నాలోని సంఘర్షణ
నాలోని సంఘర్షణ
ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో ఎవరినొకరిని చూసి స్ఫూర్తి చెందుతారు.అది జీవితాన్నే మలిచే విధంగా లేదా తనలో ఏదొక మార్పు వచ్చేలా చేస్తుంది.అది ఏ విషయం అయిన అయ్యివుండవచ్చు.మూడు నెలలు తరవాత చూసిన నన్ను ,ఎలాంటి చలనం లేకుండా , ఒక వ్యర్థంల ఉన్న నాకు తన కంటిపాప నాకు చూసే శక్తిని ఇచ్చి,తన శ్వాసను నాకు జీవంగా చేసి, తన భావాలను నాకు భాగాలుగా చేసి నన్ను తన ప్రేమకు ప్రతి రూపంగా చేసి నాకు రూపాన్ని ఇచ్చింది.తాన ప్రేమ ఎలాంటిది అంటే సృష్టిలో కేవలం తను మాత్రమే ఇవ్వగలిగే వ్యక్తి తను. స్వయంగా సృష్టే వచ్చి తన ప్రేమను వరంగా కోరుకుంది.తన మాటలు నాకు రక్షణగా, చివరకు తన కన్నీళ్లు కూడా నాకు మంచి జరగాలి అని వచ్చినవై.ఎంత మధురం కదా ?తేనీటిగాలకు కూడా అందని మధురం ఆ ప్రేమ.సముద్రాలకు
కూడా నేను ఎప్పటికైనా ఇంకిపోతానేమో అన్న అనుమానం వస్తుందేమో కానీ ఆ ప్రేమకు మాత్రం అలాంటి అనుమానం కూడా రాదు ఎందుకంటే అది అనంతం,హద్దులు లేనిది,అంతం లేనిది,ఆకాశాన్ని వస్త్రముగా , సూర్యచంద్రులను నుదిటికి అలంకరించకుని, పంచభూతాలను తన చీర అంచులుగా చేసికొని, తాను సమస్తం తానై ఉన్నప్పుడు చూడటానికి తన ప్రేమను పొందడానికి ఎన్ని జన్మలు అయిన సరిపోదు అని అనిపించింది.తనై మా మాతృదేవతా.మా అమ్మ.తనను చూసి నేను స్ఫూర్తి చెందుతాను ఎందుకంటే ప్రతి స్త్రీలోని మా అమ్మను చూసుకుంటాను.తను నాకు సంస్కారం , గౌరవాన్ని, పద్ధతలు ,గ్రంథ ఆచరణ ,సంస్కృతి అన్నిటి గురువు స్థానంలో ఉండి నేర్పించింది.అందుకే తను అంటే నాకు స్ఫూర్తి.
విజయ్ భార్గవి.