VIJAY KUMAR

Tragedy Inspirational

3  

VIJAY KUMAR

Tragedy Inspirational

వియోగం

వియోగం

6 mins
211


అందరికీ అన్ని అంత సులువుగా ఏమి వారి వారి జీవితంలో కి రావు ప్రతి క్షణం ఒక వరంగా దొరికిందే. సత్యవిజ అనే ఊరిలో భానుక అను ఒక కాలువ ఉండేది. చాలా అందమైన సరస్సు గా పేరుపొందింది. ఆ కాలువలో జీవించే జీవులకు అది ఒక సముద్రం లాంటిది. ఐతే అందులో ఒక కుటుంబం నివసిస్తుంది.ఆ కుటుంబం లో మొత్తం నలుగురు ఉన్నారు ఆ నలుగురు నాలుగు చేపలు. అవి చాలా కాలంగా అక్కడే జీవిస్తున్నాయి, అది చాలా అందమైన కుటుంబం కూడా. భార్య భర్త అలాగే ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. ఆ కుటుంబ యజమాని వేటకువెల్లి భార్య పిల్లలకి కావలసిన ఆహారం తీసుకుని వచ్చి సంతోషంగా పిల్లలతో కాలం గడిపి వేకువ అవ్వగానే నిద్రపోవటం మళ్ళీ తెల్లవారి జామున లేచి వేటకు వెళ్లి ఆహారం తీసుకుని రావటం ఇలా ఆనందంగా ఉండేవారు. జయము అనే చేప యజమాని సత్యము అనే చేప తన భార్య ముని అలాగే అనంత వారి కుమారుడు మరియు కుమార్తె. చాల ప్రశాంతంగా కొనసాగుతున్న జీవనం వాళ్ళది. సత్యము అనే చేప చాల అందమైనది ఎంతయు అంటే ప్రపంచం ఒక్కసారిగా తన అందం చూసి ఆగును మన్మధుడు కూడా వసమగును. సత్యము చేపకు ప్రకృతి అంటే ప్రాణం ఆ ఇష్టంతో కాలువ చుట్టూ రోజు తిరుగుతూ ఉంటుంది. ఆ కాలువలోనే ఒక కలువ పువ్వు జీవిస్తుంది, ఆ కలువ పువ్వు ఉదయమున నిద్రపోయి రాత్రివేళ మెలకువగా ఉండి ఆ కాలువను సందర్శిస్తూ ఉండేది. రాత్రి చేపలు నిద్రపోవును, ఉదయమున కలువ నిద్రపోవును. ఇలా జరుగుతున్న సమయమున కలువ ఒక పున్నమి రాత్రి చంద్రునితో ఇలా అంటుంది - చంద్ర దేవ రాత్రి యందు నన్ను మెలకువగా ఉంచటం ఏమి అయిన కారణం ఉందా అని కలువ చంద్రుని ప్రశ్నించగా ఆ ప్రశ్నకు సమాధానము ఇవ్వకపోగా చంద్రుడు అక్కడిని నుండి వెళ్ళిపోయారు ఆ కలువ ఎంత పిలిచినా రాలేదు. అల వేచి చూస్తున్న కలువ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. కొన్ని రోజుల తర్వాత నిద్ర లేచిన కలువకి ఆశ్చర్యం కలిగింది. ఎందుకు అంటే తాను నిద్ర లేవవలసిన సమయం రాత్రివేళ ఐతే కలువ నిద్ర లేచిన సమయం ఉదయం వేళ. ఇలా ఎలా, ఎందుకు జరిగింది అని అడుగుటకు చంద్రుణ్ణి కలువ పిలువగా చంద్రు దేవుని యందు ఎలాంటి సమాధానము లేదు.