STORYMIRROR

Venu K

Drama

4  

Venu K

Drama

పరిష్కారం...

పరిష్కారం...

1 min
531

ఒక రోజు నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చాను. నా బార్య నాకు టీ ఇచ్చింది. టీ లో పంచదార లేదు, ఈ విషయం నేను నా బార్య తో చెప్పాను. వెంటనే నా బార్య అంది "ఈ మధ్య మనం మాట్లాడుకుంటున్న మాటలు కూడా చప్ప బడుతున్నాయి". ఇది వినగానే నాకు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే టీ కప్పుని పగులకొటాను. మరుక్షణం నుంచి నరకం అనుభవించాను. ఇలా ఎందుకు జరిగింది అని తీవ్రంగా ఆలోచిస్తే నాకు అర్థమయింది ఏమిటంటే, నా భార్య మీద నాకు కోపం లేదు, నా పని ఒత్తిడి వల్ల నా లోపల విరోధ భావం పెరిగి ఉంది. అది కాస్త నా భార్య మీద ప్రయోగించడ జరిగింది. ఇక్కడ నేను నా ఉద్దేశ్యాన్ని అనుమానించ కుండా సామర్థ్యంలో లోపం ఉంది అనుకున్నాను. కాని నా భార్య గురించి ఆలోచించినపుడు, నన్ను ఉద్దేశపూర్వకంగా బాద పెట్టింది అని భావించాను. అందుకని టీ కప్పు పగులకొటాను. ఈ విషయం అర్థమైన వెంటనే నేను నా భార్యతో కుర్చుని మాట్లాడాను. తొందరగా నా సమస్యకు పరిష్కారం లభించింది. ఇప్పుడు ఈ విషయం ఎన్ని సార్లు గుర్తుకొచ్చినా నాకు సంతోషమే కలుగుతుంది. ఎందుకంటే నేను నా సమస్యని తొందరగా పరిష్కరించుకున్నాను. అయితే మనలో చాలా సమస్యలు ఉద్దేశాన్ని అనుమానించడం వల్ల వచ్చినవే. అవి పరిష్కరించుకుంటే మనం ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు.



Rate this content
Log in

Similar telugu story from Drama