చిన్న కోరిక...
చిన్న కోరిక...


ఆశగా చిగురిస్తున్న కలువ పువ్వు తనకు తెలియకుండా తనను తాగుతున్న చంద్రుడి చిరు కిరణాలను చూసి ఎంతో సంతోషంగా ఉంది.ఐతే అలా ఆ కిరణాలను తీసుకుని వికసించింది ఎంత గా అంటే తనని తాను మరిచెంతగా.అలా కొన్ని రోజులు గడిచాయి వాటి మధ్య కాలంలో ఎన్నడూ లేని కొత్త సంఘటనా ఒకటి జరిగింది.కలువ పువ్వు ఎప్పుడు లేని విధంగా ఆ కిరణలతో ఇలా అడిగింది నువ్వు అందరికి ఒకలనే నీ కిరణాలను ఇస్తావు కదా కానీ నాకు మాత్రమే నువ్వు కావాలని అనిపిస్తుంది కారణం తెలియటం లేదు నిన్ను మారువటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న నావల్ల కావటం లెదు దీని నుండి బయటకు రావడానికి మీరు సహాయం చెయ్యాలి అని అడిగింది, ఐతే దానికి బదులుగా చంద్రుడు కిరణాలు ఇలా చెప్పాయి నువ్వు ఆశ పడటం తప్పు కాదు నీకు మాత్రమే నేను చెందాలి అని అనుకోవడం తప్పు కనుక నా స్నేహాన్ని నువ్వు అపార్ధం చేసుకోకు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ క్షణం వెళ్లినవి కలువ మరణం తరువాత కూడా రాలేదు