అల చాల రోజులు గడిచాయి, పగలు నిద్ర లేవటం వలన కలువ పువ్వు కి ఆ కాలువ కొత్తగా పరిచయం అయింది. ఆ కలువ పువ్వు కి కోరిక కలిగింది ఆ కాలువ చుట్టూ తిరుగుతూ పాటలు కూడా పాడుకుంటూ రోజు అంత గడపాలి అని. అల సగం కాలువ చుట్టూ తిరిగే సరికి తనకి సత్యము అనే చేప ఎదురు అయింది. ఐతే కలువ పువ్వు కి బెట్టుచెయ్యటం అలవాటు అందువల్ల కలువ పువ్వు సత్యమును చూసి చూడని విధముగా తిరిగి వెళ్ళిపోయింది, ఇది అంత సత్యము గమనిoచసాగింది. ఆ తర్వాత రోజు నిద్ర లేచిన కలువ పువ్వు కి ఆ సత్యము యొక్క రూపము కనుపాపల యందు ప్రత్తేక్షము అయింది, ఆ రూపమును ఒక్క సారి చూడాలి అన్న కోరగా మనస్సు నందు కలిగింది. ఆ కోరికతో సత్యమును చూడటానికి వెళ్ళిన కలువ పువ్వు కి సత్యము చేప తారసపడినది, కలువ పువ్వు కి ఒక విభిన్నమైన అనుభూతి తనలో ఎన్నడూ కలగని మానసిక భావప్రాప్తి కలువ పువ్వు కి కలిగింది. సత్యము జ్ఞానం విజ్ఞానం సంస్కారం సంస్కృతి తెలిసిన చేప. కలువ పువ్వు కి కలిగిన భావాలను సత్యము అను చేపకు అర్థం అయింది. ఐతే కలువ పువ్వు ఆ భావాలను వెక్తపరచలేదు. కానీ సత్యము చేపకు తెలుసు. ఒకరోజు కలువ పువ్వు సత్యము అను చేప వద్దకి ధైర్యం చేసి వెళ్లి మాట్లాడింది. ఐతే సత్యము కన్నెత్తి చూడలేదు. ఎందుకు అంటే మొదటిసారి కలువ పువ్వు కూడా చూసి చూడకుండా వెళ్లిన విషమై సత్యము చేప చూడలేదు పట్టించుకోలేదు దానికి అలిగి వెళ్ళిన కలువ పువ్వు తోరగ నిద్రపోయింది. మరుసటి రోజు నిద్ర లేచి చూడగా సత్యము అను చేప ఆ కలువ పువ్వు చుట్టు తిరుగుతుంది. అది గమనించిన కలువ పువ్వు కనులను తెరవకుండా నిద్ర నటిస్తుంది ఈ విషయం తెలిసిన సత్యము చేప కలువ పువ్వు దగ్గరకు వెళ్లి మీరు నటించ వద్దు నాకు తెలుసు మీరు నిద్ర పోవటం లేదు అని మూసి మూసి నవ్వులతో సత్యము చేప ఆ కలువ పువ్వు చుట్టూ తిరుగుతూ నవ్వుతూనే సిగ్గుపడింది చలు ఇక నిద్ర లేవండి అనే మాటలకు కలువ పువ్వు నిద్ర లేచి తనని ఒక్కసారిగా అంత దగ్గరగా చుసినందున కలువ పువ్వు కి మాటలు కరువైపోయాయి. అది చూసిన చేప నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి నవ్వుతూ ఒక కొత్త ఆనందాన్ని పరిచయం చేసి వేళ్లి పోయింది. ఆ కలువ పువ్వు కి ఏమియు అర్థం కాక ఆ రోజు అంత నిద్రపోలేదు. చంద్ర దేవుని చేసిన మాయవలన వాళ్ళు ఇద్దరు గొప్ప స్నేహితులు అయ్యారు. ఆ కలువ పువ్వు సత్యము చేపను ఆరాధించటం ఆరంభం చేసింది అది నచ్చని చంద్రునికి కోపం వచ్చి ఆ కలువ పువ్వును చూడటానికి దాదాపు కొన్ని రోజులు పాటు రాలేదు అయిన చంద్రుని కోసం వేచి చూడటం మానేసి సత్యము చేప కోసం వేచి ఉండటం మొదలుపెట్టింది కలువ పువ్వు. అలా ఒకరి పట్ల ఒకరు ఆకర్షణ అయ్యారు అల చాల కాలం గడిచే కొలది సత్యము మరియు కలువ పువ్వు ఆత్మ బంధువులు అయ్యారు.  