ఏలియన్ ఫ్రెండ్
ఏలియన్ ఫ్రెండ్
ఒక ఊరిలో బన్నీ అనే కుర్రాడు వున్నాడు. అతనికి ఏలియన్స్ అంటే చాలా ఆసక్తి అయితే అతనికి జాన్ అనే స్నేహితుడు ఉంటాడు. ఇద్దరు కలిసి ఎలియెన్స్ పుస్తకాలు, సినిమాలు, చూసేవారు. వీరిద్దరూ కలిసి ఏలియన్ సిగ్నల్స్ ని కనిపెట్టే ఒక వస్తువుని తయారు చేస్తారు. దాని ద్వారా విశ్వం నుండి ఏవైనా ఏలియన్ సిగ్నల్స్ వచ్చినప్పుడు అది కనిపెడతుంది. ఒకసారి ఒక అడవిలో వచ్చినట్టు ఆ వస్తువు కనిపెట్టి సిగ్నల్స్ ఇస్తుంది. అది రాత్రి సమయం బన్నీ చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే జాన్ ఇంటికి వెళతాడు. అక్కడి నుండి ఇద్దరు ఆ అడవి వైపు పరిగెడతారు. అక్కడ ఒక చెట్టు చాటు నుండి ఒక ఎలియాన్ స్పేస్ షిప్ క్రిందకు దిగడం గమనిస్తుంటారు. అప్పుడే అక్కడికి మిలిటరీ వాళ్ళు రావడంతో ఆ ఏలియన్ స్పేస్ షిప్ అక్కడి నుండి వెళ్లిపోతుంది.అప్పుడు ఒక ఎలియాన్ మాత్రం అక్కడే ఉండిపోతుంది. అది తప్పించుకోలేక అందులోనే ఉండిపోతుంది. బన్నీ, జాన్ లు బయపడి అక్కడి నుండి పారిపోతారు.మిలిటరీ వాళ్ళు అక్కడి ఎలియెన్స్ గుర్తులు సాంపిల్స్ కోసం వెతుకుతారు. బన్నీ, జాన్ లు కూడా ఆ మిలిటరీ వాళ్లకు తెలియకుండా ఆ గుహలోకి వెళతారు. ఆ ఏలియన్ ఆలా దాక్కుని బన్నీ, జాన్ లను చూస్తుంది. వారు దానికి ఎటువంటి హాని తలపెట్టము అని సైగ చేస్తారు. అది మెల్లగా వీరి దగ్గరకు వస్తుంది. వారు దానిని ఒక పాడుబడ్డ ఇంట్లో రహస్యంగా ఉంచుతారు. ఒకనాడు ఒకతను ఆ పాడుబడ్డ ఇంట్లో ఎదో ఉందని గమనించి వెంటనే అధికారులకు తెలియచేస్తాడు. అప్పుడు ఆ ఇంటికి అధికారులు వెంటనే వచ్చేస్తారు. ఈలోపులో బన్నీ, జాన్ లు ఈ విషయం తెలుసుకుని ఆ ఏలియన్ ని అక్కడి నుండి తప్పిస్తారు. చివరికి దానికి మరొక ప్రదేశానికి చేర్చి అక్కడ దానిని భద్రంగా ఉంచుతారు. అధికారులు అక్కడ ఏమి లేదు అని తెలిసి వెళ్లిపోతారు. అలా బన్నీ, జాన్ లు ఏలియన్ ని కాపాడతారు.
