మురిపించే జ్ఞాపకాలు
మురిపించే జ్ఞాపకాలు
రవి, శివ మంచి స్నేహితులు. వారిద్దరూ తమ ఊరికి దగ్గర్లో వున్నా ఒక మంచి కాలేజీలో చదువుతుంటారు. ప్రతిరోజు సాయంత్రం కాలేజీ అవ్వగానే రెడీ అయ్యి ఆ ఊరిలో ఉన్న సరస్సు ఒడ్డున కూర్చొని కబుర్లు చెప్పులుంటారు. వారి చిన్నతనంలో చేసిన అల్లరి పనులు, అందమైన జ్ఞాపకాలు, నవ్వించే చిలిపి పనులు, ఇవన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఆ సరస్సు ఒడ్డున ఆకాశంలో ఎగిరే పక్షులు, అందమైన నీలి మేఘాలు ఇవన్నీ వారి మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయి. అయితే ఆ సరస్సు ఒద్దు దగ్గరే ఒక మిర్చి బజ్జి బండి ఉంటుంది. వారిద్దరూ ఆ బండి దగ్గర మిర్చి బజ్జి కొనుక్కోని తింటూ వుంటారు. ఒకరోజు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రవి శివని ఇలా అడుగుతాడు. శివ! పడవ తరగతి పబ్లిక్ పరీక్షల ముందు నీ సైన్స్ నోట్స్ పోయింది అన్నావ్ మరి, ఆ పరీక్షలో నీకు నూటికి నూరు మార్కులు ఎలా వచ్చాయి అని అడుగుతాడు. అప్పుడు శివ ఇలా చెబుతాడు. నేను ఆరోజు క్లాస్ మధ్యలో మంచినీళ్లు త్రాగడానికి స్కూలు వదిలే పది నిముషాల ముందు బయటకి వెళ్ళాను. మరల తిరిగి వచ్చేసరికి నా బ్యాగులో ఉండాల్సిన సైన్స్ నోట్స్ కనిపించలేదు. క్లాస్ మొత్తం వెతికాను ఎక్కడ దొరకలేదు. మరుసటి రోజే సైన్స్ పబ్లిక్ పరీక్ష నాకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. కానీ స్కూలు టైం అయ్యాక అందరు వెళ్ళిపోతున్నపుడు మహేష్ నా వైపు నవ్వుతు వెనితగా చూసాడు. వాడి కళ్ళలో ఏదో సాదించాన్న ఆనందం, తప్పు చేశానన్న భయం కనిపించాయి. అప్పుడు అర్ధమైంది వాడి దగ్గరే నా పుస్తకం ఉందని వాడు బస్సు ఎక్కాక నేను బస్సు ఎక్కాను. ఒక చోట బస్సు సడన్ బ్రేక్ పడగానే వాడి బ్యాగులోని పుస్తకాలు అన్ని క్రింద పడ్డాయి. నా పుస్తకం సరిగ్గా నా కాళ్ళ దగ్గర పడింది. అప్పుడు ఆ పుస్తకాన్ని నేను వాడికి కనపడకుండా తీసుకుని నా బ్యాగులో పెట్టుకొని ఇంటి దగ్గర బస్సు దిగిపోయాను. అప్పుడు పరీక్షకు బాగా చదివి తరువాతి రోజు పరీక్ష బాగా రాసాను. పరీక్ష రాసిన తరువాత రాజేష్ కలిసాడు. పరీక్ష అంత బాగా రాయలేదని చెప్పాడు. నేను అందరు చెప్పే మాటలే చెప్తున్నాడు అనుకున్నాను. కానీ పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత నాకు స్కూల్ మొదటి ర్యాంకు వచ్చింది. వాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు. మరల సప్లిమెంటరీ పరీక్షలకు కట్టి రాసి పాసయ్యాడు. వాడికి మనలాగా మంచి కాలేజీలో సీటు రాలేదు అని చెబుతాడు. ఈ విషయం విన్న రవి ఇది తనకు ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. అప్పుడు శివ కొన్ని విషయాలకు కాలమే సమాధానం చెబుతుంది అని మంచి వారికి మంచి జరుగుతుందని ముంచేసేవారిని కాలమే ముంచేస్తుందని చెబుతాడు. ఈలోపల అక్కడకు పోస్టుమాన్ వచ్చి శివకు ఒక ఉత్తరం ఇస్తాడు. ఆ ఉత్తరంలో తన చదివిన స్కూలు వార్షికోత్సవం సందర్బంగా స్కూలు ఫస్ట్ ర్యాంకు వచ్చిన తనని అవార్డు, మెడల్ అందుకోవడానికి రమ్మని అందులో వుంది. ఇది విన్న రవి శివని అభినందించాడు. రవికి శివ మిర్చి బండి దగ్గర ట్రీట్ ఇప్పించాడు. తరువాత ఇద్దరు కలిసి ఆనందంగా ఇంటికి బయలుదేరారు.