ఇద్దరు ఒకరిఒకరు సహాయము చేసుకుంటూ చాల కాలం గడిపారు వారి ఇద్దరి మధ్య చిన్న చిన్న అలకలు, గొడవలు, కోపాలు, ప్రేమ ఇలా అన్ని భావాలు ఒకరి పట్ల ఒకరికి ఉండేవి. ఐతే సత్యము చేప ఎప్పుడు అలక చేసిన కలువ పువ్వు వెళ్లి బ్రతిమలాడి క్షమాపణ చెప్తే కానీ తిరిగే మాట్లాడేది కాదు, తన చిరునవ్వు అంటే కలువ పువ్వు కి చంద్రుని కిరణం లాంటిది. అలా ఒకరికి ఒకరు తెలియకుండా ఆత్మ భందాన్ని ఇరువురి పట్ల ఏర్పరుచుకున్నారు. కలువ పువ్వు తన రెండు పత్రముల చే కొంత ఆహారం అలాగే కాలువ లో దొరికే వాటిని సత్యము చేపకు కానుకగా ఇచేది. కలువ పువ్వు కి చంద్రుని అవసరం లేకుండా పోయింది, ఎందుకుంటే  సత్యము చేప చూపే ప్రేమ అభిమానము జగృతఃకు తన యొక్క చిరునవ్వుకు కలువ పువ్వు ప్రేమ భానిస ఐపోయింది. ఈ విషయం తెల్సుకున్న చంద్రుడు కలువ పువ్వు కి శాపము ఇచ్చాడు. ఆ శాపము వలన కలువ పువ్వు కి సత్యము చేప యందు ప్రేమ కలిగింది. ఆ ప్రేమ ఇరువురికి మంచిది కాదు అని కలువ పువ్వు కి తెలుసు, అయిన కలువ పువ్వు తన భావాలు సత్యము చేప తో పంచుకోలేదు ఆ భావాలను అర్థం చేసుకున్న సత్యము చేప కలువ పువ్వు తో ఇంకా నన్ను చూడటానికి అలాగే మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యకు అని హఠాత్తుగా చెప్పి వెళ్ళిపోయింది. అలా వెళ్లి పోయినా సత్యము చేప మాటలకు గౌరము ఇచి చాల కాలం తన వద్దకు వెళ్ళలేదు అలానే సత్యము చేప కలువ పువ్వు వద్దకు వెళ్ళలేదు. కలువ పువ్వు కి సత్యము చేప మనస్సు యందు కొలువై ఉండటం వలన తాను బుజిస్తే కానీ కలువ పువ్వు ఏమి తినేది కాదు ఎందు వలన అంటే కలువ పువ్వు సత్యము చేప ను దేవతల ఆరాధన చేసేది కలువ పువ్వు దృష్టిలో తనకి నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని కలువ పువ్వు ప్రసాదంగా తన ఆకలిని తీర్చుకునేది. అది అలవాటుగా మారిని కలువ పువ్వు కి సత్యము చేప వదిలి వెళ్లిన తర్వాత ఎలా జీవించాలో మర్చిపోయి జీవించి ఉన్న చనిపోయిన కదలిక లేని వస్తువులే శిలల మారిపోయింది. సత్యము చేప మరియు చంద్రుడు కలువ పువ్వు ని చూడటానికి దాదాపు కొన్ని సంత్సరకాలంగా రాలేదు ఒక పక్కన చంద్రుడు ఇంకో పక్క సత్యము ఇద్దరు దూరం అయిన కలువ పువ్వు కి ఏమి చెయ్యాలో తెలియక కాలము గడుపుతున్న సమయమున ఉన్నపలముగా ఉరుములు మెరుపులతో కుండపాయిన వర్షం ఆ కాలువను చుట్టూ ముట్టి కాలువలో జీవిస్తున్న జీవుల ప్రాణాలను తీస్తుంది. ఆ భయం కరమైన ప్రకంపనలు అలానే సత్యము చేప పడుతున్న వేదనకు శిల స్థితిలో ఉన్న కలువ పువ్వు లేచి జరుగుతున్న సంఘటనలు కలువ పువ్వు చూసిన కలువ పువ్వు మనస్సు యందు బయము, ఆందోళన, భాద, కోపము, ఆవేదన, ఇలా ఆ కలువ పువ్వు నందు విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఏమి జరిగినా సరే తన ప్రాణములు లెక్కచెయ్యకుండా సత్యము చేప ఉండే ప్రదేశానిక వెళ్ళింది అక్కడ జరుగుతున్న సంఘటన చూసి కలువ పువ్వు కి ప్రాణం పోయినంత పనైంది. అప్పటికే ఉరుములు మెరుపుల భయం కరమైన వర్షం వలన గాయములపాలు అయ్యి చావు బ్రతుకుల