అమ్మ గెలుపు
అమ్మ గెలుపు
తాను ప్రతి విషయం లోనూ సర్దుకుని పోవటం అలవాటు అని అందరూ అభిప్రాయ పడుతుంటారు.
ఐతే ఎవరికి అర్థం కాని విషయం ఏమిటి అంటే తాను గెలవాలి అని ఎ విషయంలోనూ అనుకోదు, గెలిపించాలని అని మాత్రమే భావిస్తుంది. కేవలం అందుకోసమే తాను అమ్మ అవ్వలేదు తన కోసం కన్న తనవాల్లకోసం అన్నిటినీ వదులు కుంటుంది, ఆ పని తనకి తెలిసే చేస్తుంది. తన కోసం తాను చేసే పనిలో స్వర్థం ఉంటుంది ఐతే తనకు తెలిసి తన వాళ్ల కోసం అన్ని వదులుకునే వారిలో అమ్మ మొదటిగా ఉంటుంది. అలాంటి ఒక చిన్న సంఘటన చెప్పాలి అని ఇలా నా ప్రయత్నం. ఎప్పటిలా అమ్మ తన కుమారుడు కలసి ప్రయాణిస్తున్నారు ఎప్పుడు సరదాగా ఉండేవారు ఒక సారి వాళ్ల ఇద్దరి మధ్య చిన పోటీ పెట్టుకున్నారు వారు చేరుకోవాల్సిన ప్రదేశానికి ముందుగా వెళ్లినట్లు ఐతే అమ్మ కుమారుడికి చిన్న బహుమానం ఇస్తాను అని చెప్పింది ఐతే ఆలస్యం గ మనం వెళ్లినట్లు ఐతే కుమారుడు అమ్మ కు బహుమానం ఇస్తాను అని ఒకరిఒకరు పోటీ పెట్టుకున్నారు. చేరవలసిన సమయం అవుతున్న కొద్దీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా గొప్పగా ఉంటుంది ఎందుకని అంటే అమ్మ తన కుమారుడికి ఎలా ఉండాలి, సమయమును ఎలా అంచనా వెయ్యాలి, సమయమునకు మనం మన పనులను ఎలా పూర్తి చెయ్యాలి, ఇతరుల పట్ల మనం ఎంత భాధ్యత గ ఉండాలి అని తన కుమారుడికి పోటీ ద్వారా అన్ని విషయలు బోదించ్చటం ఆరంభం చేసింది అమ్మ ఇలా మాటల మధ్యలో వాళ్ళు చేరవలసిన సమయం కన్న ఎక్కువ సమయం అయింది ఐతే పోటీ ప్రకారం కుమారుడు గెలిచాడు అమ్మ చక్కని బహుమానం కూడా ఇచ్చింది.అల్ రెండు రోజులు గడిచాక కుమారుడికి అర్థం అయింది తాను గెలవలేదు అమ్మ గెలిపించినది అని,అల అర్థం అయిన క్షణo నుండి అమ్మ తన మొదటి గురువు గ భావించి అమ్మ దగ్గర ఎంతో సామర్థ్యాన్ని సంపాదించాడు కుమారుడు. తను ప్రయాణం చేసిన అతి కొద్ది సమయంలో కుమారుడు నేర్చకున్న జ్ఞానం ఎంత ఉన్నత స్థాయిని ఇచింది అంటే తన ఓటమిని కూడా గెలుపుగా మర్చు కున్నడు.
