నిజమైన స్నేహం
నిజమైన స్నేహం
ఒక ఊరిలో రవి, కమల్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. కమల్ తండ్రి ఒక బస్సు కండక్టర్. రవి తండ్రి ఒక బైక్ మెకానిక్. రవి కమల్ ఒకే డిగ్రీ కాలేజీలో చదువుతుంటారు. ఒకరోజు కమల్ తండ్రికి విపరీతమైన గుండెపోటు వస్తుంది. అతన్ని హాస్పిటల్లో అతని తోటి ఉద్యోగులు చేర్పిస్తారు. ఈ విషయం కమల్ కి తెలియదు. అతను కాలేజీలో ఉంటాడు ఈలోపు కాలేజీవారికి సమాచారం అందుతుంది వాళ్ళు ఈ విషయం కమల్ కి చెబుతారు. కమల్ వెంటనే హాస్పిటల్ కి చేరుకొని తన అమ్మ, చెల్లెలితో మాట్లాడతాడు. రవి ఆ రోజు కాలేజీకి రాడు. ఏదో పని ఉందని వేరే ఊరు వెళ్తాడు. ఈ విషయం రవి కి తెలియదు. హాస్పిటల్ వారు తన తండ్రి గుండెకి ఆపరేషన్ చెయ్యాలని దానికి చాలా ఖర్చు అవుతుందని చెబుతారు. కమల్ వెంటనే ఇంటికి బయలుదేరి డబ్బు తీసుకొస్తుండగా అతన్ని మధ్యలో ఒక దోపిడీ ఆపి కమల్ ని కొట్టి దాడి చేసి ఆ డబ్బుని ఒక బైక్ పైన పట్టుకుని పారిపోతారు. ఈ విషయం రవికి తెలుస్తుంది. రవి కమల్ కి డబ్బు ఇచ్చి సహాయం చేస్తాడు. అప్పుడు కమల్ తండ్రికి ఆపరేషన్ జరుగుతుంది అతను కోలుకుంటాడు. రవి, కమల్ కి ఈ దోపిడీ విషయాన్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దాం అని అంటాడు. ఆ పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా పని చేసేది తన స్నేహితుడు నాని యొక్క అన్నయ్య కేశవ్ అని రవి కమల్ కి చెబుతాడు. కేశవ్ కి రవి, కమల్ లు ఈ దోపిడీ విషయం చెబుతారు. ఒకరోజు రవి తండ్రి మెకానిక్ షాపుకి ఒక బైక్ రిపేరుకి వస్తుంది. అదేంటంటే ఆ దోపిడీదారులు పారిపోతున్న సమయంలో కమల్ ఆ బండి చివరి నంబరు 663 గా చూశానని చెబుతాడు. రవి షాపుకి వచ్చిన ఆ బండి నంబరు కూడా చివర్లో 663 గా వుంది. బండిని తీసుకువచ్చిన వ్యక్తి కూడా కొంచెం మోరటుగా ఉన్నాడు. రవి వెంటనే కమల్ కి, నాని కి ఫోన్ చేసి రమ్మంటాడు వాళ్ళు వచ్చేసరికి అతను పని ఉందని అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోతాడు. రవి, కమల్, నాని లు కలిసివాడిని వెతికే పనిలో పడతారు అప్పుడు వాడు ఒక గోడౌన్ దగ్గర దొరుకుతాడు వాడిని వెంటనే పట్టుకుని కేశవ్ కి సమాచారం అందిస్తారు. అప్పుడు కేశవ్ అక్కడికి వస్తాడు. దొరికిన వాడిని ఆ బ్యాచ్ ఎక్కడ ఉందొ చూపించమని తీసుకెళతారు. అక్కడ ఆ బ్యాచ్ మొత్తం పోలీస్ లకు చిక్కుతారు. కమల్ డబ్బు దొరుకుతుంది. అదే క్షణం ఒక కిడ్నాప్ అయ్యిన ఒక అమ్మాయి కూడా వారికి దొరుకుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు గత కొన్ని రోజులు కనిపించకుండపోయిన ఆ సిటీ మేయర్ గారి అమ్మాయి. ఆ అమ్మాయిని విడిపిస్తారు.పోలీస్ లు రవిని, కమల్ ని అభినందిస్తారు. రవి, కమల్ తెలివితేటలకు మెచ్చి వారికి బహుమతులు అందజేస్తారు