మధ్య ఉన్న సత్యము చేపను చూసి కంటతడి కలువ పువ్వు నందు ఆగలేదు ఒక్కసారిగా మనస్సు లో ఉప్పెన లాంటి అలజడి మొదలయ్యింది, ఆ కంటతడితోనే ఆ కలువ పువ్వు సత్యము చేప ను తన యధకు హత్తుకుని గుండె పగిలేలా కన్నీళ్లు ఆగకుండా ఏడుస్తుంది ఎంతలా అంటే ఆ కంటతడి వరదల మొదలై ఉప్పెనలా మరిపొంది. ఆ భాధతోనే కలువ పువ్వు సత్యము చేప వద్దకు వెళ్ళింది, ఆ స్థితిలో సత్యము చేపను చేసి కలువ పువ్వు ప్రాణం కృంగిపోయింది. ఎలా అయిన తనని కాపాడాలని భావించింది, చంద్రునికై ప్రార్ధించింది ఆ కలువ పువ్వు ప్రార్థన విన్న చంద్రుడు వచ్చి తనకి ప్రాణాలను వరంగా ఇవ్వలేను ఐతే నిలో ఉన్న తేజస్సును సత్యము చేప నందు ప్రవేసిపం చేస్తాను నీ తేజస్సు వలన మరల తాను జీవించగలదు అని చెప్పి ఐతే నీ ప్రాణమునకు ప్రమాదం అని చెప్పి చంద్రుడు కలువ పువ్వు నీ హెచ్చరించాడు. చంద్రుడి మాటలు వినకుండా కలువ పువ్వు యొక్క తేజస్సును సత్యము చేప నందు ప్రవేశింప చేసింది సత్యము ప్రాణాలను పొందింది, కలువ పువ్వు ప్రణలు పరమాత్మ యందు విలీనం అయిపోయింది. అది చూసిన సత్యము చేప కలువ పువ్వు చేసిన త్యాగము యందు కృతజ్ఞత భావంతో, ఎన్నటికీ తీర్చలేని వియోగం లో ఉండిపోయింది. చంద్రుడు అప్పుడు చెప్పాడు సృష్టిలో ఏ జీవి అయిన కారణం లేకుండా మరొక జీవి తో పరిచయం కూడా కలుగదు అలానే ఎలా జీవించాలి జీవి యొక్క అర్థం ముందుగానే ప్రకృతి ముందే నిర్ణయం తీసుకుంటుంది అందుకే నీవు కేవలం రాత్రి యందు నా చంద్ర కిరణాలను జీవముగా తీసుకుని జీవించేలా నికు ప్రకృతి వరంగా ఇచ్చింది ఐతే విదినే ఎదిరించి ప్రేమ అను కిరణాలను నా చంద్ర కిరణాలకు బదులుగా తీసుకున్నవు, అని ఆ నాడు కలువ పువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బదులు చెప్పారు. ప్రేమ  ఎన్నడూ త్యగమును కోరుకుంటుంది, ఎన్నడూ ప్రేమించిన వారు సుఖ సంతషాలతో జీవించాలి అని ఆరాటపడుతుంది. నిస్వార్థం కలిగిన ప్రేమ అల నిస్వార్థంగా ప్రేమించ కలిగే వక్తి మనకు దొరకటం అల దొరికిన వారితో జీవితాన్ని జీవించటం ప్రతి క్షణం ఒక వరం లాంటిది. ఇందులో ఎవరు అదృష్టం కలిగిన వారు అంటే అది కేవలం ప్రేమ, వారి ఇరువురి ఆత్మలనే చెప్పాలి ఎందుకు అంటే కలువ పువ్వు కి సత్యము చేప తో కానీ సత్యము చేప తో కలువ పువ్వు కి కానీ కలిసి జీవించే అవకాశం లేదు ఐతే ఇరువురి ప్రేమ మరియు ఆత్మలు ఎన్నటికీ అయిన ఎన్ని జన్మలకు అయిన విడిపోని వారిగా ప్రకృతి యందు జీవించి ఉంటారు. సృష్టి యందు ఏదియు కూడా కారణము లేకుండా జరగదు, ప్రతి త్యాగము దాని వెనుక ఉన్న వియోగం యొక్క అర్థం, పరమార్థం ఎప్పుడు నిక్షిప్తమై ఉంటాయి. 


Rate this content
Log in

Similar telugu story from Tragedy