సీతాకోకచిలుక
సీతాకోకచిలుక


నువ్వు మరీ ఓవర్ రియాక్ట్ అవుతున్నావ్ సుధా.
ఇప్పుడేమయ్యిందని. వాడు సీతాకోకచిలుకని పట్టుకొని దాని రెక్కలు తెంపేశాడు.
ఇంకోసారి చెప్తే చెయ్యకుండా ఉంటాడు.దానికి నువ్వు వాణ్ణి కొట్టడం సరి కాదు.
పసి పిల్లవాడికి ఏం తెలుస్తుంది చెప్పు అని మా అమ్మ నాకు క్లాస్ తీసుకుంది.
నాకేం చెప్పాలో తెలీలేదు.
తల్లి అయినప్పటినుంచీ అనుభవ్ నాకెంత ఆనందానుభూతుల్ని ఇచ్చాడో అలాగే నేనో మంచి పేరెంట్ గా ఉంటున్నానా లేదా అని ఇన్సెక్యూరిటీస్ కూడా ఇస్తున్నాడు.
మొన్న పెరట్లోకి ఓ సీతాకోకచిలుక వస్తే పట్టుకుని దాని రెక్కలు తెంపి విసిరేశాడు.దానితో నాకు కోపం వచ్చి బాగా కొట్టాను.
మూడేళ్ళు కూడా నిండలేదు వాడికి.
రెండు రోజుల నుండి నా దగ్గరకి రావడం లేదు.వాళ్ళ నాన్న చేతిని గట్టిగా హత్తుకొని పడుకుంటున్నాడు.
అమ్మ చెప్పింది కరెక్టే.నేనే వాడికి చెప్పాలి.ప్రతి ప్రాణి గురించీ.ప్రాణం గురించి.
మనషి గురించి.మనందరి మనుగడకూ ఆధారమైన ప్రకృతి గురించి.ఒక్క రోజులో సాధ్యం కాదు.
కానీ అది నా బాధ్యత.తొలి గురువును తల్లిని నేనే కదా.
అనుభవ్ కిటికీ లోంచి బయటికి చూస్తున్నాడు.
నేను తన వైపు కదిలాను కర్తవ్యం గుర్తుకు వచ్చి.