ఒక కన్నీటి కధ...
ఒక కన్నీటి కధ...


ఐతే తాను కోరుకుంటున్నట్లు విజయాన్ని సొంతం చేసుకున్న క్షణం అది. అప్పుడు తన కళ్లలో నుండి కన్నీరు బయటకు వచ్చిన సమయం అది.సృష్టిలో ప్రతి జీవరాశి కూడా కంటతడి పెట్టాల్స్నేదే.ఐతే ఆ కన్నీరు కి కూడా ఒక కథ ఉంది మరి.అందరికి పేర్లు ఉన్నాయి తనకి ఓ పెరు ఉంది అదే "శ్రీసత్య"(కన్నీరు).తన మాటల్లో తన భాద ఏమిటో విందం మరి.నా పేరు శ్రీసత్య అందరిలాగే నాకు కూడా భావాలు,సంతోసం, ఆనందం,భాద,దుఃఖం,కష్టం,అన్ని ఉన్నాయి.ఐతే నేను ఉండేది కలల ప్రపంచం, అక్కడ కన్నీళ్లు అనే ఊరి ఉంది.నేను అక్కడే ఉంటాను.నేను ఏమైన సాధించాలి అని అనుకుంటూ ఉండేదాన్ని ఐతే ఒక్కసారిగా నాలో ఒక ఆలోచన అది నాకంటూ ఒక జీవితం ఉండాలి అని, ఎందుకు అంటె మా కలల ప్రపంచం అసలు ఉన్నది మనిషి కళ్ళల్లో కదా!అందుకే మా జీవిత కాలం చాలా తక్కువ,అప్పటికే నాకు ఇరవే నాలుగు ఏళ్ళు,బాల్యం అంత ఎలా గడిచిందో కూడా గుర్తులేదు.కానీ ఒకరోజు నేను కళ్ళల్లో నుండి కన్నీరు గా బయటకు వెళుతున్న క్షణం అది అప్పుడు నా ఇరవే నాలుగు సంవత్సరాల జీవితం కనబడింది.అసలు నేను ఏమి చేసాను అనే ప్రశ్న వచ్చింది నా గతం నాకు తెలుస్తోంది మా జీవితాలు ఎప్పుడు మా చేతుల్లో ఉండవు ఎందుకు అంటె ఈ మన్సులు ఎందుకు,ఎప్పుడు కారణాలు లేకుండా ఏడుస్తూ ఉంటారు అమ్మ తిట్టింది,నాన్న కొట్టాడు,స్నేహితులు నాతో మాట్లాడటం లేదు,ప్రేమించిన వాళ్ళు దూరం పెట్టారు,అని కారణం లేకుండా ఏడుస్తారు,మమ్మల్ని కూడా ఎడిపిస్తారు.కావలసినది దక్కలేదు అని,అనుకున్నది ఆలస్యం అయింది అని, బాధపడుతూ జీవిస్తుంటారు.నా జీవితం అంత నన్ను నేను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేసాను.అవి తలచుకుంటూ ఏడుస్తూనే సగం జీవితం గడిపాను.నాకు విలువ ఉంది అది ఎంతగా అంటే ఎవరు ఉహించని అంతగా కానీ ఈ మన్సులు చిన్న,పెద్ద,అసలు కారణం లేకుండా ఏడుస్తూ మాకు ఉన్న విలువను పొగడుతున్నారు.ఐతే ఏ రోజు ఎవరిని భాద పెట్టలేదు.చెప్పలేని ప్రేమ,చూపించలేని ఆత్మాభిమానం, గౌరవం, స్వచ్ఛగా ఉండే హక్కును ఇచ్చినప్పుడు,అంకితభావంతో ఉన్న ఆ క్షణం లో మీరు చెప్పలేనిది మా కన్నీటి ధ్వార చెప్తారు.ఐతే దాని విలువను తీస్తున్నారు.ఐతే నేను అలాంటి భావాలు కలిగిన సమాజాన్ని సాధించాలి అని అనుకున్నాను సాధించాను.ఆ క్షణలను అనుభవిస్తున్న తరుణంలో నా జీవితం కన్నీటి గా కరిగిపోయింది.
నీతి :- ప్రతి కన్నీటి కి ప్రత్యేకమైన విలువ ఉంటుంది దయచేసి చిన్న చిన్న కారణాలకు ఆ కన్నీటి విలువను ప్రశ్నించవద్దు.