మెడికల్ క్యాంపు
మెడికల్ క్యాంపు


చెప్పమ్మా మీ సమస్య ఏమిటి? పేరు ఇతర వివరాలు వ్రాసుకున్నాక ఏ సమస్యతో వచ్చారో వ్రాసుకొని దానికి తగిన డాక్టర్ దగ్గరకు పంపడం నాకు అప్పగించిన పని.
మా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు కాబట్టి అంతా మా వాళ్ళతో హడావిడిగా ఉంది.
ఇరవైల్లో ఉన్న ఒక తల్లి వచ్చి తన చిన్న పాప పేరు చెప్పింది.ఆ చిన్న పాపకు షుగర్.తల్లీ బిడ్డలిద్దరూ అదే సమస్యతో వచ్చారు.
తరువాత ఒకమ్మాయి యాక్సిడెంట్ అయిన కాలు సరిగ్గా వంగడం లేదని చూపించుకోవడానికి వచ్చింది.
ఒక్కోరిదీ ఒక్కో సమస్య.
రోజూ ఆఫీసులో కూర్చొని ప్రతి దాని గురించీ కంప్లయింట్ చేసే నాకు వాళ్ళ సమస్యలు చూశాక ఆ గుణం మార్చుకోవాలనిపించింది.