శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Drama

వృత్తిధర్మం

వృత్తిధర్మం

1 min
317


            వృత్తి ధర్మం

            -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


   టులెట్ బోర్డు కనబడగానే...టక్కున ఆగిపోయారు ఆ తల్లీ కూతురూ.

   

   ఇంటి ఓనరుతో మాట్లాడుకుని...ఆరోజే ఆఇంట్లో అద్దెకు దిగిపోయారు.

  

   వచ్చి నెల్లాళ్ళు గడిచింది. ఫస్టు రావడంతో ఇంటి ఓనరు సుబ్బారావు అద్దె డబ్బుకోసం ఇంటికొచ్చాడు. 

  

   "ఒసేయ్ కన్యాకుమారీ ఓనరు గారు వచ్చినట్టున్నారు చూడు" అంటూ కూతుర్ని పిలిచింది తల్లి.

  

   ఆ మాట వింటూనే...తెగ ఆనందపడిపోయాడు సుబ్బారావు. ఇంటి అద్దెతీసుకోవాలనే సాకుతో... ఆకన్యాకుమారిని పలకరించాలనే దగ్గర నుండి చూడాలనే కోరికతోనూ...మాటలు కలపాలని ఆశతో వచ్చాడు.

   

  తాము మేడ మీదుంటూ కిందన అద్దెకుండే ఆ తల్లీకూతుర్లను ప్రతిరోజూ చూడ్డం పరిపాటైపోయింది. కన్యాకుమారిని చూస్తే మాత్రం మనసంతా లాగేస్తూ ఉంటుంది. ఆమె బొడ్డుకిందకు కట్టే చీరకట్టు....వీపు సగభాగం వరకూ కనిపించే బిగుతైన రవికె....వయ్యారంగా నడిచే నడక హొయలూ... ఆమె ఓర చూపులు నెల్లాళ్ళుగా గమనిస్తూనే వున్నాడు. 

   

  పలకరిస్తే బాగుండదేమోనని...అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ అవకాశం ఈరోజు వచ్చింది.

   

  ఘల్లుఘల్లున గజ్జలు వినిపిస్తుంటే..లోపల నుంచి వచ్చేది కన్యాకుమారిగా పసిగట్టేసాడు.

   

  ఇంటి ఓనర్ని చూస్తూనే...చూపులతో పలకరించి... కొంటెగా నవ్వుతూ కుర్చీ చూపించింది. తానూ అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ పైట జార్చేసింది. 

  

  అనుకోని ఆచర్యకు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు ఇంటి ఓనరు సుబ్బారావు. 

  

  వచ్చిన కాసేపటికే కన్యాకుమారితో ఎంతో చనువేర్పడిపోయింది. అద్దె విషయం అడగటమే మర్చిపోయాడు.


  ఆరోజే కాదు...వచ్చి ఆర్నెల్లు అయినా...సుబ్బారావు ఏ నెలా అద్దె అడగనూ లేదు...వారు ఇవ్వనూ లేదు..


  ఓరోజు కొడుకు దగ్గరకు వెళ్లిన సుబ్బారావు భార్య ఆర్నెల్ల తర్వాత అమెరికా నుంచి ఊడిపడింది.

  

  కొన్నాళ్ళు బానేసాగింది. ఎందుకో...భర్త ప్రవర్తనలో తేడా కనిపించింది...సీఐడీ లా కాపుకాసింది.

  

  పరిష్టితి అర్థం చేసుకుంది. తన భర్తను ముగ్గులోకి దింపి కూటి కోసం చాలా పెద్ద వ్యాపారమే చేస్తున్న తల్లీ కూతుర్ల భాగోతాన్ని బయటపెట్టింది.

  

  భర్తకు నాలుగు చివాట్లేసి... తల్లీ కూతుర్ల అంతు చూసింది. ఇంట్లో ఉన్న కొద్దిపాటి సామానూ బయటకు గిరాటేసింది. కన్యాకుమారి జుట్టుపట్టుకుని ఈడ్చేసింది.

  

  అయినా వారిలో ఎలాంటి సిగ్గూ...అవమానమూ అనిపించలేదు.

  

  తల్లి కూతుర్ని పైకి లేవదీస్తూ...."పోదాం రావే కన్యాకుమారీ... మనకిదేమీ కొత్త కాదుగా. మన వృత్తిధర్మం మనం పాటించడం కూడా తప్పేనా...? ఈ ఇల్లు కాకపోతే మరో ఇల్లు దొరక్కపోతుందా" అంటూ రోడ్డు మీదకు నడిచారు.

  

   మళ్లీ...టులెట్ బోర్డుల కోసం గాలించడం మొదలెట్టారు ఆ తల్లీకూతుళ్ళు....!!*


          ****    *****   ****

  


   

   



Rate this content
Log in

Similar telugu story from Drama