చేసుకుని కాలానికి వేతిరేకంగా జీవిస్తూ వచ్చింది, పిచ్చుకలో కోపం, భాద, నిరాశ, నిస్పృహ, ఆవేదన, ఆకృషం, ఆరాటం, ఆందోళన, కన్నీళ్లు చోటుచేసుకున్నాయి. ఆ సందర్భంలో ప్రకృతి, పిచ్చుకనీ వదిలి వెళ్ళిపోయింది. పిచ్చుకకి ఏమి చెయ్యాలో తెలియలేదు ఆవేదన పడుతుంది, ఆక్రోషిస్తుంది, కలవరం పడుతుంది, కనులు కంటతడి పెట్టుకుంటుంది, ఆరాటపడుతుంది, మనస్సు బెంగపెట్టుకింది, ఏడుస్తూ తన నామము యందు రమ్మని ప్రాదేయపడుతుంది, బ్రతిమాలుతుంది, కను పాప యందు తన జ్ఞాపకాలను తలచుకొంటు వుంది, శరీరం నుండి రక్తము వస్తుంది, హృదయం రుద్రుడివలే, మనస్సు కాళివలె, మారుతుంది అయిన ప్రకృతి స్పందించలేదు. తన యందు ఉన్న ఓర్పు సహనం కోల్పోయిన పిచ్చుక తన జీవితాన్ని ప్రకృతికి అంకితం చేసి వెళ్ళిపోయింది. పిచ్చుక తన ప్రాణాన్ని ప్రకృతికి కానుకగా బహుకరించింది, అల పిచ్చుక ప్రాణాలతో జీవం పోసుకున్న ప్రకృతి మళ్ళీ జన్మించింది. గడిచిన సంఘటనలు ప్రకృతి కనుల ముందు పునరావృతం అవుతున్నాయి, తనకి జరిగిన సంఘటనలు గుర్తు వచ్చేసరికి పిచ్చుక ప్రాణాలతో లేదు, ప్రకృతికి తెలుసు ఆ పిచ్చుక ఇంకా రాలేదు అని అయిన సరే ఓర్పుతో పిచ్చుక కోసం ఎదురు చూపులు కొనసాగిస్తుంది ప్రకృతి. తన ఓర్పు, ప్రేమ వల్ల పిచ్చుక ప్రకృతికి చేరువ అవ్వాలి అని ఆశిస్తున్నాను.


Rate this content
Log in

Similar telugu story from Romance