Dinakar Reddy

Drama

3  

Dinakar Reddy

Drama

నిద్రగన్నేరు చెట్టు

నిద్రగన్నేరు చెట్టు

1 min
520


అమ్మా! నాన్నను నువ్వెప్పుడు పెళ్ళికి ముందు కలిశావా అని నా కూతురు అడిగింది.

పెళ్లి చూపుల వయసు వచ్చింది మా అమ్మాయి

ప్రణతికి.

ఏంటో అమ్మాయి గారికి ఇప్పుడు వాళ్ళ అమ్మ జ్ఞాపకాలతో పని అని కాస్త ఉడికించాను.

ప్రణతి అలిగింది.


అబ్బో ఎంత అలక.

అయినా ఇప్పుడున్నట్లు పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి కలిసి మాట్లాడుకోవడం అంత సులభం కాదే అన్నాను.


అప్పట్లో ఈ ఇంటి ఎదురుగా విశాలమైన స్థలం ఖాళీగా ఉండేది.

మీ నాన్న గారు పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళాక

ఓ రోజు నేను ఇంటి ముందున్న నిద్ర గన్నేరు చెట్టు

నీడలో కూర్చొని ఏదో నవల చదువుకుంటున్నా.


శ్రావణ మాసపు సాయంత్రం ఎప్పుడు పడదామా అన్నట్టు వర్షం ఎదురు చూస్తోంది.


మీ నాన్న గారు బూట్ కట్ ప్యాంటు వేసుకొని రంగు పూల చొక్కా జులపాల జుట్టుతో వచ్చారు.


నేనాయన్ని చూసి లేచి నిలబడ్డాను.

ఆయన నా చేతిలో ఉత్తరం ఉంచి తిరిగి చూడకుండా వెళ్లిపోయారు.ఎవరైనా చూస్తారని భయం కాబోలు.


ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముంది అని కుతూహలంగా అడిగింది ప్రణతి.


నేను లేచి లోపలికెళ్ళాను.

పాత ట్రంకు పెట్టె అటక మీద నుండి దింపాను.


చీరల మడతలో చేయి పెట్టి ఓ పోస్టు కార్డు ప్రణతి చేతిలో పెట్టాను.


ఆ పోస్టు కార్డు పైన ల్యామినేషన్ ఉండడం వల్ల చిరిగిపోలేదు.


నాకిప్పటికీ గుర్తు అందులో ఏముందో.


I like you.


ప్రణతి బయటికి చదివింది.


నేను ఇప్పుడే చిగుర్లు వేస్తున్న నిద్రగన్నేరు చెట్టును చూస్తూ నిలబడ్డాను.


Rate this content
Log in

Similar telugu story from Drama